AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EMI Rates: ఆ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న వారికి షాక్! మరింత భారం కానున్న ఈఎంఐ.. పూర్తి వివరాలు..

దేశంలోని ప్రముఖ బ్యాంకులు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా, యూకో బ్యాక్, కెనరా బ్యాంక్ వంటివి ఇప్పటికే తమ బ్యాంకుల్లో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఆగస్టు 12 నుంచి ఈ సవరించిన రేట్లు అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో రుణ గ్రహీతలపై భారం ఎలా ఉంటుంది? ఏ బ్యాంకు ఎంత మేర ఎంసీఎల్ఆర్‌ను పెంచింది? తెలుసుకుందాం..

EMI Rates: ఆ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న వారికి షాక్! మరింత భారం కానున్న ఈఎంఐ.. పూర్తి వివరాలు..
Mclr Rates Hikes
Madhu
|

Updated on: Aug 14, 2024 | 1:22 PM

Share

మన దేశంలో వివిధ రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. బ్యాంకులు ఈ మేరకు తమ రేట్లను సవరించాయి. దేశంలోని ప్రముఖ బ్యాంకులు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా, యూకో బ్యాక్, కెనరా బ్యాంక్ వంటివి ఇప్పటికే తమ బ్యాంకుల్లో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఆగస్టు 12 నుంచి ఈ సవరించిన రేట్లు అమలులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ఎంసీఎల్ఆర్ ను పెంచాయి. ఈ క్రమంలో రుణ గ్రహీతలపై భారం ఎలా ఉంటుంది? ఏ బ్యాంకు ఎంత మేర ఎంసీఎల్ఆర్‌ను పెంచింది? తెలుసుకుందాం రండి..

కారణం ఇదే..

ఆగస్టు 8న జరిగిన సమావేశంలో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో రెపో రేటును 6.50 శాతం వద్ద కొనసాగించింది. దానిలో ఎటువంటి మార్పు చేయలేదు. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) , కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్లు ఎంసీఎల్ఆర్ ను పెంచుతున్నట్లు గత శుక్రవారం ప్రకటించాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఆగస్టు 12 నుంచి అమలులోకి వచ్చేటటువంటి నిర్దిష్ట అవధులపై 5 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్ పెంచాలని బీఓబీ నిర్ణయించింది. ఈ పెరుగుదల తర్వాత ఎంసీఎల్ఆర్ రేటు ఆరునెలలకు 8.75 శాతం, ఒక సంవత్సరానికి 8.95 శాతం ఉంటుంది.

కెనరా బ్యాంక్.. ఈ బ్యాంక్ కూడా తన ఎంసీఎల్ఆర్ ను ఆగస్టు 12 నుంచి 5 బేసిస్ పాయింట్లు పెంచాలని నిర్ణయించింది. ఈ పెరుగుదల తరువాత.. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.80, ఒక సంవత్సరానికి 9 శాతం అవుతుంది.

యూకో బ్యాంక్.. దీనిలో కొత్త రేట్లు ఆగస్టు 10 నుంచి అమలులోకి వచ్చాయి. నిర్దిష్ట కాలపరిమితిపై 5 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్ ను పెంచాలని బ్యాంక్ నిర్ణయించింది. సవరించిన ఆరు నెలల, ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ వరుసగా 8.80 శాతం, 8.95 శాతంగా ఉంది.

ఫ్లోటింగ్ రేట్ ఉన్న వారికి..

ఇప్పటికే రుణాలు కలిగి ఉన్న వారిపై ఈ చర్య కారణంగా ఈఎంఐ భారం పెరగనుంది. అయితే ఫిక్స్ డ్ వడ్డీ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంటరెస్ట్ పై లోన్ తీసుకున్న వారిపై ఈ భారం పడనుంది.

ఈ బ్యాంకులు ఇప్పటికే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలోనే ఎంసీఎల్ఆర్ రేటును 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనిలో ప్రస్తుతం ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం, ఏడాదికి 8.85 శాతం వద్ద ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా తన ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రస్తుతం ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం, ఏడాదికి 8.90 శాతంగా ఉంది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ ని ఆగస్టు 1 నుంచి 5 బేసిస్ పాయింట్లు పెంచి 8.95 శాతానికి పెంచింది. ఇండియన్ బ్యాంక్ తన ఓవర్‌నైట్ తో పాటు ఒక నెల ఎంసీఎల్ఆర్ ని ఒక్కొక్కటి 5 బేసిస్ పాయింట్లు పెంచి వరుసగా 8.20 శాతం, 8.45 శాతానికి పెంచింది. ఇవి ఆగస్ట్ 3 నుంచి అమలులోకి వచ్చాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..