Wooden Bullet Bike: రూ. 70వేలకే డుగ్గు డుగ్గు బుల్లెట్ బైక్.. ఆశ్చర్యంగా ఉందా.. ఇది చదవండి..
సాధారణంగా మామూలు ద్విచక్ర వాహనాలతో పోల్చితే బుల్లెట్ ధర ఎక్కువగా ఉంటుంది. మైలేజీ విషయంలో మిగిలిన బైక్ ల కన్నా తక్కువగా ఉంటుంది. అందువల్లనే బుల్లెట్ కు క్రేజ్ ఉన్నా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనలేరు. అయితే హరియాణాకు చెందిన ఒక వ్యక్తి అద్భుతం చేశారు. కేవలం రూ.70 వేల ఖర్చు పెట్టి చెక్క ఎలక్ట్రిక్ బుల్లెట్ రూపొందించాడు.
దేశంలో అత్యంత క్రేజ్ కలిగిన ద్విచక్ర వాహనం బుల్లెట్. ముఖ్యంగా యువత దీనిని ఒక్కసారైనా నడపాలని కోరుకుంటారు. పెద్దలకు కూడా చాలా ఇష్టమైన వాహనం. బుల్లెట్ హుందాతనం, దాని నుంచి వెలువడే సౌండ్ ప్రత్యేకంగా ఉంటాయి. అనేక సినిమాల్లో బుల్లెట్ సాంగ్ ప్రత్యేకంగా పెడుతున్నారు. అవి ప్రేక్షకుల ఆదరణ కూడా పొందుతున్నాయి.
చెక్కతో ఎలక్ట్రిక్ బుల్లెట్..
సాధారణంగా మామూలు ద్విచక్ర వాహనాలతో పోల్చితే బుల్లెట్ ధర ఎక్కువగా ఉంటుంది. మైలేజీ విషయంలో మిగిలిన బైక్ ల కన్నా తక్కువగా ఉంటుంది. అందువల్లనే బుల్లెట్ కు క్రేజ్ ఉన్నా సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనలేరు. అయితే హరియాణాకు చెందిన ఒక వ్యక్తి అద్భుతం చేశారు. కేవలం రూ.70 వేల ఖర్చు పెట్టి చెక్క ఎలక్ట్రిక్ బుల్లెట్ రూపొందించాడు. బండిని చార్జింగ్ పెట్టి సులభంగా ప్రయాణం చేయవచ్చు. చూడటానికి నిజమైన బుల్లెట్ లా కనిపించే దీనిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
ఆకట్టుకునేలా..
హరియాణా రాష్ట్రం హిసార్‌లోని సిసార్ గ్రామానికి చెందిన మహావీర్ పెయింటర్ గా పనిచేస్తుంటాడు. ఇతను చెక్క బుల్లెట్ తయారీకి చాలా కష్ట పడ్డాడు. బండి ఇంధన ట్యాంక్ ను చెక్కతో రూపొందించాడు. మామూలు పెట్రోలు ట్యాంక్ మాదిరిగానే దానిని లాక్ తీసి ఓపెన్ చేయవచ్చు. దానిలో స్టిరియో సిస్టమ్ ఏర్పాటు చేశాడు. సంప్రదాయ బుల్లెట్‌లోని ఐకానిక్ డగ్ డగ్ ఎగ్జాస్ట్ రంబుల్‌ను ప్రతిబింబిస్తుంది. లోపల ఉంచిన స్పీకర్ల నుంచి సౌండ్ వెలువడుతుంది. కలప, ఎలక్ట్రిక్ విడి భాగాలను ఉపయోగించి తయారు చేసిన ఈ బుల్లెట్ ఎంతో ఆకట్టుకుంటోంది. ఇది చక్కగా నడవడమే కాకుండా నిజమైన బుల్లెట్ లా కనిపిస్తోంది. ఇందులో 12 వోల్ట్ బ్యాటరీని ఉపయోగించారు. దానిని చార్జింగ్ చేసిన తర్వాత బైక్ 50 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఇది దాదాపు 400 కిలోల బరువును మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
జుగాద్ అంటే..
మన దేశంలో జుగాద్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సమస్యను పరిష్కరించుకోవడం అని దీని అర్థం. అలాగే పరిమిత వనరులతో అద్భుతం చేయడం అని కూడా చెప్పవచ్చు. హరియాణా వ్యక్తి తయారు చేసిన చెక్క ఎలక్ట్రిక్ బుల్లెట్ తో ఈ పదం మరోసారి దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.
View this post on Instagram
సోషల్ మీడియాలో వైరల్..
చెక్క బుల్లెట్ వీడియో సామాజిక మధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 5.2 మిలియన్ల మంది దీనిని వీక్షించారు. 1.90 లక్షల లైక్‌లు, 3 లక్షలకు పైగా షేర్‌లను సంపాదించింది.
సూపర్ టాలెంట్..
బుల్లెట్ తయారీలో హర్యానా వ్యక్తి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇంధన ట్యాంక్ తో సహా క్లాసిక్ బుల్లెట్ సౌండ్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశాడు. స్పీకర్ల నుంచి వెలువడే ధ్వనిని నియంత్రించే స్టీరియో సిస్టమ్ ఉంది. అలాగే అండర్ సీట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌ను కూడా చేర్చాడు. చెక్క బుల్లెట్ కు నాలుగు బ్యాటరీలు శక్తిని అందిస్తాయి. దీనిలో ఆన్‌బోర్డ్ ఛార్జర్‌ను కూడా ఇన్‌స్టాల్ చేశాడు. దానిని ఎలక్ట్రికల్ బోర్డ్‌లో ప్లగ్ చేయడం ద్వారా సౌకర్యవంతంగా రీఛార్జ్ చేసుకునే వీలుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..