HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్.. రాత్రి నుంచి సేవలు నిలిపివేత.. ఎప్పటి వరకు అంటే..
HDFC Bank: ఈ అంతరాయం సమయంలో మీ అన్ని లావాదేవీలకు PayZapp వాలెట్‌ని ఉపయోగించమని బ్యాంకు సిఫార్సు చేస్తోంది. తమ సేవలను మరింతగా మెరుగుపరచడానికి సర్వర్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ విషయం బ్యాంకు తన వినియోగదారులకు మెయిల్ కూడా..

HDFC బ్యాంక్ ఖాతాదారులకు ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. జూలై 24వ తేదీన రాత్రి 10 గంటల నుంచి 25వ తేదీ తెల్లవారు జాము గంటల వరకు 6 గంటల పాటు బ్యాంకుకు సంబంధించిన సేవల్లో అంతరాయం ఏర్పడనున్నట్లు బ్యాంకు సూచించింది. కస్టమర్లు కొన్ని గంటల పాటు లావాదేవీలలో సమస్యలను ఎదుర్కొంటారు. సిస్టమ్ నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యాప్‌లోని సేవలను అంతరాయం ఏర్పడనుంది.
ఇది కూడా చదవండి: Mukesh Ambani: అంబానీ ఎంత అలసిపోయినా ఆ పని చేయందే నిద్రపోరట.. అంబానీ లైఫ్‌స్టైల్ గురించి మీకు తెలుసా?
అలాగే ఈ అంతరాయం సమయంలో మీ అన్ని లావాదేవీలకు PayZapp వాలెట్‌ని ఉపయోగించమని బ్యాంకు సిఫార్సు చేస్తోంది. తమ సేవలను మరింతగా మెరుగుపరచడానికి సర్వర్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ విషయం బ్యాంకు తన వినియోగదారులకు మెయిల్ కూడా పంపినట్లు తెలిపింది. సేవలను మరింతగా మెరుగు పర్చేందుకు వినియోగదారులు సహకరించాలని బ్యాంకు కోరింది.

ఇది కూడా చదవండి: రూ.6.29 లక్షలకే 7 సీటర్స్ కారు.. 6 ఎయిర్ బ్యాగ్స్.. చౌకైన కారు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








