Car: మీ కారు బ్యాటరీ పాడైందని చెప్పే సంకేతాలు ఇవే.. ఓసారి చెక్‌ చేసుకోండి

కారు పర్‌ఫెక్ట్ కండిషన్‌ ఉండాలంటే ఇంజన్‌ ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కారులో ఇంజన్‌ పనితీరు ఎంత ముఖ్యమో బలమైన బ్యాటనీ కూడా ఉండాలని తెలిసిందే. కారు ఆన్‌ కావాలంటే కచ్చితంగా బ్యాటరీ హెల్తీగా ఉండాలని. అయితే కారు బ్యాటరీ పనితీరులో ఏవైనా లోపాల ఉంటే కచ్చితంగా కారు పనితీరుపై ప్రభావం పడుతుంది...

Car: మీ కారు బ్యాటరీ పాడైందని చెప్పే సంకేతాలు ఇవే.. ఓసారి చెక్‌ చేసుకోండి
Car Battery
Follow us

|

Updated on: Jun 20, 2024 | 9:53 AM

కారు పర్‌ఫెక్ట్ కండిషన్‌ ఉండాలంటే ఇంజన్‌ ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కారులో ఇంజన్‌ పనితీరు ఎంత ముఖ్యమో బలమైన బ్యాటనీ కూడా ఉండాలని తెలిసిందే. కారు ఆన్‌ కావాలంటే కచ్చితంగా బ్యాటరీ హెల్తీగా ఉండాలని. అయితే కారు బ్యాటరీ పనితీరులో ఏవైనా లోపాల ఉంటే కచ్చితంగా కారు పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇంతకీ బ్యాటరీ హెల్త్ సరిగ్గా ఉందా లేదా అన్న విషయాన్ని కొన్ని లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కారు ఆన్‌ చేసిన సమయంలో అదనపు సమయం తీసుకుంటే బ్యాటరీ బలహీనంగా మారినట్లు అర్థం చేసుకోవాలి. మంచి నాణ్యత కలిగిన బ్యాటరీ అయితే ఒకే ప్రయత్నంలోనే కారు ఆన్‌ అవుతుంది. అలాకాకుండా ఎక్కువ సమయం పడితే మాత్రం బ్యాటరీ వీక్‌ అయినట్లు అర్థం చేసుకోవాలి.

* సాధారణంగా కారు బ్యాటరీ కెపాసిటీ 12.6 వోల్ట్ ఉంటాయి. బ్యాటరీని పరీక్షించినప్పుడు 12.5-12.6 వోల్టుల మధ్యలో ఉంటే, అది ఆరోగ్యకరమైన బ్యాటరీ అని అర్థం. అలాకాకుండా, బ్యాటరీ వోల్టేజ్ 12.2 కన్నా తక్కువగా ఇండికేట్ చేసినట్లయితే, అలాంటి బ్యాటరీ 50 శాతం మాత్రమే చార్జ్ అవుతుంది లేదా త్వరగా బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందని అర్థం.

* ఇక కారులో ఉండే ఎలక్ట్రానిక్ ఉపకరణాల పనితీరులో ఏవైనా లోపాలు ఉంటే కూడా బ్యాటరీ పనితీరు దెబ్బతిందని అర్థం చేసుకోవాలి. కారులోని లైట్స్‌ బ్రైట్‌నెస్‌ తగ్గినా, ఆడియో సిస్టమ్‌ డౌన్‌ అయినా బ్యాటరీ పనితీరు దెబ్బతింటోందని అర్థం చేసుకోవాలి.

* ఇక ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న చాలా కార్లలో డాష్‌బోర్డ్‌పై బ్యాటరీ వార్నింగ్ లైట్స్‌ను అందిస్తున్నారు. కారు బ్యాటరీలో ఏదైనా సమస్య ఉంటే కారులోని ఈసియూ దానిని ఆటోమేటిక్‌గా గుర్తించి డ్యాష్‌బోర్డులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై వార్నింగ్ లైట్ రూపంలో అలర్ట్ చేస్తుంది.

* కొన్ని సందర్భాల్లో కార్లలో లైట్స్‌ను లేదా ఆడియో సిస్టమ్‌ను ఆన్‌ చేసి మర్చిపోతుంటాం. ఇలాంటి సందర్భాల్లో కూడా బ్యాటరీ డిశ్చార్జ్‌ అవుతుంది. అందుకే రాత్రుళ్లు కారు పార్కింగ్ చేసే సమయంలో అన్ని చెక్‌ చేసుకోవాలి.

* సెన్సర్‌లలో ఉండే సమస్యల కారణంగా కూడా బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్‌ అవుతుంది. ఏ కారణం లేకుండా బ్యాటరీ డిశ్చార్జ్‌ అవుతే కారు ఎలక్ట్రిషియన్స్‌ను చూపిస్తే సమస్య పరిష్కారం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..