FD Interest Rates: ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే..

టాప్ బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. 2024 మే ఒకటో తేదీ నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. వడ్డీ రేట్లను మార్చిన బ్యాంకుల్లో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ), సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో ఎంత మేర వడ్డీ రేట్లు పెరిగాయి? తెలుసుకుందాం రండి..

FD Interest Rates: ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే..
Fd
Follow us
Madhu

|

Updated on: May 17, 2024 | 3:21 PM

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవగానే బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను సవరించాయి. ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్ డీ) రేట్లలో మార్పులను చేశాయి. టాప్ బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. 2024 మే ఒకటో తేదీ నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి. వడ్డీ రేట్లను మార్చిన బ్యాంకుల్లో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ), సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో ఎంత మేర వడ్డీ రేట్లు పెరిగాయి? వాటిల్లో ఇతర ప్రయోజనాలు ఏమిటి? తెలియాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను మార్చింది. 2024, మే 1 నుంచి వర్తించే కొత్త రేట్లు సాధారణ కస్టమర్‌లకు 4% నుంచి 8.50% వరకు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు 4.60% నుంచి 9.10% వరకు ఉంటాయి. గరిష్టంగా వడ్డీ రేట్లు సాధారణ కస్టమర్‌లకు 8.50%, సీనియర్ సిటిజన్‌లకు 9.10% ఉంటాయి. ఇవి 2 నుంచి 3 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న డిపాజిట్‌లకు మాత్రమే వర్తిస్తాయి.

ఆర్బీఎల్ బ్యాంక్..

ఆర్బీఎల్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త వడ్డీ రేట్లు 2024, మే 1 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ 18 నుంచి 24 నెలల కాలవ్యవధితో ఎఫ్డీలకు 8% వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం, రేటు 8.50%. ఇది సాధారణ కస్టమర్ల కంటే 0.50% ఎక్కువ. సూపర్ సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ) 0.75% ప్రీమియం పొందుతారు. తద్వారా వారు అదే కాలవ్యవధికి 8.75% వడ్డీ రేటును పొందుతారు.

క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను అప్‌డేట్ చేసింది. కొత్త రేట్లు 2024, మే 6 నుంచి అమలులోకి వచ్చాయి. సాధారణ పౌరులు 3.5% నుంచి 7.55% మధ్య సంపాదించవచ్చు. సీనియర్ సిటిజన్‌లు 4 % నుంచి 8.05% మధ్య వడ్డీ రేట్లు పొందవచ్చు. 400 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అత్యధిక వడ్డీ రేటు లభిస్తుంది.

సిటీ యూనియన్ బ్యాంక్..

సిటీ యూనియన్ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు డిపాజిట్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను అప్‌డేట్ చేసింది. కొత్త రేట్లు 2024, మే 6 నుంచి అమలులోకి వచ్చాయి. సాధారణ పౌరులకు వడ్డీ రేట్లు 5% నుంచి 7.25% వరకు ఉంటాయి. సీనియర్ సిటిజన్లు 5% నుంచి 7.75% మధ్య సంపాదించవచ్చు. గరిష్ట రేట్లు సాధారణ పౌరులకు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75% ఉంటాయి. ఇవి 400 రోజుల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..