AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Usage Tips: మీ క్రెడిట్/డెబిట్ కార్డు పోయిందా? ఇలా చేస్తే మీరు సేఫ్ సైడ్‌లో ఉంటారు.. లేకుంటే మీ ఖాతా ఖల్లాసే!

ఇటీవల కాలంలో క్రెడిట్/డెబిట్ కార్డులతో మోసాలకు పాల్పడే వారు పెరుగుతున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతాలు కొల్లగొట్టేస్తారు. ఒకేవేళ మీరు క్రెడిట్/డెబిట్ కార్డు పోయినా, లేదా ఎవరైనా దొంగిలించినా అప్పుడు మీ కార్డు నుంచి సొమ్మును కాజేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కార్డును మీరు తప్ప మరెవరూ వినియోగించలేని విధంగా సెక్యూరిటీ పెట్టుకోవాలి.

Credit Card Usage Tips: మీ క్రెడిట్/డెబిట్ కార్డు పోయిందా? ఇలా చేస్తే మీరు సేఫ్ సైడ్‌లో ఉంటారు.. లేకుంటే మీ ఖాతా ఖల్లాసే!
Card Usage
Madhu
|

Updated on: Aug 20, 2023 | 12:38 PM

Share

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతి ఒక్కరూ ఏదో బ్యాంకుకు చెందిన క్రెడిట్ కార్డును వినియోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డు వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో క్రెడిట్/డెబిట్ కార్డులతో మోసాలకు పాల్పడే వారు పెరుగుతున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతాలు కొల్లగొట్టేస్తారు. ఒకేవేళ మీరు క్రెడిట్/డెబిట్ కార్డు పోయినా, లేదా ఎవరైనా దొంగిలించినా అప్పుడు మీ కార్డు నుంచి సొమ్మును కాజేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కార్డును మీరు తప్ప మరెవరూ వినియోగించలేని విధంగా సెక్యూరిటీ పెట్టుకోవాలి. ఒకవేళ కార్డును పోగొట్టుకుంటే లేదా మీకు తెలియకుండా ఏమైనా డబ్బులు వినియోగించినట్లు గుర్తిస్తే వెంటనే కొన్ని పనులు చేయాలి. అవి ఏంటో చూద్దాం..

మీ బ్యాంకుకు వెంటనే తెలియజేయండి.. మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఖాతా నుంచి మీకు తెలియకుండా డబ్బు విత్ డ్రా అయినట్లు మీరు గుర్తిస్తే వెంటనే మీ కార్డ్ జారీ చేసివారికి వెంటనే తెలియజేయండి. ఈ లోపే మీ కార్డు యాప్ ఓపెన్ చేసి లేదా ఆన్ లైన్ లో అకౌంట్ ఓపెన్ చేసి కార్డు యాక్సెస్ ను లాక్ చేయండి. ఇలా చేయడం వల్ల మరింత నష్టపోకుండా ఆపగలుగుతారు.

లాగిన్ వివరాలు మార్చండి.. మీ ఖతాను మీకు తెలియకుండా నగదు విత్ డ్రా, ఎవరైనా ఆన్ లైన్ కొనుగోళ్లు చేశారనుకోండి. వెంటనే మీరు మీ కార్డు లాగిన్ వివరాలు అప్ డేట్ చేయండి. యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను చేంజ్ చేయండి. కొత్త పిన్ ను ఏర్పాటు చేసుకోండి.

ఇవి కూడా చదవండి

క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ చెక్ చేయండి.. మీ కార్డ్ జారీచేసేవారికి మోసాన్ని నివేదించిన తర్వాత, మోసపూరిత లావాదేవీల కోసం మీరు మీ రీయింబర్స్‌మెంట్‌ను అందుకున్నారని, మోసానికి తాజా సాక్ష్యం లేదని నిర్ధారించుకోవడానికి రోజూ మీ ఆన్‌లైన్ ఖాతాలోకి వెళ్లండి. ప్రతి నెలా స్టేట్ మెంట్లు చెక్ చేసుకోండి.

అధికారికంగా ఫిర్యాదు చేయండి.. మీ క్రెడిట్ కార్డ్ పోయినట్లు బ్యాంకుకు తెలియజేసిన తర్వాత, పోలీసు రిపోర్టును నమోదు చేయడానికి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి. ఒకవేళ కార్డును మోసపూరితంగా వేరే ఎవరైనా వినియోగిస్తే దానికి మీరు బాధ్యత వహించరని ఇది నిర్ధారిస్తుంది. అనేక బ్యాంకుల వెబ్‌సైట్‌ల ప్రకారం, మీరు మీ క్రెడిట్ కార్డ్‌ను పోగొట్టుకున్నారని, మరొక కార్డును పొందడంలో మీకు సహాయపడటానికి ఎఫ్ఐఆర్ చట్టపరమైన రుజువును అందిస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవచ్చు.

లాగిన్ డిటైల్స్ ఎవరికీ ఇవ్వొద్దు.. మీ అసలు కార్డ్ ఇప్పటికీ మంచి స్థితిలో ఉన్నప్పటికీ. మీరు తప్పనిసరిగా అర్హతల గురించి తెలుసుకోవాలి. మీరు అపరిచితుల ముందు డబ్బు విత్‌డ్రా చేయకూడదు. అలాగే, మీ పాస్‌వర్డ్‌లను తరచూ మార్చుకుంటూ ఉండండి. మీ లాగిన్, పాసవర్డ్ లు ఎవరికీ ఇవ్వకండి. బ్యాంకు వారికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..