AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ, కాఫీ తాగే డబ్బులతో కూడా మీరు ధనవంతులు కావొచ్చు! ఈ సూపర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ఇదే..

ప్రతి నెలా టీ, కాఫీ ఖర్చుల నుండి రూ.1000 ఆదా చేసి, దానిని SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ధనవంతులు కావచ్చని ఈ కథనం వివరిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడి, చక్రవడ్డీ శక్తితో 15-20 ఏళ్లలో భారీ మొత్తాన్ని ఎలా పొందవచ్చో, ఆర్థిక స్వాతంత్ర్యం ఎలా సాధించవచ్చో తెలుసుకోండి.

టీ, కాఫీ తాగే డబ్బులతో కూడా మీరు ధనవంతులు కావొచ్చు! ఈ సూపర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ఇదే..
Indian Currency 4
SN Pasha
|

Updated on: Nov 28, 2025 | 7:00 AM

Share

చాలా మంది ప్రతి రోజు కనీసం నాలుగు సార్లు టీ, కాఫీలు తాగుతుంటారు. అంటే రోజుకు ఓ రూ.50 వేసుకున్నా.. నెలకు రూ.1500 కేవలం టీ, కాఫీ తాగేందుకే ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ డబ్బులో కేవలం రూ.1000 మీరు సరైన మార్గంలో ఇన్వెస్ట్‌ ఈజీగా ధనవంతులు కావొచ్చు. మరి ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ఏంటి? ఎలా పెట్టుబడి పెట్టాలనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ప్రతి నెలా కేవలం రూ.1000 SIPలో ఇన్వెస్ట్‌ చేస్తే ధనవంతులు అవ్వాలనే మీ కల నిజం అవ్వొచ్చు. కాంపౌండింగ్‌కి ఉండే శక్తి అలాంటిది. పెట్టుబడిదారులు తరచుగా తమకు ఎంత రాబడి వస్తుందో లేదా ఆల్ఫా ఎలా పొందాలో ఆలోచిస్తారు, కానీ వారు తరచుగా తమ నియంత్రణలో ఉన్న దానిపై దృష్టి పెట్టరు. వారు ఎంత డబ్బు పెట్టుబడి పెడతారు, వారు ఎంతకాలం పెట్టుబడిలో ఉంటారు అనే విషయాలు వారి రాబడిని డిసైడ్‌ చేస్తాయి. ముఖ్యంగా లాంగ్‌ టర్మ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడి అందుకొని లక్షాధికారిగా మారొచ్చు.

ఒక మంచి మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకొని.. అందులో నెలకు కనీసం రూ.1000 నుంచి రూ.2000 పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే.. ఓ 15 నుంచి 20 ఏళ్లకు 12 శాతం వార్షిక వడ్డీ రేటు, చక్రవడ్డీ అంచనా వేసుకున్నా.. మెచ్యూరిటీ నాటికి మీ చేతికి ఒక భారీ మొత్తం రావడం ఖయం. అయితే మ్యూచువల్‌ ఫండ్స్‌లో సరైన దాన్ని ఎంచుకొని, క్రమ శిక్షణగా క్రమం తప్పకుండా దీర్ఘ కాలం పెట్టుబడి పెడితేనే మీ లక్ష్యాన్ని చేరుకుంటారని గుర్తుంచుకోండి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి