Stock Market: సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేది ఏ పార్టీ అయినా.. ఈ షేర్లు రారాజులే.. పెట్టుబడిదారులకు లాభాల పoటే..
నరేంద్ర మోదీ, అమిత్ షా తదితరులతో కూడిన ఎన్ డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులతో కూడిన ఇండియా కూటమి ఈసారి తమదే అధికారమని చెబుతోంది. ఎవరు అధికారంలోకి వచ్చేదీ తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకూ ఆగాల్సిందే. ఎన్నికల ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్ పై తప్పనిసరిగా ఉంటుంది. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల విధానాల ఆధారంగా కొన్నిషేర్ల ధరలు పెరగవచ్చు, మరికొన్ని పడిపోవచ్చు. అయితే ఎన్నికల ఫలితాలలో సంబంధం లేకుండా కొన్నిషేర్లు మనుగడ సాగిస్తాయి.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. వాటి ఆధారంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ముఖ్యంగా నరేంద్ర మోదీ, అమిత్ షా తదితరులతో కూడిన ఎన్ డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులతో కూడిన ఇండియా కూటమి ఈసారి తమదే అధికారమని చెబుతోంది. ఎవరు అధికారంలోకి వచ్చేదీ తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకూ ఆగాల్సిందే. ఎన్నికల ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్ పై తప్పనిసరిగా ఉంటుంది. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల విధానాల ఆధారంగా కొన్నిషేర్ల ధరలు పెరగవచ్చు, మరికొన్ని పడిపోవచ్చు. అయితే ఎన్నికల ఫలితాలలో సంబంధం లేకుండా కొన్నిషేర్లు మనుగడ సాగిస్తాయి. వాటిలో పెట్టుబడి పెట్టడం సురక్షితంగా ఉంటుంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ కింది తెలిపిన దాదాపు 30 షేర్లు ఏ ప్రభుత్వం వచ్చినా మనుగడ కొనసాగిస్తాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం.
లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గెలిస్తే..
ఎన్నికల్లో నరేంద్ర మోదీ గెలిచి, ఎన్ డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుత విధానమే కొనసాగుతుంది. స్టాక్ మార్కెట్ యథాతథంగా కొనసాగుతుంది. ఇన్‌ఫ్రా, రక్షణ, సీజీ,న్యూ ఎనర్జీ, టూరిజం మొదలైనవి బాగానే కొనసాగుతాయి.
ఇండియా కూటమి విజయం సాధిస్తే..
జూన్ 4న వెలువడే ఫలితాలలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మార్కెట్లలోని రక్షణ, మూలధన వస్తువులు, పర్యాటకం, పీఎస్యూ వంటి నిర్దిష్ట రంగాలలో డీ రేటింగ్‌కు దారి తీస్తుంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ వంటి రంగాలు ఆశించిన ప్రయోజనం పొందుతాయి. 2004లో యూపీఏ విజయం సాధించడంతో సెన్సెక్స్ ఒక్క రోజులో 15 శాతం క్షీణతకు దారితీసింది. రెండు వారాల పాటు మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి.
ఈ షేర్లు ఎంతో సురక్షితం
లోక్ సభ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా కొన్ని షేర్లు మనుగడ సాగిస్తాయి. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీటికి ఇబ్బంది కలగదు. వీటిలో పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. ప్రభుదాస్ లిల్లాధర్ అభిప్రాయం ప్రకారం ఈ షేర్లలో పెట్టుబడి పెట్టడం చాలా మంచింది.
ఎఫ్ఎంసీజీ
హెచ్ యూఎల్, డాబర్, ఇమామి, మారికో, జీసీపీఎల్, బ్రిటానియా, వరుణ్ బెవరేజెస్ షేర్లు బాగుంటాయి.
ఆటో
ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, ఎంట్రీ లెవల్ కార్లు లాభపడతాయి. వీటిలో హీరో మోటోకార్ప్, మారుతి, ఎంఅండ్ఎం ముఖ్యమైనవి.
హెల్త్‌కేర్
సన్ ఫార్మా, సిప్లా, మ్యాక్స్ హెల్త్, జూపిటర్ తదితర స్టాక్‌లతో సంపూర్ణ రక్షణ లభిస్తుంది.
ఐటీ
ఐటీ రంగానికి సంబంధించి టీసీఎస్, ఎల్టీఐ మైండ్ ట్రీ, హెచ్ సీఎల్ టెక్, సైయంట్, టాటా టెక్ ఉత్తమమైనవి.
ప్రైవేట్ బ్యాంకులు
హెచ్ డీఎఫ్ సీ, కోటక్ మహీంద్రా, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు బాగుంటాయి.
క్యాపిటల్ గూడ్స్
ఈపీసీ, డిఫెన్స్, న్యూ ఎనర్జీలోని అనేక విభాగాలు ప్రమాదంలో ఉన్నప్పటికీ, సీమెన్స్, ఏబీబీ, హనీవెల్, ఎలన్టాస్ బెక్, జీఈ టీఅండ్ డీ, హితాచీ ఎనర్జీ, టిమ్కెన్ తదితర గ్లోబల్ టెక్నాలజీ లీడర్లకు మంచి అవకాశం ఉంటుంది.
పరిశీలన అవసరం..
పైన తెలిపిన విషయాలన్నీ వ్యక్తిగత విశ్లేషకులు, బ్రోకింగ్ కంపెనీల నిపుణుల అభిప్రాయాలు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు పరిశీలన చేయాలి. అన్ని విషయాలు బాగా ఆలోచించుకుని పెట్టుబడి పెట్టాలి.








