AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rates: ఖాతాదారులకు ఆ బ్యాంకు శుభవార్త.. ఎఫ్‌డీలతో పాటు అన్ని డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

భారతదేశంలో బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందాక ప్రజలు బ్యాంకులను కూడా ప్రముఖ పెట్టుబడి సాధనంగా భావించి పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి పథకాల్లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. ఎఫ్‌డీ పథకాల్లో నమ్మకమైన రాబడితో పాటు పెట్టుబడికి భరోసా ఉండడంతో రిస్క్ ఎదుర్కొలేని పెట్టుబడిదారులు ఎఫ్‌డీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో బ్యాంకుల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో కొన్ని బ్యాంకులుప్రత్యేక ఎఫ్‌డీ పథకాల ద్వారా బ్యాంకులు నిర్ణీత కాల డిపాజిట్లపై అధిక వడ్డీను ఆఫర్ చేస్తున్నాయి.

FD Interest Rates: ఖాతాదారులకు ఆ బ్యాంకు శుభవార్త.. ఎఫ్‌డీలతో పాటు అన్ని డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు
Fixed Deposit
Nikhil
|

Updated on: Aug 01, 2024 | 3:31 PM

Share

భారతదేశంలో బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందాక ప్రజలు బ్యాంకులను కూడా ప్రముఖ పెట్టుబడి సాధనంగా భావించి పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి పథకాల్లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. ఎఫ్‌డీ పథకాల్లో నమ్మకమైన రాబడితో పాటు పెట్టుబడికి భరోసా ఉండడంతో రిస్క్ ఎదుర్కొలేని పెట్టుబడిదారులు ఎఫ్‌డీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో బ్యాంకుల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో కొన్ని బ్యాంకులుప్రత్యేక ఎఫ్‌డీ పథకాల ద్వారా బ్యాంకులు నిర్ణీత కాల డిపాజిట్లపై అధిక వడ్డీను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఆర్‌బీఎల్ బ్యాంక్ రూ. 3 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు జూలై 29, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ పొదుపు ఖాతా వడ్డీ రేట్లను కూడా సవరించింది. కొత్త రేట్లు జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఎల్ బ్యాంకు అందించే వడ్డీ రేట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇలా

ఆర్‌బీఎల్ బ్యాంక్ 500 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై అత్యధికంగా 8.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు మరో 0.50 శాతం అదనంగా వడ్డీ అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లకు దాదాపు 8.60 శాతం వడ్డీ, సూపర్ సీనియర్ సిటిజన్లకు  8.85% అదనపు వడ్డీ అందిస్తుంది. అలాగే 241 రోజుల నుంచి 364 రోజుల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.05 శాతం వడ్డీ అందిస్తే సీనియర్ సిటిజన్లకు 6.55 శాతం వడ్డీను అందిస్తుంది. 365 రోజుల నుంచి 452 రోజుల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.00 శాతం వడ్డీను అందిస్తుంది. 453 రోజుల నుంచి 499 రోజుల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8.30 శాతం వడ్డీ అందించగా, సాధారణ ప్రజలకు 7.80 శాతం వడ్డీ అందిస్తుంది. అలాగే 546 రోజుల నుంచి 24 నెలల డిపాజిట్లపై సాధారణ 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం వడ్డీ అందిస్తుంది.

సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లు ఇలా

ఆర్‌బీఎల్ బ్యాంక్ పొదుపు ఖాతాల్లో లక్ష కంటే ఎక్కువ రోజువారీ నిల్వలపై వడ్డీ రేటు 3.75 శాతం నుంచి 7.75 శాతం వరకు అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?