Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే..
పసిడి కొనేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నిన్న మొన్నటి వరకూ పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు మరింత కిందకు దిగివచ్చింది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న మార్పులే దీనికి కారణంగా చెబుతున్నారు నిపుణులు.

బంగారం ధరలు వరుసగా క్షీణిస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు మరింత కిందకు దిగివచ్చింది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న మార్పులే దీనికి కారణంగా చెబుతున్నారు నిపుణులు. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ. 66,330 ఉండగా.. నేడు తులంపై రూ. 10 తగ్గి 66,320కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర నిన్న రూ. 60,800 కాగా ఈరోజు రూ. 10 తగ్గి 60,790 వద్దకు చేరింది. వెండి ధరలు గమనిస్తే.. ఈ వారం మొత్తం తగ్గుతూ వస్తోంది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 80 వేలు కాగా ఈరోజు కేజీ వెండి ధర రూ. 100 తగ్గి 79,900కు చేరింది.
దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- చెన్నైలో 24 క్యారెట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 66,990 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ. 61,410 గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ. 79,900 గా కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విలువ రూ. 66,320 గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 60,790 కు చేరింది. అలాగే కిలో వెండి ధర రూ. 76,900 కు చేరింది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 66,320 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,790 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 75,400 గా ఉంది.
- కోల్కత్తా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విలువ రూ. 66,320 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 60,790 కు చేరింది. కిలో వెండి విషయానికొస్తే.. రూ. 76,900 గా కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




