Today Petrol Price: కొనసాగుతోన్న చమురు ధరల పెరుగుదల… ఈరోజు లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందంటే..
Today Petrol Price: దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఎంతో కొంత ధరల పెరుగుదల కనిపిస్తూనే ఉంది. చమురు ధరల పెరుగుదలతో వాహనదారులు భయపడే పరిస్థితులు వచ్చాయనడంలో..

Today Petrol Price: దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఎంతో కొంత ధరల పెరుగుదల కనిపిస్తూనే ఉంది. చమురు ధరల పెరుగుదలతో వాహనదారులు భయపడే పరిస్థితులు వచ్చాయనడంలో అతిశయోక్తిలేదు. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టి నాటౌట్‌గా కొనసాగుతోంది. ఇక గురువారం దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం లీటర్ పెట్రోల్ ధర రూ.89.54గా ఉండగా.. (బుధవారం రూ.89.29), లీటర్ డీజిల్ ధర నిన్నటితో పోల్చితే 25 పైసలు పెరిగి రూ.79.95గా నమోదైంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ 25 పైసలు పెరిగి, రూ.96 వద్ద నమోదైంది. డీజిల్.. రూ.86.98గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.93.10గా నమోదవ్వగా (బుధవారం రూ.92.84).. డీజిల్ రూ. 87.20 (బుధవారం రూ.86.93)గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ రూ.92.83గా ఉండగా డీజిల్ ధర రూ.86.94గా ఉంది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.95.86 (బుధవారం రూ.95.54)గా ఉండగా.. డీజిల్ ధర రూ. 89.42 (బుధవారం రూ. 89.09) నమోదైంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.73 (బుధవారం రూ.94.59) ఉండగా.. డీజిల్ ధర విషయానికొస్తే రూ.88.83 (బుధవారం రూ.88.32) వద్ద కొనసాగుతోంది.