Petrol Diesel Price: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పరుగు.. మీ నగరంలో ఎంతుందో తెలుసా..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పరుగు ఆగడం లేదు.  తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి.

Petrol Diesel Price: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పరుగు.. మీ నగరంలో ఎంతుందో తెలుసా..
Petrol Diesel Price
Follow us

|

Updated on: Oct 14, 2021 | 8:40 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పరుగు ఆగడం లేదు.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. వరుసగా వారం రోజుల పాటు పెరిగిన ధరలు.. రెండ్రోజులు కాస్త విరామం ఇచ్చాయి. కానీ ఇవాళ వినియోగదారుడిపై మళ్లీ భారం మోపాయి చమురు కంపెనీలు. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. గురువారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 102.04గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.17గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.102.18గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 109.60గా ఉండగా.. డీజిల్ ధర రూ. 102.57గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.44గా ఉండగా.. డీజిల్ ధర రూ.102.44గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109 ఉండగా.. డీజిల్ ధర రూ.102.04గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.52 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.57గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.111.48 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.103.88 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.18 ఉండగా.. డీజిల్ ధర రూ. 102.65గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.29 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.103.67గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.77గా ఉండగా.. డీజిల్ ధర రూ.103.24గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 111.48 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.103.88లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 104.79 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 93.52 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.43కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.40 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.105.43 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 96.63 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.10 ఉండగా.. డీజిల్ ధర రూ.97.93గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.108.44పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.99.26గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.81 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.93.96గా ఉంది.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: జీవితంలో ఈ మూడింటిని వదిలేస్తే.. ధన లక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది..

Extra Marital Affair: అనుమానించిన అమ్మ.. 800 కిలోమీటర్లు వెంబడించి తండ్రిని అడ్డంగా బుక్ చేసిన కొడుకు..