Investment Plans: మంచి రాబడి.. అధిక భద్రతను అందించే బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే కొన్ని పథకాలు స్థిరమైన రాబడిని అందివ్వడంతో పాటు పూర్తి భద్రత కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భరోసా ఉండే జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే బెస్ట్ పెట్టుబడి పథకాలను మీకు అందిస్తున్నాం. వాటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), గవర్నమెంట్ సెక్యూరిటీస్, సావరీన్ గోల్డ్ బాండ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, నేషనల్ పెన్షన్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఎన్కమ్ స్కీమ్ వంటివి ఉన్నాయి.

ఇటీవల కాలంలో అందరూ తమ భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడుతున్నారు. కొందరూ ట్యాక్స్ సేవింగ్స్ కోసం కొన్ని పథకాలలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే పెట్టుబడి పెట్టే ముందు రాబడి ఎంత ముఖ్యమో.. దానిలో రిస్క్ ఫ్యాక్టర్ కూడా అంతే ముఖ్యం. మన సొమ్ము భద్రంగా ఉండాలి. కచ్చితమైన రాబడి కాకపోయినా.. నష్టం లేకుండా ఉండాలి. అలాంటి పెట్టుబడి పథకాలు ఆశించే వారి కోసమే ఈ కథనం. జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే కొన్ని పథకాలు స్థిరమైన రాబడిని అందివ్వడంతో పాటు పూర్తి భద్రత కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భరోసా ఉండే జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే బెస్ట్ పెట్టుబడి పథకాలను మీకు అందిస్తున్నాం. వాటిల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), గవర్నమెంట్ సెక్యూరిటీస్, సావరీన్ గోల్డ్ బాండ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, నేషనల్ పెన్షన్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఎన్కమ్ స్కీమ్ వంటివి ఉన్నాయి. వీటి గురించిన పరిచయాన్ని ఇప్పుడు చూద్దాం..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్..
దీర్ఘకాలిక ప్రణాళికలో మంచి స్థిరమైన రాబడి కోరుకునేవారికి ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) బెస్ట్ ఆప్షన్. దీనిలో మీరు ఏడాదికి రూ. 500 నుంచి రూ. 1.5లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్టంగా 15ఏళ్ల వరకూ దీనిలో పెట్టుబడి పెట్టే వీలుంటుంది. రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. కానీ స్థిరమైన రాబడి ఇస్తుంది.
గవర్నమెంట్ సెక్యూరిటీలు..
ఏటా ప్రభుత్వం కొన్ని బాండ్లను అందిస్తుంది. ఇవి కూడా సామాన్యులకు మంచి రాబడినిస్తుంది. వీటిల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా మంచి రాబడిని పొందొచ్చు. ప్రభుత్వ అవసరాల కోసం మనం పెట్టుబడి పెట్టడం అన్నమాట. అంటే ప్రభుత్వానికి మనం అప్పు ఇవ్వడం. దానికి ప్రభుత్వం కొంత వడ్డీని పెట్టుబడి దారులకు అందిస్తుంది.
సావరీన్ గోల్డ్ బాండ్స్..
ఇటీవల కాలంలో వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువశాతం మంది ఈ సావరీన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. బంగారు వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తే వాటి సెక్యూరిటీ ఇబ్బంది అవుతుంది కాబట్టి.. ఫిజికల్ గోల్డ్ కన్నా కూడా ఇవి సేఫెస్ట్ ఆప్షన్ గా పెట్టుబడిదారులు ఎంచుకుంటున్నారు. ఈ సావరీన్ గోల్డ్ బాండ్లను ప్రభుత్వమే అందిస్తుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్..
ఈ పథకంలో నిర్ధిష్టమైన కాలానికి కచ్చితమైన రాబడి వస్తుంది. ముందే ఎంత రాబడి వస్తుందో అంచనా వేసుకోవచ్చు. ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో మీరు కనిష్టంగా రూ. 100 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు. మీ తాహతను బట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకాన్ని కూడా పోస్టాఫీసులు, పలు జాతీయ బ్యాంకుల్లో ప్రారంభించవచ్చు.
నేషనల్ పెన్షన్ స్కీమ్..
పదవీవిరమణ ప్రణాళికకు ఈ పథకం బాగా సరిపోతోంది. ప్రభుత్వమే నిర్వహించే ఈ పథకంలో పెట్టుబడులు చాలా సురక్షితంగా ఉంటాయి. వీటిని ప్రభుత్వ నిర్ధేశిత పెన్షన్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు. మీరు పెట్టే పెట్టుబడి భద్రంగా ఉండటంతో పాటు పదవీవిరమణ సమయానికి మంచి రాబడిని అందిస్తుంది.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్..
పోస్టాఫీసుల్లో మాత్రమే లభించే మరో సురక్షిత పెట్టుబడి పథకం ఇది. అతి తక్కువ పెట్టుబడితో దీనిని ప్రారంభించవచ్చు. ఇది నెలవారీ రాబడిని అందిస్తుంది. మీరు నెలవారీ ఆదాయం కావాలని కోరుకుంటే ఈ పథకం మీకు బాగా ఉపయోగపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








