Bank Loans: చౌకైన వడ్డీకే గృహ రుణాలు అందిస్తున్న బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు.. వడ్డీ ఎంత అంటే..

Bank Loans: ప్రస్తుతం బ్యాంకులు వివిధ రకాల రుణాలు అందిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులు బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సీ) రుణాలలో..

Bank Loans: చౌకైన వడ్డీకే గృహ రుణాలు అందిస్తున్న బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు.. వడ్డీ ఎంత అంటే..
Follow us

|

Updated on: Oct 14, 2021 | 9:03 AM

Bank Loans: ప్రస్తుతం బ్యాంకులు వివిధ రకాల రుణాలు అందిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులు బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సీ) రుణాలలో రుణగ్రహీతలు ముందుంటారు. ఆదాయం ఎక్కువగా ఉన్న వారు అత్యంత క్రెడిటబుల్‌ రుణ గ్రహితలుగా పరిగణించబడతారు. కొన్ని బ్యాంకులు ఎలాంటి జీతం లేనివారికి కొంత ఎక్కువ వడ్డీ రేట్లను వసూలు చేస్తూ రుణాలు అందిస్తుంటాయి. బ్యాంకు రుణాలలో ఉద్యోగస్తులకు, ఉద్యోగం లేనివారి మధ్య తేడాలు ఉంటాయి. కొన్ని వర్గాల వారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తుంటాయి. ఇక ఎలాంటి ఉద్యోగం లేని రుణ గ్రహితలకు అత్యల్ప వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సీ)లు ఇవే.

ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు 20 సంవత్సరాల కాలపరిమితితో రూ.75 లక్షల కంటే ఎక్కువ రుణం పొందిన వారికి రూ.6.55 శాతం వడ్డీని అందిస్తోంది. ఈఎంఐ రూ.56,139తో ఈ రుణాన్ని చెల్లించవచ్చు.

కోటక్‌ మహింద్రా బ్యాంకు: గత సంవత్సరం నుంచి చౌకైనా గృహ రుణాలను అందిస్తోంది. ఉద్యోగం లేని రుణ గ్రహితలకు వడ్డీ రేటు ప్రస్తుతం 6.6 శాతంగా ఉంది. ఈఎంఐ రూపంలో రూ.56,360 తో రుణాన్ని చెల్లించవ్చు.

ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ దిగ్గజం కూడా రూ.75 లక్షలకుపైగా గృహ రుణం తీసుకున్న వారికి రూ.6.66 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తోంది. ఈ రుణాన్ని 20 సంవత్సరాల కాలపరిమితితో ఈఏంఐ రూ.56,627 ఉంటుంది.

ఇక దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎలాంటి వేతనం లేని వినియోగదారులకు ఈ రుణంపై 6.7శాతం వడ్డీరేటు వసూలు చేస్తోంది. ఆస్తులను తనఖాతో రుణాలు అందించే హెచ్‌డీఎఫ్‌సీ, టాటా క్యాపిటల్‌ గృహ రుణాలపై తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. వారు ప్రతి నెల రూ.56,805 చొప్పున ఈఎంఐ చెల్లించవచ్చు.

ఇక బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎలాంటి ఉద్యోగం లేనివారికి ఒకే రకమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. రూ.75 లక్షలకంటే ఎక్కువ రుణానికి 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 20 సంవత్సరాల కాలపరిమితితో ఈఎంఐ రూ.57,027 వరకు పడుతుంది. ఇక ఐడీబీఐ బ్యాంకు కూడా ఇదే వడ్డీ రేటును అందిస్తోంది.

ఇక ఐసీఐసీఐ బ్యాంకు గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఒకే రకమైన వడ్డీ రేటును విధిస్తోంది. రూ.75 లక్షలకు పైగా రుణంపై 6.75 శాతం వడ్డీ విధిస్తోంది. 20 సంవత్సరాల కాలపరిమితితో రూ.57,027 ఈఎంఐ తో చెల్లించవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Punjab National Bank: బంగారు అభరణాల రుణాలపై రేట్లు తగ్గించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్..!

Credit Cards: పండగ సీజన్‌లో క్రెడిట్‌ కార్డు ద్వారా షాపింగ్‌ చేస్తున్నారా? తప్పకుండా గుర్తించుకోవాల్సిన విషయాలు

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..