Investment Schemes: మన దేశంలో సురక్షితమైన పెట్టుబడి పథకాలు ఇవే..

పెట్టుబడులు పెట్టేముందు రిస్క్ తక్కువ ఉండే ఇన్‌స్ట్రూట్‌మెంట్‌ కోసం చూసుకోవాలి. అధిక రిస్క్ ఒక్కోసారి ఎక్కువ రాబడి ఇవ్వవచ్చు. తక్కువ రిస్క్ అసలు రాబడి ఇవ్వకపోవచ్చు. మన పోర్ట్ ఫోలియోలో మన రిస్క్ ప్రొఫైల్ అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. మీ రిస్క్ టాలరెన్స్ స్థాయిని గుర్తించగలగడం మీరు చేసుకునే మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ కి మొదటి అడుగు అని చెప్పవచ్చు. ఇప్పుడు మన దేశంలో సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది వివరంగా తెలుసుకుందాం..

Investment Schemes: మన దేశంలో సురక్షితమైన పెట్టుబడి పథకాలు ఇవే..
Investment Schemes
Follow us
Subhash Goud

|

Updated on: Sep 05, 2023 | 8:46 PM

కష్టపడి సంపాదించిన డబ్బును భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవడం అందరూ చేసే పని. ఆ దాచుకున్న డబ్బుపై సురక్షితమైన రాబడి కావాలని అందరూ కోరుకుంటారు. దాని కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని వెతుకులాడుతారు. ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్‌ రిస్క్ లేకుండా ఉండవు. రిస్క్-రిటర్న్స్ అనేవి ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ రిస్క్ కచ్చితంగా ఉంటుంది. అయితే పెట్టుబడులు పెట్టేముందు రిస్క్ తక్కువ ఉండే ఇన్‌స్ట్రూట్‌మెంట్‌ కోసం చూసుకోవాలి. అధిక రిస్క్ ఒక్కోసారి ఎక్కువ రాబడి ఇవ్వవచ్చు. తక్కువ రిస్క్ అసలు రాబడి ఇవ్వకపోవచ్చు. మన పోర్ట్ ఫోలియోలో మన రిస్క్ ప్రొఫైల్ అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. మీ రిస్క్ టాలరెన్స్ స్థాయిని గుర్తించగలగడం మీరు చేసుకునే మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ కి మొదటి అడుగు అని చెప్పవచ్చు. ఇప్పుడు మన దేశంలో సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది వివరంగా తెలుసుకుందాం.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (పీఓఎంఐఎస్‌) సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్‌), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ), ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై), అటల్ పెన్షన్ యోజన లాంగ్ టర్మ్ పెట్టుబడులకు ఇది సురక్షితమైనదిగా ఉంది. వీటిలో రాబడి ఎలా ఉంటుందన్నది చూద్దాం.. 1- 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి సంవత్సరానికి 6.80% నుంచి 7.50% రాబడి వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) 15 సంవత్సరాలలో 7.10% రాబడికి హామీ ఇస్తుంది. తపాల కార్యాలయంలో మంత్లీ ఇన్ కమ్ స్కీమ్.  ఐదేళ్ల పాటు పెట్టుబడి పెడితే 7.40 శాతం రాబడి పొందవచ్చు. ఐదు సంవత్సరాల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.20% సంవత్సరాదాయం ఇస్తుంది. సుకన్య సమృద్ది యోజన పథకం నుంచి మంచి రాబడి ఉంటుంది. ఈ పథకంలో ఆడ పిల్లకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత 8 శాతం రాబడి అందుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో 5 సంవత్సరాలు పెట్టుబడి పెడితే 7.70% వరకూ రాబడి వస్తుంది. ఇక ప్రధాన మంత్రి వయో వందన యోజన 10 సంవత్సరాలలో 8-8.30% ఆదాయానికి హామీ ఇస్తుంది. అలాగే అటల్ పెన్షన్ యోజన 20 సంవత్సరాలు కంట్రిబ్యూషన్ రేట్లపై ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్‌లు 5 – 40 సంవత్సరాల రాబడి ఎంచుకున్న పథకం రకాన్ని బట్టి ఉంటుంది. అధిక రాబడిని అందించే సురక్షితమైన పెట్టుబడి ఎంపికల కోసం వెతుకుతున్నప్పుడు, వాటికి మంచి క్రెడిట్ యోగ్యత ఉందని లేదా ప్రభుత్వ సంస్థల మద్దతు ఉందని మీరు ఎప్పుడూ నిర్ధారించుకోవాలి. తరచుగా ప్రభుత్వ మద్దతు గల పథకాలు ప్రమాద రహితమైనవిగా పరిగణిస్తారు.

మూలధన రక్షణ – స్థిరమైన లేదా హామీ ఇచ్చిన రాబడి ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ను సురక్షితమైన పెట్టుబడులుగా చెప్పవచ్చు. అయితే, అన్ని పథకాలు అధిక రాబడిని అందించవు. తక్కువ-రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్‌లలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎప్పుడూ ద్రవ్యోల్బణం బెంచ్‌మార్క్‌గా పెట్టుకోవాలి. ద్రవ్యోల్బణం డబ్బుతో పాటు మీ రాబడి విలువను తగ్గిస్తుంది. అందువల్ల, అన్ని సురక్షితమైన పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడులను అందిస్తాయని చెప్పలేం. వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ నుంచి ఎంచుకోవడం సరైనది అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఏ పథకాన్ని ఎంచుకోవాలి? ఇప్పుడు చెప్పిన సురక్షిత పెట్టుబడి పథకాలు స్థిర ఆదాయ పథకాలు. మార్కెట్-లింక్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఈక్విటీలు) లాగా కాకుండా, హామీ ఇచ్చిన ఆదాయాన్ని సంపాదించడంలో ఈ పథకాలు మీకు సహాయపడతాయి. స్థిర ఆదాయ పథకాలు సంపద పరిరక్షణకు సహాయపడతాయి. పథకాల మధ్య ఎంపిక ఎక్కువగా ఏ విధమైన పారా మీటర్స్ పై ఆధారపడి ఉంటుందో చూద్దాం.

లక్ష్యం: ఎప్పుడూ ఒకే టార్గెట్ వైపు పెట్టుబడి పెట్టండి. టార్గెట్ ఆధారిత పెట్టుబడి అనేది మీ పెట్టుబడులను కొనసాగించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, రిటైర్మెంట్ ఫండ్ మీ టార్గెట్ అయితే, మీరు పీపీఎఫ్‌ స్కీమ్ లేదా ఎస్‌సీఎస్‌ఎస్‌ స్కీమ్‌ని ఎంచుకోవచ్చు. మీరు మీ ఆడపిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకుంటే, సుకన్య యోజన అత్యంత అనుకూలమైన ఎంపిక. ఈ పథకాలు ఆదాయానికి హామీ ఇస్తాయి. అందువల్ల మీరు డబ్బును పోగొట్టుకోవడం గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ లక్ష్యాలను అవాంతరాలు లేకుండా సాధించవచ్చు.

పెట్టుబడి హోరిజోన్: పెట్టుబడి పెట్టవలసిన పథకాన్ని నిర్ణయించడంలో మీ పెట్టుబడి హోరిజోన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు, మీకు దీర్ఘకాలిక పెట్టుబడి హోరిజోన్ ఉంటే, పీపీఎఫ్‌ లేదా ప్రభుత్వ బాండ్‌లు లేదా ఎస్‌ఎస్‌వై సరైన ఎంపిక. ఒకవేళ మీ ఇన్వెస్ట్‌మెంట్ హోరిజోన్ దాదాపు ఐదు సంవత్సరాలు ఉంటే, మీరు మీ పెట్టుబడి లక్ష్యాన్ని బట్టి ఎఫ్‌డీ, ఎస్‌సీఎస్‌ఎస్‌, ఎన్‌ఎస్‌సీ, పీఓఎంఐఎస్‌లలో ఎదో ఒకదానినిని ఎంచుకోవచ్చు.

టాక్స్: పెట్టుబడి నుంచి వాస్తవ రాబడిని నిర్ణయించేటప్పుడు టాక్స్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు, పీపీఎప్‌-ఎస్‌ఎస్‌వై నుంచి పెట్టుబడులు – రాబడులు పెట్టుబడిదారుల చేతుల్లో పూర్తిగా పన్ను రహితంగా ఉంటాయి. కాబట్టి, స్కీమ్‌ను ఎంచుకునేటప్పుడు పెట్టుబడులు- రాబడిపై పన్ను ప్రభావాలను జాగ్రత్తగా పరిశీలించండి.

మొత్తమ్మీద పెట్టుబడులు ఏవైనా చేయాలి అనుకున్నపుడు అన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. న్వెస్ట్మెంట్ రాబడి కోసం మీ టార్గెట్ ఏమిటి అనేది చాలా ముఖ్యం. దానికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ఏది ఏమైనా పెట్టుబడి పెట్టె ముందు ఆర్థిక సలహాదారులు, నిపుణుల సూచనలను తీసుకోవడం తప్పనిసరి అనేది గుర్తుంచుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి