AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money transfer: డబ్బులు పంపడానికి ఉత్తమ పద్ధతులు ఇవే.. చార్జీల బాదుడు నుంచి విముక్తి

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. టీ దగ్గర నుంచి దుస్తుల వరకూ, ఆటోల చార్జీల నుంచి విమానాల టికెట్ల వరకూ ఈ విధానంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. చేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారా వివిధ రకాల యాప్ లను ఉపయోగించి చాలా సులువుగా నగదు లావాదేవీలు జరపవచ్చు. అయితే ప్రైవేటు యాప్ ప్రారంభంలో ఈ సేవలను ఉచితంగా అందిస్తాయి.

Money transfer: డబ్బులు పంపడానికి ఉత్తమ పద్ధతులు ఇవే.. చార్జీల బాదుడు నుంచి విముక్తి
Bank Accounts
Nikhil
|

Updated on: Jan 05, 2025 | 4:45 PM

Share

నిర్థిష్ట లావాదేవీల తర్వాత చార్జీలను వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రజలు బ్యాంక్ యాప్ లు, ఎన్ఈఎఫ్ టీ చెల్లింపులపై ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులను ఎలా పంపాలి. దానికి విధించే చార్జీలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. దానిలో భాగంగా బ్యాంకు ఖాతాల్లోని రకాల గురించి తెలుసుకుందాం.

పొదుపు ఖాతా

వ్యక్తిగత ఉపయోగాల కోసం తెరిచే ఖాతాను పొదుపు ఖాతా అంటారు. దీనిలో డబ్బుకు స్థిరమైన వడ్డీరేటు అందుతుంది. దీని ద్వారా డబ్బులను ఉచితంగా బదిలీ చేయవచ్చు. లేకపోతే పరిమిత చార్జీలు విధిస్తారు.

కరెంట్ ఖాతా

వ్యాపారులు, వివిధ రంగాల నిపుణులకు ఈ ఖాతా ఉపయోగపడుతుంది. ఈ ఖాతాకు లావాదేవీల పరిమితి లేదు. కానీ డబ్బును బదిలీ చేస్తే చార్జీలు వర్తిస్తాయి.

ఇవి కూడా చదవండి

జీతం ఖాతా

ఉద్యోగం చేస్తున్న వారికి జీతం ఖాతాలను తెరుస్తారు. ప్రతి నెలా వారికి వచ్చే జీతం దీనిలో జమ అవుతుంది, ఈ ఖాతా ద్వారా డబ్బులు బదిలీ చేస్తే చార్జీలు ఉండవు. అవసరమైన చాలా పరిమితంగా విధిస్తారు.

ఎన్ఆర్ఐ ఖాతా

విదేశీ పౌరులు, దేశం వెలువల నివసిస్తున్న వారికి ఈ ఖాతా ఇస్తారు. విదేశాల నుంచి మన దేశానికి వీటి ద్వారా డబ్బులను పంపవచ్చు.

చార్జీలు ఇలా

  • ఎన్ఈఎఫ్ టీ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్). ఈ విధానంలో చిన్న, పెద్ద మొత్తాలలో డబ్బులను పంపవచ్చు. ఈ లావాదేవీలకు బ్యాంకుల వారీగా చార్జీలు విధిస్తారు. అవి ఒక్క రూపాయి నుంచి రూ.25 వరకూ ఉంటాయి.
  • ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్) ఈ విధానంలో రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తాల లావాదేవీలు జరపవచ్చు. వీటి చార్జీలు రూ.25 నుంచి రూ.52 వరకూ ఉంటాయి. ఐఎంపీఎస్ (తక్షణ చెల్లింపు సేవ) అత్యవసర లావాదేవీల కోసం ఈ విధానంలో డబ్బులను పంపుతారు. ఈ సర్వీసు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. లావాదేవీ చార్జీలుగా రూ.5 నుంచి రూ.15 వరకు వసూలు చేస్తారు.
  • యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్) ఈ విధానంలో చిన్న లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చు. ప్రీమియం లావాదేవీలకు మాత్రం చార్జీలు విధించే అవకాశం ఉంది.
  • క్లాసిక్ చెక్ ట్రాన్స్ ఫర్ చెక్ ద్వారా నగదు బదిలీ చేస్తే డిజిటల్ చార్జీ విధించరు.

ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు డబ్బులను ఆదా చేయడానికి అనేక పద్దతులు ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఉచితంగా సేవలు పొందవచ్చు. దానికోసం కొన్ని చిట్కాలు పాటించాలి

యూపీఐ, ఐఎంపీఎస్

చిన్న లావాదేవీలు నిర్వహించడానికి యూపీఐ, ఐఎంపీఎస్ విధానాలు ఉపయోగంగా ఉంటాయి. వీటి ద్వారా ఉచితంగా డబ్బులను పంపవచ్చు. చార్జీలు విధించినా నామమాత్రంగానే ఉంటాయి.

డిజిటల్ యాప్ లు

వివిధ బ్యాంకులు తమ డిజిటల్ చెల్లింపు యాప్ లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటి ద్వారా లావాదేవీలు జరిగితే డిస్కౌంట్లు కూడా పొందవచ్చు.

బ్యాంకు నిబంధనలు

బ్యాంకుల నిబంధనలను బట్టి లావాదేవీల చార్జీలు మారుతూ ఉంటాయి. కాబట్టి బ్యాంకు విధించే చార్జీలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి