AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF balance check: పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా కూడా తెలుసుకోవచ్చా? ఇంట్లో నుంచే సెకండ్లలో తెలిసిపోతుంది..

పీఎఫ్ చందాదారులందరూ ప్రతినెలా తమ జీతం నుంచి చందా చెల్లిస్తారు. ఇది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. కానీ చాలామందికి తమ ఖాతాలో సొమ్ము ఎంత ఉందో తెలియదు. దానిని తెలుసుకోవాలని అనుకున్నా ఏం చేయాలో తెలియదు. కానీ పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడం చాలా సులభం. ఎస్ఎమ్ఎస్, మిస్ట్ కాల్, యూఎన్ ఏ నంబర్ ను ఉపయోగించి చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

PF balance check: పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా కూడా తెలుసుకోవచ్చా? ఇంట్లో నుంచే సెకండ్లలో తెలిసిపోతుంది..
Epfo
Madhu
|

Updated on: May 24, 2024 | 1:15 PM

Share

వివిధ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు పీఎఫ్ ఖాతాలుంటాయి. వీరి జీతంలోని ప్రతి నెలా కొంత మొత్తం తీసి, దానిలో జమచేస్తారు. యజమాన్యాలు కూడా తమ వాటాను కార్మికుల పేరు మీద కడతాయి. ఆ ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఆ డబ్బంతా ఏక మొత్తంలో అందజేస్తారు. దాని ద్వారా ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ఆసరా కలుగుతుంది. పీఎఫ్ చందాదారులందరూ ప్రతినెలా తమ జీతం నుంచి చందా చెల్లిస్తారు. ఇది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. కానీ చాలామందికి తమ ఖాతాలో సొమ్ము ఎంత ఉందో తెలియదు. దానిని తెలుసుకోవాలని అనుకున్నా ఏం చేయాలో తెలియదు. కానీ పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడం చాలా సులభం. ఎస్ఎమ్ఎస్, మిస్ట్ కాల్, యూఎన్ ఏ నంబర్ ను ఉపయోగించి చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

ఎస్ఎమ్ఎస్ ద్వారా..

  • ఎస్ఎమ్ఎస్ ద్వారా తమ ఖాతాలోని పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు.
  • ముందుగా మీ ఫోన్ లో మెసేజ్ లను తెరవండి
  • EPFOHO అని టైప్ చేసి మీ యూఏఎన్ నంబర్, మీ భాష ప్రాధాన్యతలోని మొదటి మూడు అక్షరాలను టైప్ చేయండి.
  • దాహరణకు మీరు ఇంగ్లీష్ కోసం ENG అని టైప్ చేయాలి.
  • అనంతరం 773829 9899కు మెసేజ్ పంపండి.
  • వెంటనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలియజేస్తూ రిటర్న్ మెసేజ్ వస్తుంది.
  • మీ యూఏఎన్ నంబర్ కు రిజిస్టర్డ్ అయిన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే పంపే అవకాశం ఉంటుంది.
  • వేరే నంబర్ నుంచి పంపితే మీకు వివరాలు రావు.

మిస్డ్ కాల్ తో..

కేవలం మీ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ చేసి పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే అవకాశం. ఇది చాలా సులభం. మీ యూఏఎన్ నంబర్ కు లింక్ అయిన ఫోన్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వండి. వెంటనే మీకు బ్యాలెన్స్ తెలియజేస్తూ మెసేజ్ వస్తుంది.

యూఏఎన్ అంటే..

ఈపీఎఫ్ చందాాదారులైన ప్రతి ఉద్యోగికీ 12 అంకెల నంబర్ ను కేటాయిస్తారు. దానిని యూనివర్సల్ అక్కౌంట్ నంబర్ (యూఏఎన్) అంటారు. దీనికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గుర్తింపు ఉంటుంది. ఉద్యోగి ఎన్ని సంస్థలకు మారినా ఈ నంబర్ పర్మినెంట్ గా ఉంటుంది. పీఎఫ్ చందాదారులకు యూఏఎన్ అనేది చాలా కీలకం. పీఎఫ్ కు సంబంధించిన ప్రతి పనికీ ఆ నంబర్ అవసరమవుతుంది. మీరు బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవాలన్నా ఆ నంబర్ ఉంటేనే సాధ్యమవుతుంది. అయితే కొందరికి ఆ నంబర్ తెలియకపోవచ్చు, మరికొందరు మరిచిపోయి ఉంటారు. అయినా ఎటువంటి ఆందోళన వద్దు. చాలా సులభంగా మన యూఏఎన్ ను తెలుసుకునే వీలుంది.

ఇవి కూడా చదవండి
  • ముందుగా unifiedportal-mem.epfindia.gov.inని సందర్శించాలి
  • ప్రధాన పేజీలో ‘మీ యూఏఎన్ తెలుసుకోండి’ అనే ఎంపికపై క్లిక్ చేయండి.
  • మీ ఈపీఎఫ్ ఖాతా నంబర్, సభ్యుల ఐడీ వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి.
  • మీకు ఒక పిన్ నంబరు వస్తుంది. దానిని నమోదు చేయండి.
  • వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు యూఏఎన్ ను పంపిస్తారు.
  • ఒకవేళ మీ యూఏఎన్ యాక్టివేట్ కాకపోతే, మీరు యాక్టివ్ యువర్ యూఏఎన్ అనే దానిపై క్లిక్ చేయాలి.
  • అక్కడ తెలిపిన ప్రకారం వివరాలు నమోదు చేయాలి.