AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఉద్యోగం చేస్తూనే బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఇది చేస్తే నెలకు రూ. 30వేలు పక్కా..

భారతదేశంలో స్వీట్‌ల ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. ప్రతి వీధిలో స్వీట్ల దుకాణాలు కనిపిస్తాయి. అయితే స్వీట్‌లను ప్యాకింగ్ చేయడానికి పెట్టెలు అవసరం అవుతాయి. వాటిని స్వీట్లు అమ్మేవారు తయారు చేయరు. బయటే కొనుగోలు చేస్తారు. స్వీట్ల వ్యాపారులకు ఇది తప్పనిసరి అవసరం. అందుకే మీరు స్వీట్ బాక్స్‌ల తయారీ వ్యాపారం ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

Business Idea: ఉద్యోగం చేస్తూనే బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఇది చేస్తే నెలకు రూ. 30వేలు పక్కా..
Business Idea
Madhu
|

Updated on: Feb 15, 2024 | 8:53 AM

Share

ప్రైవేటు ఉద్యోగాల్లో చిరు జీతాలకు పనిచేస్తూ.. విపరీతమైన ఒత్తిళ్ల మధ్య నలిగి పోతున్నారా? డెడ్ మధ్య పనిచేయలేక విసిగిపోయారా? ఇక ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని తలంపుతో ఉన్నారా? లేదా వచ్చే జీతం సరిపోక ఏదైనా సైడ్ బిజినెస్ చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. దీనిలో చాలా తక్కువ పెట్టుబడితో.. చాలా సులువుగా చేసుకొనే వ్యాపారం ఆలోచనను మీకు తెలియజేస్తున్నాం. దీనిని కచ్చితమైన మార్కెటింగ్ స్ట్రాటజీతో ముందుకు తీసుకెళ్తే కనీసం నెలకు రూ. 30వేల సంపాదన కచ్చితంగా ఉంటుంది. అదే స్వీట్ బాక్సుల తయారీ బిజినెస్. ప్రస్తుతం ఈ బాక్సులకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. కేవలం స్వీట్లు మాత్రమే కాకుండా కేకులు, పేస్ట్రీలకు కూడా ఈ బాక్సులనే వినియోగిస్తున్నారు. ఈ నేపథయంలో సింపుల్ బిజినెస్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్వీట్లకు ఫుల్ గిరాకీ..

భారతదేశంలో స్వీట్‌ల ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. ప్రతి వీధిలో స్వీట్ల దుకాణాలు కనిపిస్తాయి. అయితే స్వీట్‌లను ప్యాకింగ్ చేయడానికి పెట్టెలు అవసరం అవుతాయి. వాటిని స్వీట్లు అమ్మేవారు తయారు చేయరు. బయటే కొనుగోలు చేస్తారు. స్వీట్ల వ్యాపారులకు ఇది తప్పనిసరి అవసరం. అందుకే మీరు స్వీట్ బాక్స్‌ల తయారీ వ్యాపారం ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మార్కెట్‌లో స్వీట్స్ బాక్స్‌లకు చాలా డిమాండ్ ఉంది. పైగా మన దేశంలో స్వీట్ వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారు. వివాహాలు, ఆచార సంప్రదాయ పండుగలు, పార్టీలలో స్వీట్ల అవసరం చాలా ఉంటుంది. అందుకే మన దేశంలో స్వీట్ల వ్యాపార మార్కెట్ చాలా పెద్దది. ఈ క్రమంలో ఈ స్వీట్లను ప్యాక్ చేయడానికి బాక్సులు అవసరం ఉంటుంది. వాటిని తయారు చేసే చిన్న యూనిట్ కనుక మీరు ఏర్పాటు చేసుకోగలిగితే మంచి రాబడి వస్తుంది.

ఏం అవసరం అంటే..

ఈ స్వీటు బాక్సుల తయారీకి మీకు కార్డ్‌బోర్డ్ అవసరం. కార్డ్‌బోర్డ్ వివిధ నాణ్యతలు, ధరల ప్రకారం మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే మీరు దాని నాణ్యతపై కూడా శ్రద్ధ వహించడం ముఖ్యం. మీరు మీ సమీప మార్కెట్ నుంచి కిలో రూ. 30 లేదా అంతకంటే తక్కువ ధరకు కార్డ్‌బోర్డ్‌ను సులభంగా కొనుగోలు చేసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

ఇవి కూడా చదవండి

మార్కెటింగ్ చాలా అవసరం..

మీరు మీ వ్యాపారం గురించి ప్రజలకు చెప్పాలి. మీ వ్యాపారం గురించి ప్రజలకు తెలియకపోతే మీకు వ్యాపార సంబంధిత క్లయింట్లు లభించరు. మీకు ఆర్డర్‌లు రావు. మీరు సీట్ల వ్యాపారి దుకాణానికి వెళ్లి దానిని మీ ఉత్పత్తి గురించి మీరే మార్కెట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా కావాలంటే పెద్ద పెద్ద జనాలు వచ్చే, వెళ్లే ప్రదేశాల్లో చిన్నా, పెద్దా బ్యానర్లు పెట్టి కావాలంటే ఆన్ లైన్ లో కూడా మార్కెట్ చేసుకోవచ్చు.

సంపాదన ఎలా ఉంటుంది..

మీరు ఒక నెలలో 100,000 లేదా అంతకంటే ఎక్కువ స్వీట్ బాక్స్‌లను డెలివరీ చేస్తే, మీరు సులభంగా రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు సంపాదించవచ్చు. ఈ వ్యాపారం పెద్దదైతే, మీరు దీనికి చాలా రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..