AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Rules: వినియోగదారులకు అలర్ట్‌.. వీటికి సెప్టెంబర్‌ 30తో గడువు ముగింపు

డబ్బుకు సంబంధించిన ఈ నియమాలు సెప్టెంబర్ 2024లో మారబోతున్నాయి. ఎందుకంటే ఈ అంశాలకు సెప్టెంబర్‌ చివరి గడువు. ఈ నెలలోగా ఈ పనులు పూర్తి చేసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే మీ జేబుపై భారం పెరిగే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకుందాం..

Financial Rules: వినియోగదారులకు అలర్ట్‌.. వీటికి సెప్టెంబర్‌ 30తో గడువు ముగింపు
Financial Deadlines
Subhash Goud
|

Updated on: Sep 02, 2024 | 8:33 AM

Share

డబ్బుకు సంబంధించిన ఈ నియమాలు సెప్టెంబర్ 2024లో మారబోతున్నాయి. ఎందుకంటే ఈ అంశాలకు సెప్టెంబర్‌ చివరి గడువు. ఈ నెలలోగా ఈ పనులు పూర్తి చేసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే మీ జేబుపై భారం పెరిగే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకుందాం.

సెప్టెంబరు 2024లో ఆర్థిక నియమాలు, గడువు:

  1. సెప్టెంబరు ప్రారంభంతో అనేక ఆర్థిక పనులకు గడువు సమీపిస్తోంది. దీనితో పాటు, వచ్చే నెల నుండి ఇలాంటి అనేక మార్పులు జరగబోతున్నాయి. ఇది సాధారణ ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
  2. ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు సెప్టెంబర్ 14, 2024తో ముగుస్తుంది. UIDAI ఉచిత ఆధార్ అప్‌డేట్‌ తేదీని జూన్ 14 నుండి సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. ఆ గడువు తేదీ తర్వాత మళ్లీ పొడిగింపు ఉంటుందా? లేదా అనేది తెలియదు. అటువంటి పరిస్థితిలో మీరు ఉచిత ఆధార్ అప్‌డేట్‌ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, వీలైనంత త్వరగా ఈ పనిని చేసుకోవడం ఉత్తమం.
  3. IDBI బ్యాంక్ 300 రోజులు, 375 రోజులు, 444 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే వీలైనంత త్వరగా చేయండి.
  4. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 222 రోజులు, 333 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ పథకం గడువు వచ్చే నెలతో ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇదే చివరి అవకాశం.
  5. ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలు – Ind Super 300 Days, Ind Super 400 Daysలో పెట్టుబడి పెట్టడానికి గడువు కూడా సెప్టెంబర్ 30తో ముగుస్తుంది.
  6. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అమృత్ కలాష్ పథకం కింద పెట్టుబడి పెట్టడానికి గడువు కూడా సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఈ పథకం కింద బ్యాంక్ 400 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ పథకంపై సాధారణ పౌరులకు 7.10 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అదే సమయంలో SBI Wecare FD పథకం గడువు కూడా అదే రోజుతో ముగుస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి