Financial Planning: అప్పులు తీర్చకుండా.. పెట్టుబడి పెడితే లాభమా? నష్టమా?

గతంలో చేసే పొదుపును రుణాల వాయిదాలకు చెల్లించాల్సి వస్తుంది. అంటే పెట్టుబడి పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండదు. రుణ వాయిదాలు చెల్లించకపోతే కుదరదు, తద్వారా మనం పొదుపు చేసే వీలు కూడా ఉండదు. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రుణాన్ని తొందరగా తీర్చంతో పాటు డబ్బులను పొదుపు చేసే అవకాశం కలుగుతుంది.

Financial Planning: అప్పులు తీర్చకుండా.. పెట్టుబడి పెడితే లాభమా? నష్టమా?
Cash
Follow us

|

Updated on: Aug 01, 2024 | 3:43 PM

జీవితంలో ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికీ కచ్చితమైన ప్రణాళిక అవసరం. తమకు వచ్చే ఆదాయం, ఖర్చులు తదితర వాటిపై సమగ్రమైన అవగాహన ఉన్నప్పుడే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా పొదుపు అనేది ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. అనుకోని ఖర్చులు, ఇబ్బందులు, అవాంతరాలు వచ్చినా వాటిని దాటి ముందుకు వెళ్లడానికి సాయపడుతుంది. మనకు వచ్చే ఆదాయం, నెలవారీ ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని వివిధ మార్గాలలో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో అధిక రాబడి వస్తుంది. అయితే ఒక్కోసారి అనుకోని ఇబ్బందులు, ఆస్పత్రి ఖర్చులు తదితర కారణాలతో రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో మనం గతంలో చేసే పొదుపును రుణాల వాయిదాలకు చెల్లించాల్సి వస్తుంది. అంటే పెట్టుబడి పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండదు. రుణ వాయిదాలు చెల్లించకపోతే కుదరదు, తద్వారా మనం పొదుపు చేసే వీలు కూడా ఉండదు. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రుణాన్ని తొందరగా తీర్చంతో పాటు డబ్బులను పొదుపు చేసే అవకాశం కలుగుతుంది. ఏదిఏమైనా రుణాలను తీర్చాకే పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది.

పరిశీలించాల్సిన అంశాలు..

  • సాధారణంగా బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకుంటారు. ఇలాంటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించారు. రుణానికి సంబంధించిన నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి. దీనివల్ల రుణాలను వేగంగా చెల్లించడంతో పాటు డబ్బులను పొదుపు చేసుకునే అవకాశం కలుగుతుంది.
  • రుణంపై ఎంత వడ్డీ రేటు విధించారో తెలుసుకోవడం చాలా అవసరం. వడ్డీ బాగా తక్కువగా ఉన్నప్పుడే మీకు సౌలభ్యంగా ఉంటుంది. వివిధ బ్యాంకుల వడ్డీరేట్లను గమనించి, తక్కువగా ఉన్నబ్యాాంకులో రుణం తీసుకోవాలి.
  • తీసుకున్న రుణానికి నెలవారీ చెల్లించే వాయిదా మీకు భారంగా ఉండకూడదు. మీకు వచ్చే ఆదాయంలో దాదాపు 30 శాతానికి మించకుండా చూసుకోవాలి.
  • రుణం చెల్లించే కాల వ్యవధి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీకు వడ్డీ భారం తగ్గుతుంది.

రుణం తొందరగా తీర్చాలంటే..

బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నప్పుడు నెలవారీ వాయిదాలను నిర్ణయిస్తారు. అయితే ఆ తర్వాత మీ ఆదాయం పెరగవచ్చు. అలాంటి సమయంలో రుణాలకు తొందరగా తీర్చడానికి చర్యలు తీసుకోండి. బ్యాంకు అధికారిని సంప్రదించి రుణాన్ని తొందరగా తీర్చనున్నట్టు చెప్పింది. నెలవారీ వాయిదాల సొమ్మును పెంచుకోవడం ద్వారా కాలవ్యవధిని తగ్గించుకోవచ్చు. దీని వల్ల రుణం వేగంగా తీరడంతో పాటు వడ్డీ రూపంలో పొదుపు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీకు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిందనుకోండి. వెంటనే బ్యాంకును సంప్రదించి రుణాన్ని తీర్చవేయాలనుకుంటున్నట్టు చెప్పండి. నిబంధనల మేరకు రుణం తీర్చవేసే అవకాశం కలుగుతుంది. సాధారణంగా రుణాలు తీర్చివేసిన తర్వాతే పెట్టుబడుల గురించి ఆలోచించాలి.

ఇలా చేయకండి..

చాలామంది రుణాలు తీసుకుని పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల నష్టం జరుగుతుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీరేటు దాదాపు 9 శాతం నుంచి ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు 24 నుంచి 36 శాతం వరకూ వసూలు చేస్తున్నారు. అలా అప్పు చేసి పొదుపు ఖాతాలో పెట్టుబడి పెడితే మీకు వచ్చే గరిష్టంగా 3.5 శాతమే ఉంటుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై 3 నుంచి 7.2 శాతం వరకే ఇస్తారు. కాబట్టి ముందుగా రుణాలను తీర్చడం వల్ల మీరు పొదుపు చేసే అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత దానిని పెట్టుబడి మార్గాలకు మళ్లించే వీలుంటుంది. వ్యక్తిగత రుణాలను కొన్నిసార్లు ముందస్తుగా తీర్చడానికి బ్యాంకుల నిబంధనలు ఒప్పుకోకపోవచ్చు. అప్పుడు మీ దగ్గర ఉన్న మొత్తాన్ని స్వల్పకాలిక డిపాజిట్లలో జమచేయాలి. రుణానికి లాక్ పిరియడ్ ముగిసిన తర్వాత ఆ మొత్తాన్ని దానిలో జమచేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అప్పులు తీర్చకుండా.. పెట్టుబడి పెడితే లాభమా? నష్టమా?
అప్పులు తీర్చకుండా.. పెట్టుబడి పెడితే లాభమా? నష్టమా?
గూగుల్ ఫోటోస్ AI ఎడిటింగ్ ఫీచర్ ఉచితం..ఈ 4 మార్గాల్లో ఉపయోగించండి
గూగుల్ ఫోటోస్ AI ఎడిటింగ్ ఫీచర్ ఉచితం..ఈ 4 మార్గాల్లో ఉపయోగించండి
కమెడియన్ హర్ష విడాకులు తీసుకుంటున్నాడా? ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా
కమెడియన్ హర్ష విడాకులు తీసుకుంటున్నాడా? ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా
ఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
ఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
సూర్యోదయాన్ని చూడటం అంటే ఇష్టమా.. ఇవే బెస్ట్ ప్లేసెస్..
సూర్యోదయాన్ని చూడటం అంటే ఇష్టమా.. ఇవే బెస్ట్ ప్లేసెస్..
చాక్లెట్‌ వడాపావ్‌..ఇదేం ఐడియా తల్లీ! ఈ మహిళ చేసిన ప్రయోగం చూస్తే
చాక్లెట్‌ వడాపావ్‌..ఇదేం ఐడియా తల్లీ! ఈ మహిళ చేసిన ప్రయోగం చూస్తే
భారత్లో వియత్నాం ప్రధాని పర్యటన.. పీఎం మోదీపై ప్రశంసలు..
భారత్లో వియత్నాం ప్రధాని పర్యటన.. పీఎం మోదీపై ప్రశంసలు..
వ్యాలిడిటీ ముగిసినా కాల్స్, డేటా ఉచితం.. ఎయిర్‌టెల్ సంచలన నిర్ణయం
వ్యాలిడిటీ ముగిసినా కాల్స్, డేటా ఉచితం.. ఎయిర్‌టెల్ సంచలన నిర్ణయం
ఖాతాదారులకు ఆ బ్యాంకు శుభవార్త..డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు
ఖాతాదారులకు ఆ బ్యాంకు శుభవార్త..డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు
వీటిలో 'సిప్' చేస్తే లాభాల పంటే.. మూడేళ్లలోనే ఊహించని రాబడి..
వీటిలో 'సిప్' చేస్తే లాభాల పంటే.. మూడేళ్లలోనే ఊహించని రాబడి..