UPI స్కామ్.. కస్టమర్‌కు వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంక్‌ను ఆదేశించిన కమిషన్!
చండీగఢ్‌లో ఒక వ్యక్తి UPI మోసంలో రూ.99,940 కోల్పోయారు. SBI మొదట నిరాకరించినప్పటికీ, వినియోగదారుల కమిషన్ బాధితుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. RBI మార్గదర్శకాలను ఉటంకిస్తూ, కస్టమర్ బాధ్యత వహించరని స్పష్టం చేసింది. బ్యాంక్ ఇప్పుడు అసలు మొత్తంతో పాటు వడ్డీని కూడా తిరిగి చెల్లించాలి.

చండీగఢ్‌లో ఒక వ్యక్తి UPI ద్వారా మోసపోయిన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ మోసంలో అతను రూ.99,940 పోగొట్టుకున్నాడు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతనికి పరిహారం చెల్లించబోతోంది. చండీగఢ్ వినియోగదారుల కమిషన్ ఆ వ్యక్తికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంజీవ్ కుమార్ శర్మకు చండీగఢ్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉంది. జూలై 21న మధ్యాహ్నం 2:50 గంటలకు సంజీవ్ కుమార్ శర్మ మొబైల్ ఫోన్‌కు వరుసగా UPI లావాదేవీ సందేశాలు వచ్చాయి. కొద్దిసేపటికే సంజీవ్ ఖాతా నుండి మూడుసార్లు రూ.25,060, రూ.24,560, రూ.200 డెబిట్ అయ్యాయి.
అలా అలా మొత్తంగా సంజీవ్ ఖాతా నుండి రూ.99,940 కట్ అయ్యాయి. సంజీవ్ వెంటనే చర్య తీసుకున్నాడు. అతను మొదట మోసాన్ని నివేదించి తన ఖాతా, మొబైల్ నంబర్ రెండింటినీ మూసివేశాడు. అతను సైబర్ సెల్, బ్యాంకుకు కూడా ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో బ్యాంకు అతని ఫిర్యాదును నమోదు చేసి, సత్వర చర్య తీసుకుంటామని హామీ ఇచ్చింది. చర్య తీసుకున్న 15 రోజుల్లోపు అతని డబ్బు తిరిగి ఇస్తామని, అతనికి తెలిపారు.
కానీ చాలా రోజులు గడిచాయి, సంజీవ్ వారి చర్యల గురించి విచారించడానికి పదేపదే బ్యాంకును సంప్రదించాడు. అతనికి ఎటువంటి స్పందన రాలేదు. నిరాశ చెందిన సంజీవ్ చండీగఢ్ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. UPI ద్వారా డబ్బు బదిలీ అయినట్లు కమీషన్ ముందు బ్యాంక్ వాదించింది. UPI పిన్ లేకుండా UPI లావాదేవీలు అసాధ్యం, అందువల్ల ఈ విషయంలో బ్యాంకుకు ఎటువంటి ప్రమేయం లేదు. అంతేకాకుండా బ్యాంక్ ఎటువంటి సేవా లోపాలను లేవని తెలిపింది. ఫిర్యాదును కొట్టివేయాలని కోరింది.
అయితే కమిషన్ మాత్రం కస్టమర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో కమిషన్ జూలై 6, 2017న జారీ చేసిన RBI సర్క్యులర్‌ను ఉదహరించింది. ఇది జాతీయ కమిషన్, బాంబే హైకోర్టు ఇచ్చిన అనేక నిర్ణయాలను కూడా ఉదహరించింది. థర్ట్ పార్టీ అక్రమ లావాదేవీని నిర్వహించినట్లయితే బ్యాంకు వైపు నుండి ఏదైనా తప్పు ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా, కస్టమర్ బాధ్యత వహించరని కమిషన్ పేర్కొంది. సంజీవ్ (కస్టమర్)కు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కమిషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దీనితో బ్యాంకు సంజీవ్‌కు రూ.99,940 చెల్లించాల్సి ఉంటుందని, నష్టం జరిగిన తేదీ నుండి 9 శాతం వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ ఆదేశించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




