Udaan Mega Bharat Sale: భారతదేశపు అతిపెద్ద బిజినెస్‌ టూ బిజినెస్‌ అమ్మకం.. మెగా భారత్‌ సేల్‌ను ప్రకటించిన ఉడాన్‌

Udaan Mega Bharat Sale: బిజినెస్‌ టూ బిజినెస్‌ ఆన్‌లైన్‌ వేదిక ఉడాన్‌ మెగా భారత్‌ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌ ఆగస్టు 9 నుంచి ఆగస్టు 14 వరకు కొనసాగనుంది.

Udaan Mega Bharat Sale: భారతదేశపు అతిపెద్ద బిజినెస్‌ టూ బిజినెస్‌ అమ్మకం.. మెగా భారత్‌ సేల్‌ను ప్రకటించిన ఉడాన్‌
Follow us
Subhash Goud

|

Updated on: Aug 09, 2021 | 2:23 PM

Udaan Mega Bharat Sale: బిజినెస్‌ టూ బిజినెస్‌ ఆన్‌లైన్‌ వేదిక ఉడాన్‌ మెగా భారత్‌ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌ ఆగస్టు 9 నుంచి ఆగస్టు 14 వరకు కొనసాగనుంది. ఎఫ్‌ఎంసీజీ, ఆహారోత్తుల విభాగంలో చిన్న వర్తకుల కోసం భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్‌ సేల్, ఇన్‌స్టాంట్‌ క్యాష్‌ డిస్కౌంట్స్, బై వన్‌ గెట్‌ వన్‌తోపాటు ఇతర ఆఫర్లు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. 5 లక్షల పైచిలుకు వర్తకులకు ఈ భారీ అమ్మకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. వివిధ వ్యాపార విభాగాల్లో గడిచిన 18 నెలల్లో రూ.4,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు చేసినట్టు ఉడాన్‌ వెల్లడించింది.

ఈ సేల్‌లో భాగంగా జయభూమి, కెప్టెన్‌ హార్వెస్ట్‌, అన్నభూమి వంటి బ్రాండ్లు పై ప్రత్యేకంగా ఈ వేదిక వద్ద భారీ రాయితీలు లభించనున్నాయి. ఉడాన్‌ యొక్క ఆహార వ్యాపారంలో ఎఫ్‌ఎంసీజీ, స్టాపల్స్‌, ఫ్రెష్‌ ప్రొడక్ట్స్‌ కూడా భాగంగా ఉండటంతో పాటుగా కిరాణా, బేవరేజస్‌, చిరుధాన్యాలు, వంటనూనెలు, వ్యక్తిగత సంరక్షణ, తాజా మరియు డెయిరీ ఉత్పత్తులపై ఈ ఆఫర్లు లభించనున్నాయి. ఈ సందర్భంగా ఉడాన్‌- ఫుడ్‌ అండ్‌ బిజినెస్‌, హెడ్‌ వివేక్‌ గుప్తా మాట్లాడుతూ, దేశంలోని కిరాణా, చిరు రిటైలర్ల ప్రయోజనం కోసం ఉడాన్‌ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించబోతున్న మెగా భారత్‌ సేల్‌ ప్రకటిస్తుండటం ఎంతో సంతోషంగా ఉన్నామని అన్నారు. ఈ సేల్‌లో భాగంగా మా రిటైలర్లు, తయారీ భాగస్వాములు, హోల్‌సేల్‌ భాగస్వాములకు మద్దతు అందించనుంది. దీనిద్వారా వారు అధికంగా పొదుపు చేయడంతో పాటుగా వారి వినియోగదారులకు మరింత విలువను అందించగలరని అన్నారు.

ఇవీ కూడా చదవండి

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారుడు చనిపోయినట్లయితే.. డబ్బులను క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా..?.. ప్రాసెస్‌ ఏమిటి?

Airtel: మీరు ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతున్నారా..? అయితే ఉచితంగా 4 లక్షల బెనిఫిట్స్‌.. ఎలాగంటే..!