Child Planning: ఈ పథకాలే కొండంత అండ.. ఆడబిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా.. పూర్తి వివరాలు ఇవి..
పిల్లవాడు పుట్టకముందే వారికి అవసరమైనవి కొనుగోలు చేయాలి.. వారు బుడి బుడి అడుగులు వేస్తున్న సమయంలోనే మంచి స్కూళ్ల గురించి వెతకడం, కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం చేయాలి.. వారు చదువుతున్న సమయంలో వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించాలి.. మంచి వర్సిటీల్లో చేర్పించడం, లేదా విదేశాలను వెళ్తానంటే అందుకు అవసరమైన వాటిని సమకూర్చడం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
పిల్లల విషయంలో పక్కా ప్లానింగ్ ఉండాలి. వారు పుట్టినది మొదలు కొని పెళ్లిళ్లు చేసే వరకూ కచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్లాలి. అప్పుడే వారు కోరుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వగలుగుతారు. ముఖ్యంగా ఆర్థికపరమైన ప్రణాళిక చాలా అవసరం. కొందరు నిపుణులైతే ఇలా చెబుతారు.. పిల్లవాడు పుట్టకముందే వారి అవసరమైనవి కొనుగోలు చేయాలి.. వారు బుడి బుడి అడుగులు వేస్తున్న సమయంలోనే మంచి స్కూళ్ల గురించి వెతకడం, కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం చేయాలి.. వారు చదువుతున్న సమయంలో వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించాలి.. మంచి వర్సిటీల్లో చేర్పించడం, లేదా విదేశాలను వెళ్తానంటే అందుకు అవసరమైన వాటిని సమకూర్చడం చేయాలని చెబుతున్నారు. అయితే ఇవన్నీ చేయాలంటే తగినంత ఆర్థిక వనరులు మీకు కావాలి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో అందుకోసం తగిన ప్రణాళిక కావాలి. అందుకే ఆడపిల్ల పుట్టిన రోజే మీరు సుకన్య సమృద్ధి యోజన మొదలు పెట్టాలి. ఇది బేటి బచావ్, బేటి పఢావ్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన పథకం ఇది. దీంతో పాటు మరిన్ని ప్రత్యేకమైన పథకాలు మీ ఆడపిల్లల ఉజ్వల భవితకు ఊతం అవుతాయి. అటువంటి టాప్ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సుకన్యా సమృద్ధి యోజన..
ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. మూడు లక్ష్యాలుగా దీనిని తీసుకొచ్చారు. ఆడపిల్లలను బతికించడం, సంరక్షించడం, ఆడపిల్లలపై విక్షను తొలగించడం, ఆడి పిల్లల విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆడబిడ్డ పుట్టిన మొదటి రోజే ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. పదేళ్లు దాటకముందే పథకాన్ని ప్రారంభించారు. 15ఏళ్ల వరకూ ఏడాదికి గరిష్టంగా రూ. 1,50,000 చొప్పున పెట్టుబడి పెట్టొచ్చు. కనిష్టంగా నెలకు రూ. 500 నుంచి పెట్టబడి మొదలు పెట్టొచ్చు. మీ పిల్లకు 21 ఏళ్లు వచ్చే నాటికి ఈ పథకం మెచ్యూర్ అవుతుంది. దీనిపై వచ్చే వడ్డీ మొత్తం పన్ను రహితంగా ఉంటుంది. మీ పిల్లకు 18 ఏళ్లు నిండాక అసలు నుంచి కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం దీనిపై వడ్డీ రేటు 8శాతంగా ఉంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్సీ)..
ఈ స్కీమ్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. దీనిని మీ సమీపంలోని పోస్ట్ ఆఫీసులో తీసుకోవచ్చు. ఇది ఆడ పిల్లలకు ప్రత్యేకించిన పథకం. దీనిలో లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు.
సీబీఎస్ఈ ఉడాన్ స్కీమ్..
ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(సీబీఎస్ఈ), హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్(హెచ్ఆర్డీ) మినిస్ట్రీ సంయక్తంగా ఈ పథకాన్ని ప్రారంభించాయి. టెక్నికల్ రంగాల్లో ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం ఇది. పదో తరగతిలో 70శాతం మార్కులు సాధించిన వారు, మ్యాథ్స్ లో కనీసం 80శాతం అంతకన్నా ఎక్కువ సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ ఆఫీస్ టెర్మ్ డిపాజిట్(పీఓటీడీ)..
పిల్ల పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడమే ఈ పథకం. దీనిలో కనీస పెట్టుబడి రూ. 1000 ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇది కూడా చాలా తక్కువ రిస్క్ ఉన్న పథకం. దీనిలో కూడా సెక్షన్ 80సీ ప్రకారం ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..