SBI FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకొనే వారికి గుడ్ న్యూస్.. అత్యధిక వడ్డీతో సూపర్ స్కీమ్‌లు.. పూర్తి వివరాలు ఇవి..

దేశంలోని అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఫిక్స్ డ్ డిపాజిట్లపై అధిక వడ్డీలను ఆఫర్ చేస్తోంది. అందులోనే బ్యాంక్ టాప్ స్కీమ్స్ అయిన ఎస్బీఐ వీకేర్, ఎస్బీఐ అమృత్ కలాష్ వంటి పథకాలు ఉన్నాయి. వీటిలో ఎస్బీఐ వీకేర్ కేవలం సీనియర్ సిటిజెనులకు ప్రత్యేకించిన పథకం కాగా, అమృత్ కలాష్ పరిమిత సమయంలో అధిక వడ్డీ రేట్లను అందించే స్కీమ్.

SBI FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకొనే వారికి గుడ్ న్యూస్.. అత్యధిక వడ్డీతో సూపర్ స్కీమ్‌లు.. పూర్తి వివరాలు ఇవి..
SBI
Follow us
Madhu

|

Updated on: Aug 07, 2023 | 5:15 PM

సురక్షిత పెట్టుబడి పథకాలలో ఫిక్స్ డ్ డిపాజిట్ ముందు వరుసలో ఉంటుంది. అధిక వడ్డీతో పాటు స్థిరమైన రాబడి, పన్ను రాయితీలు దీనికి అధికర జానాదరణను తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా వృద్ధులకు ఇది పథకం బెస్ట్ ఆప్షన్ గా ఉంటోంది. అయితే దేశంలోని అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఈ ఫిక్స్ డ్ డిపాజిట్లపై అధిక వడ్డీలను ఆఫర్ చేస్తోంది. అందులోనే బ్యాంక్ టాప్ స్కీమ్స్ అయిన ఎస్బీఐ వీకేర్, ఎస్బీఐ అమృత్ కలాష్ వంటి పథకాలు ఉన్నాయి. వీటిలో ఎస్బీఐ వీకేర్ కేవలం సీనియర్ సిటిజెనులకు ప్రత్యేకించిన పథకం కాగా, అమృత్ కలాష్ పరిమిత సమయంలో అధిక వడ్డీ రేట్లను అందించే స్కీమ్. ఇటీవల బ్యాంకు తన ఎఫ్ డీ పథకాలపై వడ్డీ రేట్లను సవరించింది. ఆ రేట్ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ కొత్త వడ్డీ రేట్లు..

ఎస్బీఐ లో 7రోజుల నుంచి 10 ఏళ్ల వరకూ ఉండే ఎఫ్డీ ఖాతాలపై 3శాతం నుంచి 7.1 శాతం వరకూ వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజెనులకు అయితే 50 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) ఎక్కువ వడ్డీ వస్తుంది.

  • 7 రోజుల నుంచి 45 రోజులు – 3%
  • 46 రోజుల నుండి 179 రోజులు – 4.5%
  • 180 రోజుల నుంచి 210 రోజులు – 5.25%
  • 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ – 5.75%
  • 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ – 6.8%
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ – 7.00%
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ – 6.5%
  • 5 సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు – 6.5%
  • 400 రోజులు (ప్రత్యేక పథకం అంటే ” అమృత్ కలాష్”) 7.10

అమృత్ కలాష్ డిపాజిట్ పథకం..

దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిబ్రవరిలో “400 రోజుల” (అమృత్ కలాష్) నిర్దిష్ట అవధి పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఎఫ్డీ సీనియర్ సిటిజన్‌లకు 7.6 శాతం, ఇతరులకు 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 400 రోజుల పదవీకాలం.. ఇది ఆగస్టు 15తో ముగియనుంది.

ఇవి కూడా చదవండి

ఎస్బీఐ వీకేర్ డిపాజిట్ పథకం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సీనియర్ సిటిజన్ల కోసం తన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకమైన ఎస్బీఐ వీకేర్ ను పొడిగించింది. ఇది 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధిలో వృద్ధులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది.ఇది సెప్టెంబర్ 30, 2023 వరకు పొడిగించబడింది. తాజా డిపాజిట్లు, మెచ్యూరింగ్ డిపాజిట్ల పునరుద్ధరణపై ఈ పథకం అందుబాటులో ఉంది. ఈ పథకం అందించే వడ్డీ రేటు 7.50%గా ఉంది.

లాభాల బాటలో ఎస్బీఐ..

దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి రెండు రెట్లు వృద్ధి సాధించి, రూ.16,884 కోట్లకు చేరుకుంది, ఇది మొండి బకాయిలు తగ్గడం, వడ్డీ ఆదాయంలో మెరుగుదల కారణంగా సాధ్యపడింది. డిపాజిట్లు 12.00% వృద్ధి చెందాయని నివేదించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే