Credit card: క్రెడిట్‌ కార్డు విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? నష్టపోతారు..

ఇదిలా ఉంటే క్రెడిట్‌ కార్డుల చెల్లింపులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని గణంకాలు చెబుతున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే.. 2023 నాటికి క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ రూ.4072 కోట్లకు పెరిగింది. అయితే క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో మీరు చేసే నిర్లక్ష్యం దీర్ఘకాలంలో మీ ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని...

Credit card: క్రెడిట్‌ కార్డు విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? నష్టపోతారు..
Credit Card
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 18, 2024 | 2:10 PM

ప్రస్తుతం దాదాపు ప్రతీ ఒక్కరూ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. బ్యాంక్‌ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ క్రెడిట్ కార్డ్‌ వినియోగం అనివార్యంగా మారింది. బ్యాంకుల మధ్య నెలకొన్న పోటీ, ప్రైవేటు బ్యాంకులు పెరగడం.. కారణం ఏదైనా క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. బ్యాంకులు సైతం క్రెడిట్ కార్డుల జారీ విషయంలో నిబంధనలను సడలించడం క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడానికి కారణాలు చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే క్రెడిట్‌ కార్డుల చెల్లింపులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని గణంకాలు చెబుతున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే.. 2023 నాటికి క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ రూ.4072 కోట్లకు పెరిగింది. అయితే క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో మీరు చేసే నిర్లక్ష్యం దీర్ఘకాలంలో మీ ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* చాలా మంది క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించే సమయంలో మినిమం బిల్‌ పే చేసి మిగతా మొత్తాన్ని వచ్చే నెలకు ఫార్వార్డ్ చేస్తుంటారు. అయితే ఇలా ఒకటిరెండు సార్లు చేస్తే పర్లేదు కానీ దీనినే కంటిన్యూ చేస్తే మాత్రం క్రెడిట్‌ హిస్టరీ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. మిగిలిన బకాయిలపై బ్యాంకులు పెద్ద ఎత్తున వడ్డీని వసూలు చేయడమే కాకుండా మీ సిబిల్ స్కోర్‌పై కూడా ప్రభావం పడుతుంది.

* ఇదిలా ఉంటే మనలో చాలా మంది ప్రతీ నెల క్రెడిట్ లిమిట్‌ను గరిష్టంగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల కూడా మీ క్రెడిట్ స్కోర్‌ పై ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌ రూ. లక్ష ఉంటే.. మీరు ప్రతీ నెల రూ. 80 వేల నుంచి రూ. 90 వేల వరకు ఉపయోగిస్తుంటే మిమ్మల్ని రిస్క్‌ కస్టమర్లగా భావించే అవకాశం ఉంటుంది. ఇది క్రెడిట్‌ లిమిట్ పెరగకుండా ఉండడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.

* ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగించినా ఆర్థికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మీరు ఎక్కువ కార్డులు తీసుకొని ఎక్కువ ట్రాన్సాక్షన్స్‌ చేస్తుంటే మీరు రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని బ్యాంకులు భావించే అవకాశం ఉంటుంది. ఇది మీ క్రెడిట్‌ పరిమితి తగ్గడానికి కారణంగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* అయితే క్రెడిట్ కార్డులను పూర్తిగా వినియోగించకపోయినా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు మీకు ఒక లక్ష రూపాయల లిమిట్‌తో ఒక క్రెడిట్ కార్డు ఉందని అనుకుందాం. మీరు కార్డును అస్సలు ఉపయోగించకపోతే.. మీ క్రెడిట్ లిమిట్ పెరగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..