Bank Rules: ఆ బ్యాంకుల చెక్‌బుక్‌లు ఇకపై చెల్లవు.. వెంటనే కొత్తవి తీసుకోండి..
ప్రభుత్వం కొద్దికాలంగా బ్యాంకులను విలీనం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇటీవల విలీనం అయ్యాయి.

Bank Rules: ప్రభుత్వం కొద్దికాలంగా బ్యాంకులను విలీనం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇటీవల విలీనం అయ్యాయి. అదేవిధంగా అలహాబాద్ బ్యాంక్ ను ఇండియన్ బ్యాంక్ లో విలీనం చేశారు. ఈ బ్యాంకుల విలీనం ప్రక్రియ పూర్తి అయిపొయింది. దీంతో కస్టమర్లు తమ ఎకౌంట్లకు సంబంధించిన చాలా విషయాల్లో మార్పులు గమనించవచ్చు. అందులో ముఖ్యమైనది చెక్ బుక్. బ్యాంకులు విలీనం తరువాత విలీనం అయినా బ్యాంకులకు సంబంధించిన చెక్ బుక్ లు చెల్లవు. నిర్ణీత కాలవ్యవధి లోపు ఆ చెక్ బుక్ లను మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (OBC) పాత చెక్ బుక్ లు అక్టోబర్ 1 నుంచి చెల్లవు. అందువలన సమస్యలు లేకుండా ఉండడం కోసం వీలైనంత త్వరగా కొత్త చెక్ బుక్ తీసుకోవడం అవసరం.
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) లో విలీనం అయ్యాయి. ఓబీసీ అదేవిధంగా, యూబీఐ యొక్క చెక్ పుస్తకాలు అక్టోబర్ 1 నుండి పనిచేయవని పీఎన్బీ తెలిపింది. కాబట్టి మీరు ఈ బ్యాంకుల పాత చెక్ బుక్ కలిగి ఉంటే, తదుపరి లావాదేవీలలో మీకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోండి.
దీని కోసం మీరు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు. అలాగే, బ్యాంకును సందర్శించడం ద్వారా కస్టమర్‌లు కొత్త చెక్ బుక్‌ను సులభంగా పొందవచ్చు. దీని గురించి మరింత సమాచారం కోసం కస్టమర్‌లు టోల్ ఫ్రీ నంబర్ 18001802222 కి కాల్ చేయవచ్చు.
అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్‌లో విలీనం
అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్‌లో విలీనం చేశారు. దీని దృష్ట్యా, అలహాబాద్ బ్యాంక్ వినియోగదారులు ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ కొత్త చెక్ బుక్ తీసుకోవాల్సి ఉంటుంది.. అక్టోబర్ 1 నుండి, అలహాబాద్ బ్యాంక్ పాత చెక్ బుక్ చెల్లదు. దాని నుండి ఎలాంటి లావాదేవీ ఆమోదం పొందదు. అలహాబాద్ బ్యాంక్ ఖాతాదారులు బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
IFSC అంటే ఏమిటి?
ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ (IFSC) అనేది 11 అంకెల కోడ్. ఈ కోడ్‌లో, మొదటి నాలుగు అక్షరాలు బ్యాంక్ పేరును సూచిస్తాయి. ఆన్‌లైన్ చెల్లింపు సమయంలో IFSC ఉపయోగించబడుతుంది. బ్యాంక్ ఏదైనా శాఖను ఆ కోడ్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. బ్యాంకు ప్రతి శాఖకు ప్రత్యేక IFSC ఉంటుంది.
MICR కోడ్ అంటే ఏమిటి?
మాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ (MICR) కోడ్ 9 అంకెల కోడ్. ఇది ఎలక్ట్రానిక్ క్లియరింగ్ వ్యవస్థను ఉపయోగించే బ్యాంక్ శాఖలను గుర్తిస్తుంది. ఈ కోడ్‌లో బ్యాంక్ కోడ్, ఖాతా వివరాలు, మొత్తం.. చెక్ నంబర్ వంటి వివరాలు ఉంటాయి. ఈ కోడ్ చెక్ లీఫ్ దిగువన ఉంటుంది.
ఇవి కూడా చదవండి: