AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: టోల్ ట్యాక్స్ విషయంలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వీడియో వైరల్.. అసలు నిజం ఏంటంటే..?

తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి పార్లమెంట్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టోల్ బూత్‌కు 60 కిలో మీటర్ల మీ పరిధిలో నివసించే ప్రజలు కేవలం వారి ఆధార్ కార్డు చూపడం ద్వారా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా టోల్ గేట్ దాటవచ్చంటూ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ ఆధార్ కార్డు ఆధారంగా టోల్ పాస్ మంజూరు చేస్తారని, పేర్కొన్నారు.

Fact Check: టోల్ ట్యాక్స్ విషయంలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వీడియో వైరల్.. అసలు నిజం ఏంటంటే..?
Nitin Gadkari
Nikhil
|

Updated on: Aug 07, 2024 | 7:00 AM

Share

ఇటీవల సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ప్రతి వార్త చాలా వేగంగా జనబాహుళ్యంలోకి వెళ్లిపోతుంది. నిజానిజాలు తెలియకుండానే ఆ వార్త అందరికీ చేరుతుంది. తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి పార్లమెంట్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టోల్ బూత్‌కు 60 కిలో మీటర్ల మీ పరిధిలో నివసించే ప్రజలు కేవలం వారి ఆధార్ కార్డు చూపడం ద్వారా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా టోల్ గేట్ దాటవచ్చంటూ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ ఆధార్ కార్డు ఆధారంగా టోల్ పాస్ మంజూరు చేస్తారని, పేర్కొన్నారు. 60 కిలో మీటర్లలోపు ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. మూడు నెలల్లో ఈ విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అయితే ఆ వీడియో నిజమా? కాదా? వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం. 

అయితే కొంత మంది ఔత్సాహికులు గూగుల్ ఓపెన్ సెర్చ్ ఉపయోగించి ఈ వీడియో నిజమా? కాదా? అని వివిధ వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను పరిశీలించారు. అయితే వైరల్ అవుతున్న వీడియో నితిన్ గడ్కరీ 2022 నాటిదని గుర్తించారు. అలాగే ఆయన ప్రసంగంలో ఒకరి ఇంటి నుంచి 60 కి.మీ లోపు ఉన్న టోల్ ప్లాజాలకు టోల్‌లను మాఫీ చేస్తామని ప్రకటించలేదు. ముఖ్యంగా వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే జాతీయ రహదారిపై 60 కిలోమీటర్ల పరిధిలోపు టోల్ ప్లాజా ఉంటే మూసేస్తామని చెప్పారు. వైరల్ అవుతున్న వీడియోలో కూడా గడ్కరీ అదే మాట చెప్పడం వినవచ్చు. ఇదే విషయాన్ని ఎన్‌హెచ్ఏఐ కూడా వెబ్‌సైట్‌లో కూడా రెండు టోల్ బూత్‌ల మధ్య దూరం 60 కి.మీ కంటే ఎక్కువ ఉండాలని పేర్కొంది. 

దూరదర్శన్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో మార్చి 22, 2022న అప్‌లోడ్ చేసిన పూర్తి వీడియో మార్ఫ్ చేశారని నిపుణులు చెబుతున్నారు. గడ్కరీ టోల్ ప్లాజాల సమీపంలోని నివాసితులకు ఆధార్ కార్డ్‌ల ద్వారా పాస్‌లను అందించడం గురించి చర్చించారు, కానీ ఒకరి ఇంటి నుండి 60 కి.మీ లోపు టోల్‌లను మాఫీ చేయడం గురించి ప్రస్తావించలేదు. కాబట్టి ప్రజలు ఇలాంటి తప్పుడు వీడియోలపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..