7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. డీఏ పెంపుతో వచ్చిన ఇతర అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు..

కేంద్ర కేబినెట్ మార్చి 7వ తేదీన డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను నాలుగు శాతం పెంచింది. దీంతో మొత్తం వేతనంలో 50 శాతానికి చేరింది. ఇది సుమారు కోటిమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుంది. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమలు చేసింది. దీనితో పాటు ఉద్యోగులకు హెచ్ఆర్ఏను కూడా పెంచింది.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. డీఏ పెంపుతో వచ్చిన ఇతర అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు..
7th Pay Commission
Follow us
Madhu

|

Updated on: May 06, 2024 | 2:20 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వరుసగా శుభవార్తలు వింటున్నారు. ఇటీవల వారి డీఏ 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో పాటు మరికొన్ని అలవెన్సులు కూడా పెరిగాయి. గ్రాట్యూటీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, హాస్టల్ సబ్సిడీ తదితర వాటిని 25 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 7వ పే కమీషన్ నివేదిక ప్రకారం ప్రాథమిక జీతంలో డీఏ 50 శాతానికి చేరుకున్నప్పుడు పిల్లల విద్యా భత్యం, హాస్టల్ సబ్సిడీ, రిటైర్‌మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీలలో పెరుగుదల ఆటోమేటిక్ ఉంటుంది.

కేంద్ర ఉద్యోగులకు ప్రయోజనం..

కేంద్ర కేబినెట్ మార్చి 7వ తేదీన డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను నాలుగు శాతం పెంచింది. దీంతో మొత్తం వేతనంలో 50 శాతానికి చేరింది. ఇది సుమారు కోటిమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుంది. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమలు చేసింది. దీనితో పాటు ఉద్యోగులకు హెచ్ఆర్ఏను కూడా పెంచింది. బేసిక్ పేలో డీఏ 50 శాతానికి చేరుకోవడంతో రైల్వే యూనియన్లతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు 8వ పే కమిషన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌లను లేవనెత్తడం ప్రారంభించాయి.

ఉత్తర్వుల జారీ..

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీ విడుదల చేసిన ఉత్తర్వులలో అనేక విషయాలు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డియర్‌నెస్ అలవెన్స్‌ను బేసిక్ పేలో 50 శాతానికి సవరించడం వల్ల రిటైర్మెంట్ గ్రాట్యూటీ, డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి 25 శాతం నుంచి రూ. 25 లక్షలకు పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ ఇస్తారు. జనవరి, జూలై నుంచి అమలులోకి వచ్చేలా సంవత్సరానికి రెండుసార్లు డీఏ, డీఆర్ పెంచుతారు.

ధరల పెరుగుదల ఆధారంగా..

ఆల్ ఇండియా సీపీఐ ఐడబ్ల్యూ 12 నెలల సగటు పెరుగుదల శాతం ఆధారంగా డీఏ, డీఆర్ పెంపును నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1న అలవెన్సులను సవరిస్తుంది. అయితే ఆ నిర్ణయాన్ని సాధారణంగా మార్చి, సెప్టెంబర్/అక్టోబర్‌లలో ప్రకటిస్తారు. 2006లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లను లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్ములాను సవరించింది. డీఏ పెంచే విషయాన్ని వివిధ అంశాల ఆధారంగా లెక్కిస్తారు. సాధారణంగా ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటుంది. సీపీఐ-ఐడబ్ల్యూ డేలా ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను సవరిస్తారు.

ఏడో వేతన సంఘం ప్రకారం..

దేశంలోని సివిల్, మిలిటరీ ఉద్యోగులందరి జీతాలను సమీక్షించడానికి 2014లో ఏడో వేతన సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాని ప్రకారం ప్రభుత్వంలో కనీస వేతనం నెలకు రూ.18 వేలుగా నిర్ణయించాలని సిఫారసు చేశారు.అపెక్స్ ఉద్యోగులకు నెలవారీ గరిష్ట జీతం రూ.2,25,000. అయితే క్యాబినెట్ సెక్రటరీ ఉద్యోగులకు, ప్రస్తుతం అదే స్థాయిలో ఉన్న వారికి రూ.2.50,000 ఇస్తారు.మూడుశాతం వార్షిక ఇంక్రిమెంట్ కొనసాగుతుంది.

హెచ్ఆర్ఏ కేటగిరీలు..

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏ అలవెన్స్ 50 శాతానికి చేరుకోవడంతో హౌస్ రెంట్ అలవెన్స్ కూడా పెరిగింది. ఉద్యోగులు నివాసం ఉంటే ప్రాంతాలను బట్టి దాదాపు 30 శాతం వరకూ హెచ్ ఆర్ ఏ పొందుతారు. ముఖ్యంగా ఇది మూడు కేటగిరీలుగా ఉంటుంది. ఎక్స్ కేటగిరీ నగరాల్లో నివసించే ఉద్యోగులు తమ బేసిక్ జీతంలో 24 శాతం, వై కేటగిరీ నగరాల్లో ఉద్యోగులు 16 శాతం, జెడ్ కేటగిరీ వారు 8 శాతం హెచ్ ఆర్ ఏ పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..