AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Offers: క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూన్ ఆఫర్లు.. మళ్లీ తిరిగిరావు.. వదలొద్దు..

క్రెడిట్ కార్డు ఉంటే సరిపోదు. ఆఫర్లు ఎక్కువగా అందించే క్రెడిట్ కార్డులను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఆ కార్డుల ప్రమోషనల్ సైకిల్స్ గురించి అవగాహన కలిగి ఉండటం కూడా అవసరం. అప్పుడే మీరు ఆ తగ్గింపులు, అదనపు ప్రయోజనాలను ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

Credit Card Offers: క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూన్ ఆఫర్లు.. మళ్లీ తిరిగిరావు.. వదలొద్దు..
Credit Card
Madhu
|

Updated on: Jun 09, 2024 | 1:07 PM

Share

జూన్ నెలలో అప్పుడే మొదటి వారం అయిపోయింది. సాధారణంగానే వేసవి సెలవులు అయిపోతాయి. స్కూళ్లు, కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యే సమయం. అయితే ఈ ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరం జరిగింది. ఇప్పుడు అంతా పూర్తయ్యి పోవడంతో అందరూ ఇప్పుడు రిలాక్స్ గా కుటుంబంతో బయటకు టూర్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది వారికి వేసవి సెలవులుగా మారుతున్నాయి. వాస్తవంగా టూర్ అంటే ఖర్చుతో కూడుకున్నది. అదీ కుటుంబంతో అంటే చాలా డబ్బులు అవసరం అవుతాయి. అలాంటి సమయంలో బాగా ఉపయోగపడేవి క్రెడిట్ కార్డులు. దీంతో చాలా మంది వీటిని ట్రావెలింగ్, షాపింగ్, ఫుడ్ కోసం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో క్రెడిట్ కార్డు సంస్థలు దీనిని క్యాష్ చేసుకునే విధంగా అంటే మరింత ఎక్కువగా క్రెడిట్ కార్డులు వినియోగించేలా ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ట్రావెలింగ్, షాపింగ్, ఫుడ్ మీద క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్స్, రివార్డులు అందిస్తున్నాయి. వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సరైన క్రెడిట్ కార్డు..

క్రెడిట్ కార్డు ఉంటే సరిపోదు. ఆఫర్లు ఎక్కువగా అందించే క్రెడిట్ కార్డులను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఆ కార్డుల ప్రమోషనల్ సైకిల్స్ గురించి అవగాహన కలిగి ఉండటం కూడా అవసరం. అప్పుడే మీరు ఆ తగ్గింపులు, అదనపు ప్రయోజనాలను ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఒక్కో కొనుగోలుకు ఒక్కో కార్డు..

రివార్డ్‌లను పెంచుకోవడానికి మీరు చేసే వివిధ రకాల కొనుగోళ్లకు వేర్వేరు కార్డ్‌లను ఉపయోగించాలి. ఉదాహరణకు ప్రయాణానికి ఒక కార్డ్, కిరాణా కోసం మరొకటి ఇలా మీరు కార్డులను విభాగించుకోవాలి. కొన్ని కార్డ్‌లు కొన్ని ఖర్చులపై మెరుగైన రివార్డ్‌లను అందిస్తాయి. అటువంటి కార్డులను ట్రాక్ చేయాలి. తదనుగుణంగా మీ ఖర్చును సర్దుబాటు చేయాలి గరిష్ట తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌ల ప్రయోజనాన్ని పొందడానికి మీరు ఆఫర్ వ్యవధిలో ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, ప్రయాణ బుకింగ్‌లు వంటి పెద్ద కొనుగోళ్లను కూడా ప్లాన్ చేయవచ్చు.

జూన్ నెలలో కొన్ని క్రెడిట్ కార్డులపై ఆఫర్లు ఇవే..

హెచ్ఎస్బీసీ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్..

  • క్రోమా ఆఫర్.. ఈ కార్డుతో క్రోమా స్టోర్లో కొనుగోలు చేస్తే ఈఎంఐ లావాదేవీలపై రూ. 5,000 వరకూ తగ్గింపు ఉంటుంది.
  • మేక్ మై ట్రిప్.. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై 35% వరకు తగ్గింపు.
  • గోఐబిబో.కామ్.. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై 15% వరకు తగ్గింపు. ఈ ఆఫర్ ముగింపు తేదీ 30-06-2024.
  • డైకిన్: డైకిన్ ఎయిర్ కండీషనర్‌లపై గరిష్టంగా రూ.2,500 తగ్గింపు. ఆఫర్ ముగింపు తేదీ 30-06-2024.
  • బుక్ మై షో.. సినిమా టిక్కెట్లపై బీ1జీ1 ఉచితం. ఆఫర్ ముగింపు తేదీ 30-062024
  • పీవీఆర్.. 10% తక్షణ తగ్గింపు. ఆఫర్ ముగింపు తేదీ 30-06-2024
  • జోమాటో.. డైనింగ్ ముగింపు తేదీపై 12% తగ్గింపు. ఆఫర్ ముగింపు తేదీ 30-06-2024
  • ఫ్లిప్ కార్ట్.. 10% తక్షణ తగ్గింపు. ఈ ఆఫరఱ్ ముగింపు తేదీ 30-06-2024

ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్..

  • అజియో: 30 జూన్ 2024 వరకు ఫ్లాట్ రూ. 4,000 తగ్గింపు
  • ఈజీడినర్: 30 జూన్ 2024 వరకు 15% తగ్గింపు
  • జీవా: ఫ్లాట్ రూ.200 తగ్గింపు. ఆఫర్ ముగింపు తేదీ 30-06-2024
  • మింత్రా.. అదనపు 10% తగ్గింపు. ఆఫర్ ముగింపు తేదీ 30-06-2024
  • లైఫ్ స్టైల్.. అదనపు 15% తగ్గింపు. ఆఫర్ ముగింపు తేదీ30-06-2024
  • హెల్త్ కార్ట్.. 70% వరకు తగ్గింపు + అదనపు 10% తగ్గింపు. ఈ ఆఫర్ ముగింపు తేదీ 30-06-2024
  • లెనోవో.. 30% వరకు తగ్గింపు + అదనపు రూ.2000 తగ్గింపు ముగింపు తేదీ 30-06-2024

ఎస్ బ్యాంక్ – బ్యాంక్‌బజార్ ఫిన్‌బూస్టర్ క్రెడిట్ కార్డ్..

  • రిలయన్స్ డిజిటల్.. 30 జూన్ 2024 వరకు రూ. 7,000 వరకు తగ్గింపు
  • ఈజ్ మై ట్రిప్.. 30 జూన్ 2024 వరకు 35% వరకు తగ్గింపు
  • అజియో.. 10% తగ్గింపు ముగింపు తేదీ 28-05-2024
  • ఈజీ డిన్నర్.. 15% తగ్గింపు ప్రోమో కోడ్: YES750. ఈ ఆఫర్ ముగింపు తేదీ 30-06-2024
  • ఫ్లిప్ కార్ట్: 10% తగ్గింపు. ఆఫర్ ముగింపు తేదీ: 30-06-2024
  • గోఐబిబో.కామ్.. 20% వరకు తగ్గింపు. ఆఫర్ ముగింపు తేదీ 30-06-2024
  • స్విగ్గీ.. ఫ్లాట్ రూ.75 తగ్గింపు. ఆఫర్ ముగింపు తేదీ 30-06-2024

మీరు ఆయా కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లలో ఈ క్రెడిట్ కార్డ్‌ల ఆఫర్‌లను తనిఖీ చేస్తే.. ఈ ఆఫర్‌లతో పాటు మరిన్ని ఎక్కువ డిస్కౌంట్‌లను కూడా పొందే అవకాశం ఉంది. మీరు తప్పనిసరిగా ఈ ఆఫర్‌లను తనిఖీ చేసి, మీ అవసరాలు, అవసరాలకు అనుగుణంగా వాటిని ఉపయోగించుకోవాలి. అయితే, అదనపు వడ్డీని చెల్లించకుండా ఉండటానికి మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించాలని గుర్తుంచుకోవడం ముఖ్యం. అందుకే, మీ రీపేమెంట్ కెపాసిటీలో ఖర్చు చేయడం చాలా అవసరం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..