Traffic Rules: ద్విచక్ర వాహనదారులు జాగ్రత్త.. మారిన ట్రాఫిక్‌ రూల్స్‌

సెప్టెంబర్ నెల ప్రారంభం కాగానే ట్రాఫిక్ రూల్స్ మారిపోయాయి. మీకు ద్విచక్ర వాహనం ఉండి, మీరు ప్రతిరోజూ ఇంటి నుండి కార్యాలయానికి వెళ్తుంటే ఈ వార్త మీ కోసమే. ఇప్పుడు స్కూటర్, బైక్ నడుపుతున్నప్పుడు మీ వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించాల్సి..

Traffic Rules: ద్విచక్ర వాహనదారులు జాగ్రత్త.. మారిన ట్రాఫిక్‌ రూల్స్‌
Traffice Rules
Follow us
Subhash Goud

|

Updated on: Sep 02, 2024 | 9:42 AM

సెప్టెంబర్ నెల ప్రారంభం కాగానే ట్రాఫిక్ రూల్స్ మారిపోయాయి. మీకు ద్విచక్ర వాహనం ఉండి, మీరు ప్రతిరోజూ ఇంటి నుండి కార్యాలయానికి వెళ్తుంటే ఈ వార్త మీ కోసమే. ఇప్పుడు స్కూటర్, బైక్ నడుపుతున్నప్పుడు మీ వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. లేకుంటే మీకు జరిమానా తప్పదు. మోటారు వాహన చట్టం ప్రకారం, వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించడం తప్పనిసరి.

హైకోర్టు ఆదేశాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని పెద్ద నగరమైన విశాఖపట్నంలో నేటి నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. అయితే ఈ నిబంధన దేశ వ్యాప్తంగా గతంలో కూడా అమలు చేశారు. ఇప్పుడు వెనుక కూర్చున్న వ్యక్తి బైక్ నడుపుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్మెట్ ధరించాల్సిందే. నగరంలో పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

రూ.1035 జరిమానా

నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1035 జరిమానా విధించనున్నట్లు విశాఖపట్నం పోలీసులు తెలిపారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్స్‌ను వచ్చే మూడు నెలల పాటు సస్పెండ్ చేయవచ్చు. అలాగే, ఐఎస్‌ఐ గుర్తు ఉన్న హెల్మెట్‌లను మాత్రమే ధరించడం తప్పనిసరి అని, అలా చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు.

ఇది కూడా చదవండి: Financial Rules: వినియోగదారులకు అలర్ట్‌.. వీటికి సెప్టెంబర్‌ 30తో గడువు ముగింపు

ఈ నగరంలో పెను మార్పులు:

ఆంధ్రప్రదేశ్‌తో పాటు ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి మార్పులు చేయవచ్చు. పిలియన్ రైడర్‌లు హెల్మెట్ ధరించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నారు. సో.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. హెల్మెట్‌ ధరించడం వల్ల మీ ప్రాణాలను రక్షించుకోవచ్చు. ముందు రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠింగా మారుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.