SBI SIP MF: వీటిలో ‘సిప్’ చేస్తే లాభాల పంటే.. మూడేళ్లలోనే ఊహించని రాబడి..

ముఖ్యంగా సిప్ (ఎస్ఐపీ) లో పెట్టుబడి పెట్టడం అనుకూలంగా ఉంటుంది. ప్రతినెలా చాలా చిన్న మొత్తంలో కూడా వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీర్ఘకాలంలో అత్యుత్తమ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ సిప్ మ్యుచువల్ ఫండ్స్ చాలా లాభదాయకంగా ఉంటాయి. ఇవి దాదాపు మూడేళ్లలో రూ. 21.65 లక్షల కార్పస్‌ నిర్మించాయి.

SBI SIP MF: వీటిలో 'సిప్' చేస్తే లాభాల పంటే.. మూడేళ్లలోనే ఊహించని రాబడి..
Mutual Fund
Follow us

|

Updated on: Aug 01, 2024 | 3:15 PM

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేముందు అధిక రాబడి ఇచ్చే వాటిపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. అప్పుడే మీ పెట్టుబడికి తగిన ఆదాయం వస్తుంది. ముఖ్యంగా సిప్ (ఎస్ఐపీ) లో పెట్టుబడి పెట్టడం అనుకూలంగా ఉంటుంది. ప్రతినెలా చాలా చిన్న మొత్తంలో కూడా వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీర్ఘకాలంలో అత్యుత్తమ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ సిప్ మ్యుచువల్ ఫండ్స్ చాలా లాభదాయకంగా ఉంటాయి. ఇవి దాదాపు మూడేళ్లలో రూ. 21.65 లక్షల కార్పస్‌ నిర్మించాయి. ఈ నేపథ్యంలో ఆయా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం.

ఎస్బీఐ పీఎస్యూ డైరెక్ట్ ప్లాన్- గ్రోత్..

మూడేళ్ల వార్షిక సిప్ (ఎస్ ఐపీ) రిటర్న్స్ పరంగా ఈ మ్యూచువల్ ఫండ్ అత్యుత్తమైనది. మూడేళ్లలో 58.25 శాతం రిటర్న్స్ సాధించింది. ఇదే కాలంలో ఫండ్ మొత్తం రాబడి 42.74 శాతంగా నమోదైంది. దీని నిర్వహణలో రూ.3,695 కోట్లు ఆస్తులు (ఏయూఎమ్) ఉన్నాయి. నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ) రూ. 37.58. కాగా.. 2013 జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి 13.76 శాతం వార్షిక మొత్తం రాబడి (సీఏజీఆర్) వచ్చింది. కనీస పెట్టుబడి రూ. 5వేలు, సిప్ లో కనీస పెట్టుబడిగా రూ. 500గా ఉంది. ఈ ఫండ్ పోర్ట్ పోలియోలో ఎస్బీఐ, గెయిల్ (ఇండియా), పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ తదితర 26 స్టాక్ లు ఉన్నాయి. మూడేళ్ల లో రూ.27,500 నెలవారీ సిప్ మొత్తం రూ.21.65 లక్షలు ఇచ్చింది.

ఎస్బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్..

ఈ ఫండ్ మూడేళ్ల కాలంలో 43.90 శాతం వార్షిక సిప్ రిటర్న్‌లను ఇచ్చింది. అదే కాలంలో దాని మొత్తం రాబడి 33.25 శాతంగా నమోదైంది. ఈ ఫండ్ ఫండ్ ఆస్తులు రూ.3,851 కోట్లు, నికర ఆస్తి విలువ రూ. 57.09గా ఉన్నాయి. ఈ ఫండ్ ను 2013 జనవరిలో ప్రారంభించారు. అప్పటి నుంచి 17.70 శాతం రాబడి కలిగి ఉంది. దీనిలో కనీస పెట్టుబడి రూ. 5 వేలు, కనీస సిప్ పెట్టుబడి రూ.500. ఈ ఫండ్ కు ఉన్న 44 స్టాక్‌ల పోర్ట్‌ఫోలియోలో ఆర్ఐఎల్, భారతీ ఎయిర్‌టెల్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ మరియు లార్సెన్ & టూబ్రో ప్రధానమైనవి. రూ.27,500 నెలవారీ సిప్ మూడేళ్లలో రూ.18.18 లక్షలు అందించింది.

ఎస్బీఐ లాంగ్ టర్న్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్-గ్రోత్..

ఎస్బీఐకి చెందిన ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) అయిన ఈ ఫండ్ 40.53 శాతం వార్షిక సిప్ రిటర్న్స్ అందించింది. మూడేళ్లలో 29.74 శాతం రాబడిని ఇచ్చింది. ఫండ్ ఆస్తులు రూ. 25,738 కోట్లు, నికర విలురూ. 471.43. దీనిని 2013 జనవరిలో ప్రారంభించినప్పటి నుండి 18.22 శాతం వార్షిక మొత్తం రాబడి అందించింది. ఈ ఫండ్ లో కనీస పెట్టుబడి రూ.1000, కనీస సిప్ పెట్టుబడి రూ.500 మాత్రమే. దీని పోర్ట్ పోలియోలో 61 స్టాక్‌లు ఉన్నాయి వాటిలో జీఈ టీ&డీ ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకులు ఉన్నాయి. ఫండ్‌లో రూ. 27,500 నెలవారీ సిప్ మూడేళ్లలో 17.42 లక్షలు అందజేసింది.

ఎస్బీఐ కాంట్రా డైరెక్ట్ ప్లాన్-గ్రోత్..

ఈ ఫండ్ పెట్టుబడి విషయంలో కాంట్రా స్ట్రాటజీని అనుసరిస్తుంది. మూడేళ్లలో 37.35 వార్షిక సిప్ రాబడిని అందించింది. దీని అసెట్ బేస్ విలువ రూ. 34,366 కోట్లు, ఎన్ఏవీ రేటు రూ. 424.53గా ఉన్నాయి. 2013 జనవరిలో ప్రారంభించినప్పటి నుంచి 18.48 శాతం వార్షిక రాబడి అందజేసింది. ఈ ఫండ్ లో కనీస మొత్తం పెట్టుబడిగా రూ. 5 వేలు, కనీస సిప్ పెట్టుబడి రూ. 500. ఈ ఫండ్ పోర్ట్ పోలియో 94 స్టాక్‌లు ఉన్నాయి. వాటిలో నిఫ్టీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, గెయిల్ (ఇండియా) ప్రధానమైనవి. ఫండ్‌లో రూ.27,500 నెలవారీ సిప్ మూడేళ్లలో రూ.17.04 లక్షలు అందించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వీటిలో 'సిప్' చేస్తే లాభాల పంటే.. మూడేళ్లలోనే ఊహించని రాబడి..
వీటిలో 'సిప్' చేస్తే లాభాల పంటే.. మూడేళ్లలోనే ఊహించని రాబడి..
తక్కువ ధరలోనే జియో నయా రీచార్జ్ ప్లాన్స్.. ఎయిర్‌టెల్, వీఐకు పోటీ
తక్కువ ధరలోనే జియో నయా రీచార్జ్ ప్లాన్స్.. ఎయిర్‌టెల్, వీఐకు పోటీ
తెలంగాణలో ఇంజినీరింగ్‌ B-కేటగిరీ సీట్లభర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణలో ఇంజినీరింగ్‌ B-కేటగిరీ సీట్లభర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
ఒలింపిక్స్ లో కాంస్యం.. షూటర్ స్వప్నిల్‌కు ప్రధాని మోడీ అభినందనలు
ఒలింపిక్స్ లో కాంస్యం.. షూటర్ స్వప్నిల్‌కు ప్రధాని మోడీ అభినందనలు
అప్పుడు అవకాశం ఇస్తే నో చెప్పాడు.. ఇప్పుడు..
అప్పుడు అవకాశం ఇస్తే నో చెప్పాడు.. ఇప్పుడు..
జూలై ఒక్క నెలలో UPI లావాదేవీలు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?
జూలై ఒక్క నెలలో UPI లావాదేవీలు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?
వార్నీ.. గుడ్డిగా టమాటాలు కోస్తే గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్‌..!?
వార్నీ.. గుడ్డిగా టమాటాలు కోస్తే గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్‌..!?
'కేవీల్లో ప్రవేశాలకు ఎంపీ కోటా పునరుద్ధరణ యోచన లేదు'
'కేవీల్లో ప్రవేశాలకు ఎంపీ కోటా పునరుద్ధరణ యోచన లేదు'
'నేనైతే ఆ షాట్ తప్పనే వాడిని'.. ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్
'నేనైతే ఆ షాట్ తప్పనే వాడిని'.. ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్
ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. కాంస్యాన్ని ముద్దాడిన స్వప్నిల్
ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. కాంస్యాన్ని ముద్దాడిన స్వప్నిల్