Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat’s UPI Services: ప్రపంచ వ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ కొత్త ట్రెండ్.. ఎన్ని దేశాల్లో అందుబాటులో ఉందంటే..

ఈ మేక్ ఇన్ ఇండియా ఇన్వెన్షన్.. మేక్ ఫర్ ద వరల్డ్ నినాదంతో గ్లోబల్ వైడ్ గా సత్తా చాటేందుకు సమాయత్తమైంది. ఇప్పటికే యూపీఐ సర్వీసెస్ ప్రపంచంలోని ఏడు దేశాలు అంగీకరిస్తున్నాయి. ఇటీవల శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ పేమెంట్స్ విధానాన్ని ప్రారంభించగా.. అంతకన్నా ముందే ఫ్రాన్స్, యూఏఐ, సింగపూర్, భూటాన్, నేపాల్‌ వంటి దేశాలు అనుమతించాయి.

Bharat's UPI Services: ప్రపంచ వ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ కొత్త ట్రెండ్.. ఎన్ని దేశాల్లో అందుబాటులో ఉందంటే..
UPI Payments
Follow us
Madhu

|

Updated on: Feb 16, 2024 | 8:53 AM

మన దేశంలో బ్యాంకింగ్ రంగం డిజిటల్ బాటలో వేగంగా పయనిస్తోంది. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ) రాకతో ఆర్థిక లావాదేవీల స్వరూపమే మారిపోయిందని చెప్పాలి. అసలు బ్యాంకులకు వెళ్లడమే అవసరం లేకుండా సులువుగా, సులభంగా లావాదేవీలు జరుపుకనే అవకాశం ఇప్పుడు ఏర్పడింది. వీధి చివరి బట్టి కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ యూపీఐ సర్వీస్ లేని ప్రాంతం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఈ మేక్ ఇన్ ఇండియా ఇన్వెన్షన్.. మేక్ ఫర్ ద వరల్డ్ నినాదంతో గ్లోబల్ వైడ్ గా సత్తా చాటేందుకు సమాయత్తమైంది. ఇప్పటికే యూపీఐ సర్వీసెస్ ప్రపంచంలోని ఏడు దేశాలు అంగీకరిస్తున్నాయి. ఇటీవల శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ పేమెంట్స్ విధానాన్ని ప్రారంభించగా.. అంతకన్నా ముందే ఫ్రాన్స్, యూఏఐ, సింగపూర్, భూటాన్, నేపాల్‌ వంటి దేశాలు అనుమతించాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ మెసేజ్ ను షేర్ చేసింది. అందులో ప్రపంచ మ్యాప్‌ను ఉంచుతూ భారతీయులు చెల్లింపులు చేయడానికి యూపీఐని ఉపయోగించగల దేశాలను హైలైట్ చేసింది. దానిపై మేక్ ఫర్ ద వరల్డ్ అని క్యాప్షన్ ఇచ్చింది.

లక్ష్యం ఇదే..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అనేది భారతదేశంలో ప్రారంభించిన మొబైల్ ఆధారిత వేగవంతమైన చెల్లింపు వ్యవస్థ. ఇది వర్చువల్ చెల్లింపు చిరునామా (వీపీఏ)ని ఉపయోగించి కస్టమర్‌లు 24 గంటలూ తక్షణ చెల్లింపులను చేయడానికి అనుమతిస్తుంది. భారతదేశంలో రిటైల్ డిజిటల్ చెల్లింపులకు దాని ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. భారత ప్రభుత్వం యూపీఐ ప్రయోజనాలను భారతదేశానికే పరిమితం చేయకుండా ప్రపంచమంతా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయంగా దీనిని అందుబాటులో ఉంచాలని లక్ష్యాంగా నిర్ధేశించుకుంది. యూపీఐ 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ద్వారా ప్రారంభమైంది. వేగంగా విస్తరించింది.

ఎన్ని బ్యాంకులు లింక్ అంటే..

యూపీఐ సర్వీస్ 300కి పైగా బ్యాంకులను కలుపుతుంది. బ్యాంకింగ్ ప్రొవైడర్ల భాగస్వామ్యంతో గూగుల్ పే, అమెజాన్ పే, ఫోన్ పే, పేటీఎం, టీపాప్(థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు) ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేని ఆర్థిక లావాదేవీలను అనుమతిస్తుంది.

యూపీఐ ఎనేబుల్డ్ దేశాలు ఇవే..

  • శ్రీలంక, మారిషస్.. భారతదేశ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు శ్రీలంక, మారిషస్‌లలో ఫిబ్రవరి 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రెండు ద్వీప దేశాల అగ్ర నాయకత్వం హాజరైన వర్చువల్ వేడుకలో ప్రారంభించారు.
  • ఫ్రాన్స్.. యూపీఐ చెల్లింపులను ఆమోదించిన మొదటి వ్యాపారి ఫ్రాన్స్ ఈఫిల్ టవర్. కాగా దీనిని మరింత విస్తరించేందుకు ఫ్రాన్స్ ప్రయత్నిస్తోంది. ఫ్రాన్స్ తోపాటు యూరప్‌లోని పర్యాటక, రిటైల్ ప్రదేశాల్లోని వ్యాపారులకు అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తోంది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం పారిస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు.
  • యూఏఈ.. ఎన్పీసీఐకి చెందిన ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) ఆగస్ట్ 2021లో యూఏఈలో యూపీఐ సేవలను ప్రారంభించింది. ఇది యూఏఈలోని ప్రముఖ ఆర్థిక సంస్థలలో ఒకటైన మష్రెక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది.
  • సింగపూర్, భూటాన్.. 2021లో యూపీఐని స్వీకరించిన మొదటి దేశం భూటాన్.
  • నేపాల్.. ఫిబ్రవరి 2022లో భారతదేశం వెలుపల చెల్లింపు వేదికగా యూపీఐని అమలు చేసిన దేశంగా నేపాల్ నిలిచింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..