AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో పోలీస్‌ శాఖలో భారీగా SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు!

పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఫోరెన్సిక్‌ తదితర విభాగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. 2026 జాబ్‌ క్యాలెండర్‌లో పోలీసు, అనుబంధ శాఖలకు సంబంధించిన పలు పోస్టులను చేర్చింది..

ఏపీలో పోలీస్‌ శాఖలో భారీగా SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు!
AP Police Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 16, 2026 | 11:14 AM

Share

అమరావతి, సెప్టెంబర్ 16: మొత్తం 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్లు జారీ చేసింది. పోలీసు శాఖలో మొత్తం 438 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (SI) పోస్టులు ఉన్నాయి. వీటిలో సివిల్‌ విభాగంలో 253, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లో 116, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (SPF)లో 9, కమ్యూనికేషన్స్‌ విభాగంలో 50, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ (PTO)లో 10 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 1156 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ ఉంది. ఇందులో సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, ఫైర్‌, జైళ్లతో పాటు ఇతర అనుబంధ విభాగాల పోస్టులు ఉన్నాయి. పోలీస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో 200 కానిస్టేబుల్‌ పోస్టులు ఉండగా.. పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో డ్రైవర్లు, మెకానిక్‌ పోస్టులు ఉన్నాయి.

రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖలో 158 ఫైర్‌మెన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే జైళ్లు, సంస్కరణ సేవల శాఖలో 171 వార్డర్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో పురుష, మహిళా వార్డర్‌ పోస్టులు ఉన్నాయి. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఫిజికల్‌ విభాగంలో 10, కెమికల్‌ విభాగంలో 13, బయాలజీ/సెరాలజీ విభాగంలో 20 పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మొత్తం పోస్టుల వివరాలు ఇవే..

  • SI (SPF) పోస్టులు: 9
  • SI (కమ్యూనికేషన్) పోస్టులు: 50
  • SI (PTO) పోస్టులు: 10
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (FSL) పోస్టులు: 43
  • PC (సివిల్/AR) పోస్టులు: 827
  • ఫైర్‌మెన్‌ పోస్టులు: 158
  • వార్డర్ పోస్టులు: 171
  • PC (కమ్యూనికేషన్) పోస్టులు: 200
  • PC (మెకానిక్స్‌, డ్రైవర్లు) పోస్టులు: 213

ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ, ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను APSLPRB ప్రత్యేకంగా ప్రకటించనుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, పరీక్షా విధానం, దరఖాస్తు తేదీలను పూర్తిగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

Follow Us
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..