High Range EVs: సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్ ఇచ్చే ఈ-స్కూటర్లు ఇవే.. పెట్రోల్ వాహనాల కన్నా మిన్నగా..

పెరుగుతున్న పెట్రోలు ధరలు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ ప్రోత్సాహకాల నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల పై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తద్వారా వాటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వాహన తయారీదారులు కూడా ప్రజల అభిరుచి మేరకు రేంజ్, స్పీడ్, స్టైల్ పై ఫోకస్ చేసి, ఈవీలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అత్యధిక రేంజ్ కలిగిన ఐదు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల గురించి తెలుసుకుందాం.

High Range EVs: సింగిల్ చార్జ్‌పై అత్యధిక రేంజ్ ఇచ్చే ఈ-స్కూటర్లు ఇవే.. పెట్రోల్ వాహనాల కన్నా మిన్నగా..
High Range Electric Scooters
Follow us

|

Updated on: Jun 22, 2024 | 3:57 PM

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు వాటి రేంజ్ గురించే ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్ల రేంజ్ ఆ వాహనం ప్రయాణిస్తుందో ఆరా తీస్తారు. ఆ తర్వాతే మోటార్, బ్యాటరీ, ఇతర విషయాలను తెలుసుకుంటారు. పెరుగుతున్న పెట్రోలు ధరలు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ ప్రోత్సాహకాల నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల పై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తద్వారా వాటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వాహన తయారీదారులు కూడా ప్రజల అభిరుచి మేరకు రేంజ్, స్పీడ్, స్టైల్ పై ఫోకస్ చేసి, ఈవీలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అత్యధిక రేంజ్ కలిగిన ఐదు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల గురించి తెలుసుకుందాం.

ఏథర్ 450 అపెక్స్..

ఏథర్ 450 అపెక్స్ ద్విచక్ర వాహనం అత్యధిక రేంజ్ కలిగిన ఈవీలలో ఐదో స్థానంలో నిలిచింది. అలాగే ఆ కంపెనీకి చెందిన 450 సిరీస్ లోనే రేంజ్ టాపింగ్ వెర్షన్ గా మారింది. ఈ స్కూటర్ ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే 157 కిలోమీటర్లు హాయిగా ప్రయాణం చేయవచ్చు. అలాగే గంటలకు 100 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకుపోవచ్చు. ఏథర్ 450 అపెక్స్ స్కూటర్ రూ.1.96 లక్షలకు (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉంది.

ఏథర్ రిజ్టా..

ఏథర్ రిజ్టా ద్విచక్ర వాహనం కూడా కొనుగోలుదారులకు మంచి రేంజ్ అందిస్తోంది. అత్యధిక రేంజ్ కలిగిన ఈవీలలో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 159 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయవచ్చు. 450 సిరీస్ లోని బ్యాటరీనే దీనిలో కూడా అమర్చారు. ముఖ్యంగా రోజూ వారీ పనులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కిరాణా సామగ్రి, ఇతర నిత్యావసర వస్తువులను తీసుకురావడానికి అవసరమైన ఖాళీ ఉంది. ఈ స్కూటర్ రూ. 1.11 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి అందుబాటులో ఉంది.

ఒకాయ ఫాస్ట్..

ఎలక్ట్రిక్ వాహనాలలో రేంజ్ కోసం చూసే వారికి ఇది కూడా మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఒకాయ ఫాస్ట్ స్కూటర్ పేరులోనే కాదు ప్రయాణంలోనూ ఫాస్ట్ గానే దూసుకుపోతుంది. దీనికి ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 160 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుంది. ఒకాయ ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.44 లక్షలు.

ఒకినావా ఓకేహెచ్ఐ-90..

ఒకినావా కంపెనీ కొంతకాలంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. దీని మోడళ్లలో ఓకేహెచ్ఐ-90కు అత్యంత ఆదరణ ఉంది. ఈ స్కూటర్ ను ఒక్కసారి చార్జింగ్ చేస్తు 160 కిలోమీటర్లు దూసుకుపోవచ్చు. 16 అంగుళాల వీల్స్ దీనికి మరో ప్రత్యేకత. ఈ స్కూటర్ రూ.1.86 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది.

ఓలా ఎస్ 1 ప్రో..

దేశంలో అత్యధిక రేంజ్ కలిగిన ద్విచక్ర వాహనం ఓలా ఎస్ 1 ప్రో. దీనికి ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 195 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. అలాగే గంటలకు 120 కిలోమీటర్ల స్పీడ్ తో పరుగులు తీయడం దీని ప్రత్యేకత. ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ రూ.1.32 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఓలా టీఎఫ్టీ డాష్, మ్యూజిక్ కోసం స్పీకర్లు, నావిగేషన్, ఇతర ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..