Toyota X-Prologue: త్వరలో టొయోటా ఎలక్ట్రిక్‌ కారు ఎక్స్-ప్రోలాగ్ విడుదల.. అత్యాధునిక ఫీచర్స్‌

Toyota X-Prologue: పర్యావరణ కాలుష్యం గురించి రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది. అతిగా కార్బన్‌ ఉద్గారాల విడుదల వల్ల కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. ముఖ్యంగా..

Toyota X-Prologue: త్వరలో టొయోటా ఎలక్ట్రిక్‌ కారు ఎక్స్-ప్రోలాగ్ విడుదల.. అత్యాధునిక ఫీచర్స్‌
Toyota X Prologue Electric Car
Follow us
Subhash Goud

|

Updated on: May 24, 2021 | 3:57 PM

Toyota X-Prologue: పర్యావరణ కాలుష్యం గురించి రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది. అతిగా కార్బన్‌ ఉద్గారాల విడుదల వల్ల కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. ముఖ్యంగా వాహనాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలను నియంత్రించేందుకు ఆటో పరిశ్రమ తీవ్రంగా కృషి చేస్తోంది. కొన్ని వాహన సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే జపాన్ వాహన తయారీ సంస్థ టొయోటా విద్యుత్తు కార్లను తయారు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అందించాలనే లక్ష్యం పెట్టుకుంది. అదే ఎక్స్-ప్రోలాగ్. ఈ విద్యుత్ వాహనం మార్చి 17న విడులైంది.

ఇటీవల ఈ కారు ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది సదరు సంస్థ. సీ-ఆకారంలో ఎల్ఈడీ లైట్లతో ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తోంది ఎక్స్-ప్రోలాగ్ కారు. అంతేకాదు చూడగానే ఆకట్టుకునేలా ఈ కారును రూపొందించింది సంస్థ. లార్జ్ క్రాస్ ఓవర్లను కలిగి ఉండి మినీ వ్యానులా కనిపిస్తోంది. ఈ కారుకు సంబంధించిన వేరియంట్లు, ఫీచర్లు లాంటి మరిన్ని వివరాలను విడుదల రోజున బహిర్గతం చేయనుంది జపాన్ ఆటోమేకర్. ఫ్రంట్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ తో పాటు ఆల్-వీల్ డ్రైవ్ సపోర్ట్ ఇందులో ఉంది. వైవిధ్యమైన బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్‌తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

ప్రస్తుతానికి ఈ కారును ఐరోపాలోనే మాత్రమే విక్రయానికి ఉంచనుంది టొయోటా సంస్థ. దీంతో పాటు జపాన్ లో తయారు చేయనుండటం వల్ల ఆ దేశంలోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే భారత్‌లో ఎప్పుడు విడుదల అవుతుందనేదానిపై క్లారిటీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ వాహనం టొయోటాకు చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు తెచ్చుకోనుంది.

ఇవీ కూడా చదవండి:

PhonePe Indus: ఫోన్‌ పే చేతికి కంటెంట్‌, యాప్‌ డిస్కవరీ ప్లాట్‌ఫామ్‌ ఇండస్‌ ఓఎస్‌.. డీల్‌ అంచనా రూ.440 కోట్లు

Amazon Prime: అమెజాన్ కీలక నిర్ణయం.. రెండు గంటల్లో డెలివరీ ఇచ్చే ప్రైమ్ సర్వీసును నిలిపివేస్తున్నట్లు ప్రకటన..!

Health Insurance: ప్రీమియం రెన్యువల్‌ రేటు పెరిగిందా..? మీ పాలసీని వేరే సంస్థకు ఇలా బదిలీ​ చేసుకోండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!