AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds: ఈ ఫండ్స్ లో సిప్ చేస్తే లాభాల పంటే.. మూడేళ్ల లోనే ఊహించని విధంగా ఆదాయం

ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) అంటారు. దీనిలో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీనిని టాక్స్ సేవర్ ఫండ్స్ అని కూడా అంటారు. వీటిలో సిప్ (sip), లంప్ సంప్ విధానంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ లో మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.

Mutual Funds: ఈ ఫండ్స్ లో సిప్ చేస్తే లాభాల పంటే.. మూడేళ్ల లోనే ఊహించని విధంగా ఆదాయం
Mutual Fund
Madhu
|

Updated on: May 24, 2024 | 12:45 PM

Share

మ్యూచువల్ ఫండ్స్ అనే మాట ప్రస్తుతం చాలా ఎక్కువగా వినిపిస్తోంది. వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో బ్యాంకులలో ఫిక్స్ డ్ డిపాజిట్లకు ఎక్కువ డిమాండ్ ఉండేది. కానీ నేడు వాటితో పాటు రాబడికి ఎక్కువగా అందించే మ్యూచువల్ ఫండ్స్ కు డిమాండ్ పెరిగింది. వీటిలో ఏది మంచిది? దేనిలో పెట్టుబడి పెడితే డబ్బు సురక్షితంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) అంటారు. దీనిలో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీనిని టాక్స్ సేవర్ ఫండ్స్ అని కూడా అంటారు. వీటిలో సిప్ (sip), లంప్ సంప్ విధానంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ లో మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఇందులో మీరు ఒకేసారి లేదా సిప్ ద్వారా డబ్బును డిపాజిట్ చేయవచ్చు. మూడేళ్ల తర్వాత మీ పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు లేదా కొనసాగించవచ్చు. రూ. 500తో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు.

సిప్ (sip) అంటే..

సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే ఓ పద్ధతి. పెట్టుబడి దారులు ముందుగా నిర్ణయించిన కాల వ్యవధిలో స్థిరమైన మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు. మూడేళ్లుగా టాప్ లో కొనసాగుతున్న ప్రముఖ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ వివరాలు. అవి సిప్ ద్వారా పెట్టుబడి దారులకు అందించిన లాభాల వివరాలను తెలుసుకుందాం.

ఎస్ బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ (డైరెక్ట్ ప్లాన్)..

ఎస్ బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన ఈ ఫండ్ మూడేళ్ల కాలంలో 35.06 శాతం రాబడితో అగ్రస్థానంలో ఉంది. ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం) రూ. 23,818.75 కోట్లు, దాని నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ) పరిమాణం రూ. 422.7788. జీఈ టీఅండ్ డీ ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, టోరెంట్ పవర్, ఐసీఐసీఐ బ్యాంక్ దీని ప్రధాన స్టాక్‌లు. ఈ ఫండ్‌ మూడేళ్లలో రూ. 10వేల సిప్ లకు రూ. 6,41,123, రూ. 15 వేలకు రూ. 9,61,685. రూ.20 వేలకు రూ.12,82,246 అందజేసింది.

ఇవి కూడా చదవండి

మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ( డైరెక్ట్ ప్లాన్)..

మోతీలాల్ ఓస్వాల్ నుంచి వచ్చిన ఈఎల్ఎస్ ఎస్ ఫండ్ మూడేళ్లలో 34.14 శాతం సిప్ రాబడిని ఇచ్చింది. దీని ఏయూఎం విలువ రూ. 3.407.30 కోట్లు, ఎన్ఏవీ పరిమాణం రూ.50.6905. జొమాటో, ట్రెన్ట్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ దీని 30 స్టాక్ లలో ప్రధానమైనవి. ఫండ్‌ మూడేళ్లలో సిప్ లపై రూ. 6,30,926 (రూ.10 వేలకు), రూ. 9,46,389 (రూ.15 వేలకు), రూ. 12,61,852 (రూ. 20 వేలకు) చొప్పున అందించింది.

క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ( డైరెక్ట్ ప్లాన్)..

మూడేళ్లలో ఈ ఫండ్ సిప్ రాబడులు 33.21 శాతం ఉన్నాయి. అయితే ఐదేళ్ల సిప్ లకు సంబంధించి రూ.38.74 శాతం ఉంది. ఈ ఫండ్ ఏయూఎమ్ రూ. 9,446.12 కోట్లు, ఎన్ఏవీ పరిమాణం రూ. 415.7055. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అదానీ పవర్, జియో ఫైనాన్షియల్, హిందాల్కో తదితర ప్రధాన స్టాక్‌లుతో పాటు 39 స్టాక్‌లు ఉన్నాయి. సిప్ లకు సంబంధించి ఈ ఫండ్‌ రూ. 6,20,812 (రూ. 10 వేలకు), రూ. 9,31,217 (రూ.15 వేలకు), రూ. 12,41,623 (రూ.20 వేలకు) ఇచ్చింది.

ఐటీఐ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ( డైరెక్ట్ ప్లాన్)..

ఈ ఫండ్ మూడేళ్లలో 31.50 శాతం రాబడిని ఇచ్చింది. దీని ఏయూఎమ్ రూ. 330.19 కోట్లు, ఎన్ఏవీ విలువ రూ. 24.8453.దీనిలోని 55 స్టాక్‌ల పోర్ట్‌ఫోలియోలో ప్రధానంగా ఎస్ బీఐ, భారతీ ఎయిర్‌టెల్, జొమాటో, ట్రెంట్ ఉన్నాయి. సిప్ లపై ఈ ఫండ్‌ రూ. 6,02,708 (రూ.10 వేలకు ), రూ.9,04,062 (రూ. 15 వేలకు), 12,05,416 (రూ.20వేలకు) అందించింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ( డైరెక్ట్ ప్లాన్ )..

ఈ ఫండ్ గత మూడేళ్లలో 31.35 శాతం రాబడిని ఇచ్చింది. రూ. 1,304.19 కోట్ల ఏయూఎమ్, రూ. 184.0200 ఎన్ఏవీ విలువతో కొనసాగుతోంది. *ఎస్ బీఐ, కెనరా బాన్, వేదాంత, ఆయిల్ ఇండియా ప్రధాన స్టాక్‌లతో దాదాపు 66 స్టాక్‌లను కలిగి ఉంది. *ఈ ఫండ్‌ రూ. 10 వేల సిప్ కు రూ. 6,01,150, రూ.15 వేలకు రూ. 9,01,725, రూ.20 వేలకు రూ. 12,02,300 అందించింది.

జేఎమ్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ( డైరెక్ట్ ప్లాన్)..

ఈ ఫండ్ మూడేళ్ల కాలంలో 29.76 శాతం రాబడులను అందించింది. దీని ఏయూఎమ్ రూ.144.75 కోట్లు, ఫండ్ ఎన్ఏవీ పరిమాణం రూ. 50.3877. దీని పోర్ట్‌ఫోలియోలో 52 స్టాక్‌లు ఉన్నాయి. వాటిలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ & టూబ్రో, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రముఖమైనవి. ఫండ్‌ నుంచి రూ. 5,84,924 (రూ.10 వేల సిప్ కు), రూ. 8,77,386 (రూ.15 వేలకు), రూ. 11,69,848 (రూ.20 వేలకు) లభించాయి.

హెచ్ డీఎఫ్ సీ ఈఎల్ఎస్ఎష్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ( డైరెక్ట్ ప్లాన్)..

ఈ ఫండ్ మూడేళ్లలో 29.34 శాతం వార్షిక సిప్ రాబడిని ఇచ్చింది. దీని ఏయూఎమ్ విలువ రూ. 14,641.46 కోట్లు, అలాగే ఎన్ఏవీ పరిమాణం రూ. 1,306.3070. దీని 40 స్టాక్‌ల పోర్ట్‌ఫోలియోలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్రముఖమైనవి. ఫండ్‌ మూడేళ్లలో రూ.10వేల సిప్ కు రూ.5,80,725, రూ.15 వేలకు రూ.8,71,087, రూ.20 వేలకు రూ.11,61,449 ఇచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి