AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar App: ఇక ఆధార్‌ టెన్షన్ లేదు.. సరికొత్త యాప్ తెచ్చిన UIDAI.. అదిరే ఫీచర్స్ ఇవే.

UIDAI కొత్త ఆధార్ యాప్‌ను తీసుకొచ్చింది. ఇది మీ ఆధార్ వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో సురక్షితంగా, సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. దీన్ని వల్ల ఫిజికల్ కార్డుతో పని ఉండదు. ఈ యాప్ ఫోర్జరీ, బయోమెట్రిక్ లాక్ లాక్ వంటి ఎన్నో ఫీచర్లను అందిస్తుంది.

Aadhaar App: ఇక ఆధార్‌ టెన్షన్ లేదు.. సరికొత్త యాప్ తెచ్చిన UIDAI.. అదిరే ఫీచర్స్ ఇవే.
Uidai Launches New Aadhaar App
Krishna S
|

Updated on: Nov 12, 2025 | 1:34 PM

Share

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తాజాగా సరికొత్త ఆధార్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది పౌరులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ వివరాలను మరింత సురక్షితంగా, సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ గుర్తింపు ప్లాట్‌ఫామ్ ద్వారా ఇకపై భౌతిక ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం పూర్తిగా తొలగిపోనుంది. ఈ కొత్త యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కొత్త ఆధార్ యాప్ కీలక ఫీచర్స్

కొత్త ఆధార్ యాప్ యూజర్లకు భద్రత, ప్రైవసీని పెంచే అనేక కీలక ఫీచర్లను అందిస్తుంది:

డిజిటల్ ఫార్మాట్: ఈ యాప్ కార్డుదారులకు వారి ఆధార్ కార్డును భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగించి, డిజిటల్ ఫార్మాట్‌లో అందిస్తుంది. అసురక్షిత PDF కాపీల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫోర్జరీ నుండి రక్షణ: ఆధార్ వివరాలను ఎవరూ ఫోర్జరీ చేయలేరు. సురక్షితంగా ఉంటుంది.

కుటుంబ సభ్యుల ఆధార్: ఒక్కరే తమతో సహా తమ కుటుంబ సభ్యుల ఐదుగురి ఆధార్ ప్రొఫైల్‌లను ఈ యాప్‌లో పెట్టుకోవచ్చు.

బయోమెట్రిక్ లాక్: అవసరం లేనప్పుడు మీ బయోమెట్రిక్ డేటాను లాక్ చేసి ఉంచుకోవచ్చు.

QR కోడ్: దీని ద్వారా హోటళ్లు లేదా దుకాణాలలో అడిగినప్పుడు మీ వివరాలను సులభంగా స్కాన్ చేసి ఇవ్వవచ్చు.

అప్‌డేట్ వివరాలు: మీరు ఆధార్‌లో ఏదైనా మార్పు (అప్‌డేట్) చేస్తే, అది ఈ యాప్‌లో వెంటనే కనిపిస్తుంది.

పాత mAadhaar యాప్‌కు.. దీనికి తేడా ఏమిటి?

కొత్త ఆధార్ యాప్: ఇది మీ ఆధార్ వివరాలను కేవలం సురక్షితంగా నిల్వ చేయడానికి, చూపించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దీనిలో సేవలు పరిమితం.

mAadhaar యాప్: ఇది డిజిటల్ ఆధార్ డౌన్‌లోడ్ చేయడం, కొత్త పీవీసీ కార్డు ఆర్డర్ చేయడం, మొబైల్ నంబర్ వెరిఫై చేయడం వంటి చాలా రకాల సేవలను అందిస్తుంది.

యాప్‌ను రిజిస్టర్ చేసుకోవడం ఎలా?

  • ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  • మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.
  • మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ లేదా వేరే నంబర్‌తో రిజిస్టర్ అవ్వండి.
  • మీ 12-అంకెల ఆధార్ నంబర్ మరియు OTPని ఎంటర్ చేసి ధృవీకరించండి.
  • యాప్ అడిగితే, ఫేస్ స్కాన్ చేయండి
  • చివరగా, యాప్‌ను ఓపెన్ చేయడానికి ఆరు అంకెల పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి.
  • ఇది పూర్తయితే, మీరు మీ డిజిటల్ ఆధార్‌ను సురక్షితంగా ఉపయోగించవచ్చు.