AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS Apache: మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్.. పూర్తి వివరాలు ఇవి..

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160, అలాగే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ రెండు వాహనాలూ బ్లాక్ రంగులో ఆకట్టుకుంటున్నాయి. వీటి పనితీరు, ఇంజిన్ సామర్థ్యం, పిక్ అప్ దాదాపు ఒకేలా ఉంటుంది. వాహన చోదకులకు ఆత్మవిశ్వాసం నింపేలా పూర్తి నలుపు రంగులో తయారు చేశారు. అంటే మొత్తం బ్లాక్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉన్నాయి. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 రూ. 1.20 లక్షలకు, ఆర్‌టీఆర్ 160 4వి రూ. 1.25 లక్షలకు అందుబాటులో ఉన్నాయి.

TVS Apache: మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్.. పూర్తి వివరాలు ఇవి..
Tvs Apache Black Edition
Madhu
|

Updated on: May 19, 2024 | 6:22 AM

Share

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ కంపెనీ రెండు కొత్త మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160, అలాగే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ పేరుతో వీటిని ఆవిష్కరించింది. కొత్త స్పోర్టియర్ లుక్ తో, నలుపు రంగులో స్లైలిష్ గా ఉన్న ఈ వాహనాలలో ఫీచర్లు దాదాపు ఒక్కటే. వాటి ధరల వివరాలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

టీవీఎస్ నుంచి వాహనాల విడుదల..

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160, అలాగే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ రెండు వాహనాలూ బ్లాక్ రంగులో ఆకట్టుకుంటున్నాయి. వీటి పనితీరు, ఇంజిన్ సామర్థ్యం, పిక్ అప్ దాదాపు ఒకేలా ఉంటుంది. వాహన చోదకులకు ఆత్మవిశ్వాసం నింపేలా పూర్తి నలుపు రంగులో తయారు చేశారు. అంటే మొత్తం బ్లాక్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉన్నాయి. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 రూ. 1.20 లక్షలకు, ఆర్‌టీఆర్ 160 4వి రూ. 1.25 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఢిల్లీలోని ఎక్స్ షోరూమ్ ధరలు. రెండు మోటారు సైకిళ్ల ట్యాంకులపై ఎంబోస్ చేయబడిన బ్లాక్ టీవీల లోగోతో పాటు పై భాగంలో కనీస గ్రాఫిక్స్‌ రూపొందించారు. ఈ బైక్‌లు బ్లాక్ అవుట్ ఎగ్జాస్ట్‌ను కూడా కలిగి ఉంటాయి.

అదిరే లుక్ తో..

టీవీఎస్ కంపెనీ ప్రతినిధి విమల్ సంబ్లీ తెలిపిన వివరాల ప్రకారం.. టీవీఎస్ అపాచీ సిరీస్ ప్రపంచంలో 5.5 మిలియన్ల కు పైగా వాహనదారులకు దగ్గరైంది. నాలుగు దశాబ్దాలుగా కంపెనీ వాహనాలు అందరి మన్ననలు పొందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్‌లలో ఒకటిగా టీవీఎస్ నిలిచింది. టీవీఎస్ అపాచీ సిరీస్ అత్యాధునిక సాంకేతికతకు నిదర్శనమని చెప్పవచ్చు. కొత్త గా విడుదల చేసిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ సిరీస్ మోటారు సైకిళ్లు కొత్త బ్లాక్ ఎడిషన్ లో, స్పోర్టియర్ లుక్ లో ఆకట్టుకుంటున్నాయి.

బ్లాక్ ఎడిషన్..

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ బ్లాక్ ఎడిషన్ కూడా బేస్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. మూడు రైడింగ్ మోడల్‌లతో సహా మంచి ఫీచర్ల తో అందుబాటులో ఉంది. లెడ్ హెడ్‌ల్యాంప్, టెయిల్‌లైట్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ (జీటీటీ), డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ తదితర అనేక ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ సామర్థ్యం..

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 లో 159.7 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన రెండు వాల్వ్ ఇంజన్‌ ఏర్పాటు చేశారు. ఇది 15.8 బీహెచ్ పీ, 13.85 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. మరో వాహనం అపాచీ ఆర్టీఆర్ 160 4వీ లో కూడా 159.7 cc, ఆయిల్ కూల్డ్, ఫోర్ వాల్వ్ ఇంజన్ ఉన్నాయి. ఇది 17.31 బీహెచ్ పీ, 14.73 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లలో 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ లు ఏర్పాటు చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..