AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Rates: బిగ్ న్యూస్.. వెండి ధరలు ఆల్ టైం రికార్డ్.. ఏకంగా 2 లక్షలు దాటి.. కారణాలు ఇవేనట. .

వెండి ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా ఇవాళ 2 లక్షల మార్క్‌ను దాటింది. రానున్న రోజుల్లో మరింత గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే వెండి ధరలు పెరుగుదలకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

Silver Rates: బిగ్ న్యూస్.. వెండి ధరలు ఆల్ టైం రికార్డ్.. ఏకంగా 2 లక్షలు దాటి.. కారణాలు ఇవేనట. .
ఇక వెండిపై కూడా భారీగానే తగ్గుముఖం పట్టింది. ఉదయం వరకు అంటే ఆరు గంటల సమయానికి సిల్వర్‌ ధర 2 లక్షల 3100 వద్ద ట్రేడవ్వగా, ప్రస్తుతం 3900 రూపాయలు దిగి వచ్చి కిలో వెండి ధర రూ.1,99,100 వద్ద కొనసాగుతోంది. అదే హైదరాబాద్‌లో రూ.2,11,000 వద్ద కొనసాగుతోంది.
Venkatrao Lella
|

Updated on: Dec 04, 2025 | 8:17 AM

Share

Silver Price: గత కొద్ది నెలలుగా బంగారం రేట్లు ఊహించని విధంగా హైక్ అవుతుండగా.. దానికి పోటీగా వెండి రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. వెండి ధరలు ఇవాళ రికార్డు స్థాయిలో పెరిగి 2 లక్షల మార్క్‌ను దాటాయి. ఏడాది క్రితం కేజీ వెండి లక్ష దాటడంతో వామ్మో అని అందరూ అనుకున్నారు. కానీ క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు గోల్డ్‌ను దాటేసి 2 లక్షలకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో భారత్‌లో వెండి ధర బ్రేక్‌లు లేకుండా దూసుకుపోతుంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న అంచనాలు కూడా వెండి రేట్లు పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వెండి రేట్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో కిలో వెండి రూ.2,01,100గా కొనసాగుతోంది. వెండి ధరల పెరుగుదలకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి.

డిమాండ్ పెరగడం

గత రెండు ఏళ్ల నుంచి సరఫరా కంటే వెండికి డిమాండ్ పెరిగింది. ధరల పెరుగుదలకు ఇదొక కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో కొరత కారణంగా మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ఇక వెండి తుప్పు పట్టదు కాబట్టి కంప్యూటర్లు, జీపీఎస్ యూనిట్లు, స్విచ్‌లు, రిలేలు, సర్క్యూట్ బోర్డులు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, కనెక్టర్లు వంటి ఎలక్ట్రానిక్, విద్యుత్ కనెక్షన్ల కోసం ఉపయోగిస్తున్నారు. వెండి రేట్లు పెరగుదలకు ఇదొక కారణంగా చెబుతున్నారు.

వైద్య పరికరాలు, ఏరోస్పేస్‌లో వినియోగం

ఇక వెండిని ఏరోస్సేస్, అంతరిక్ష పరిశోధనల్లో కూడా ఉపయోగిస్తు్న్నారు. ఉపగ్రహాలు, రాకెట్లు, అంతరిక్ష నౌకలు వంటి వాటిల్లో విద్యుత్ ప్రసారం కోసం వెండిని ఉపయోగిస్తున్నారు. అంతరిక్షంలో అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి పూతగా ఉపయోగిస్తున్నారు. ఇక దంతవైద్యంలో క్రౌన్స్, బ్రిడ్జెస్ వంటి వాటితో పాటు గుండెకు సంబంధించిన ఆపరేషన్లు, ఇమేజింగ్ పరికరాల్లో ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు నానోటెక్నాలజీ పరికరాలు, గ్లాస్, కిటికీలు వంటి వాటిని వినియోగిస్తున్నారు. ఇక సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలు, పారిశ్రామిక రసాయనాలు వంటి వాటిల్లో కూడా ఉపయోగిస్తు్న్నారు.

డబ్ల్యూటీసీలో ఆసీస్‌కు గట్టి షాక్.. భారత్ అవుట్.!
డబ్ల్యూటీసీలో ఆసీస్‌కు గట్టి షాక్.. భారత్ అవుట్.!
పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..