AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recharge: తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ.. బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌..

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. కచ్చితంగా ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే. అయితే తాజాగా పెరిగిన రీఛార్జ్‌ ప్లాన్స్‌తో మొబైల్ యూజర్లు రీఛార్జ్‌ అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా డ్యూయల్ సిమ్‌ ఉపయోగించే వారికి పెరిగిన రీఛార్జ్‌ ధరలు ఇబ్బంది పెడుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో తక్కువ ధరలో ఎక్కువ రోజులు...

Recharge: తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ.. బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌..
Recharge Plans
Narender Vaitla
|

Updated on: Jul 04, 2024 | 2:36 PM

Share

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. కచ్చితంగా ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే. అయితే తాజాగా పెరిగిన రీఛార్జ్‌ ప్లాన్స్‌తో మొబైల్ యూజర్లు రీఛార్జ్‌ అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా డ్యూయల్ సిమ్‌ ఉపయోగించే వారికి పెరిగిన రీఛార్జ్‌ ధరలు ఇబ్బంది పెడుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ లభించే రీఛార్జ్‌ ప్లాన్స్‌ లేవా.? అంటే అవి కూడా ఉన్నాయి. దేశంలో ఉన్న మూడు ప్రధాన టెలికాం సంస్థలకు సంబంధించిన బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్స్‌పై ఓ లుక్కేయండి..

జియో రూ. 189 ప్లాన్‌..

అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది వినియోగదారులను సొంతం చేసుకున్న జియో రూ. 189 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో మొత్తం 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. నెలకు 1000 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. అలాగే జియో టీవీతో పాటు, జియో సినిమాకు ఉచిత యాక్సెస్‌ లభిస్తుంది.

ఎయిర్‌టెల్‌ రూ. 199..

ఎయిర్‌టెల్‌ అందిస్తున్న రూ. 199తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్‌ లభిస్తాయి. ఈ ప్లాన్‌తో 2 జీబీ డేటా పొందొచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇక ఎయిర్‌టెల్‌లో రూ. 155 ప్లాన్‌ కూడా లభిస్తోంది. ఇది 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

వొడాఫోన్ ఐడియా రూ. 199

రూ. 199 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తోంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిడెట్‌ కాల్స్‌ పొందొచ్చు. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కి అయినా కాల్స్‌ చేసుకోవచ్చు. యూజర్లు రోజుకు సుమారు రూ. 7 చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!