Akshaya Tritiya: భలే మంచిరోజు.. అక్షయ తృతీయలో వీటిని కొంటే విజయమే..  కానీ అవి కొంటే మాత్రం అనర్థమే!

అక్షయ తృతీయ హిందూ, జైన వర్గాలకు పవిత్రమైన రోజు. ఆ రోజున బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల అదృష్టం కలుగుతుందని నమ్ముతారు. దేశంలోని పశ్చిమ ప్రాంతాలలో అఖా తీజ్, ఛత్తీస్‌గఢ్‌లోని అక్తి వంటి వివిధ పేర్లతో జరుపుకుంటారు. వివాహం, గృహ ప్రవేశం, కొత్త వ్యాపారం, పెట్టుబడి పెట్టడానికి మంచిరోజు అని నమ్ముతారు.

Akshaya Tritiya: భలే మంచిరోజు.. అక్షయ తృతీయలో వీటిని కొంటే విజయమే..  కానీ అవి కొంటే మాత్రం అనర్థమే!
Akshaya Tritiya
Follow us

|

Updated on: May 07, 2024 | 3:25 PM

సమాజంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. కొంతమంది అన్ని రోజులు మంచి రోజులే అంటారు. మరికొందరూ ఏ పని చేయాలన్నా మంచి రోజు చూసుకుంటారు. ఆ రోజున పని ప్రారంభిస్తే అందరికీ మంచి జరుగుతుందని, పని ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుందని నమ్ముతారు. అందుకోసం కొన్ని ప్రత్యేకమైన రోజులను ఎంచుకుంటారు. దానికి అనుగుణంగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. అయితే వాటితో పాటు మరికొన్ని పనులను చేయడానికి అక్షయ తృతీయ ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.

కొనుగోలుకు మంచి రోజు..

అక్షయ తృతీయ హిందూ, జైన వర్గాలకు పవిత్రమైన రోజు. ఆ రోజున బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల అదృష్టం కలుగుతుందని నమ్ముతారు. దేశంలోని పశ్చిమ ప్రాంతాలలో అఖా తీజ్, ఛత్తీస్‌గఢ్‌లోని అక్తి వంటి వివిధ పేర్లతో జరుపుకుంటారు. వివాహం, గృహ ప్రవేశం, కొత్త వ్యాపారం, పెట్టుబడి పెట్టడానికి మంచిరోజు అని నమ్ముతారు. మే 10వ తేదీ శుక్రవారం అక్షయ తృతీయ నాడు బంగారం, వెండితో పాటు ఈ క్రింద తెలిపిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

బంగారు ఆభరణాలు.. అక్షయ తృతీయ రోజు బంగారు ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేయడం శ్రేయస్కరం. దీనివల్ల విజయం, అదృష్టం కలుగుతాయి. హిందూ పురాణాల ప్రకారం సంపదకు దేవత అయిన లక్ష్మి ఈ రోజునే జన్మించింది. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే ఆమె ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. అక్షయ తృతీయ రోజు ఆభరణాల డీలర్లు ప్రత్యేక తగ్గింపులు, ఆఫర్లు ప్రవేశపెడతారు.

వెండి వస్తువులు.. వెండి వంటి విలువైన లోహాలను కొనుగోలు చేయడం మంచింది. వెండి పాత్రలు, నాణేలు, ఆభరణాలపై పెట్టుబడి పెట్టడానికి శుభకరం. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు వెండి వస్తువులను బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇది శుభ సందర్భం.

ఆస్తి కొనుగోలు.. జ్యోతిషశాస్త్రం, వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి అక్షయ తృతీయ మంచిరోజు. ఇది యజమానికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆస్తి ఒప్పందాలను ఖరారు చేయడం, భూమి, ఇల్లు, ఇతర ఆస్తులను ఈ రోజు కొనుగోలు చేయవచ్చు.

వాహనాలు.. కారు, బైక్ వంటి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి రోజు. ఆటోమొబైల్ కంపెనీలు ఆకర్షణీయమైన డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. అక్షయ తృతీయ నాడు అనేక నగరాల్లో కొత్త కార్ల రిజిస్ట్రేషన్లు బాగా పెరుగుతాయి. ఈ రోజు వాహనం కొనుగోలు చేయడం వల్ల రక్షణ, విజయం లభిస్తాయని ప్రజల విశ్వాసం.

ఫర్నిచర్.. అక్షయ తృతీయ రోజు ఇంట్లోకి కొత్త వస్తువులు తీసుకురావడం వల్ల శుభం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. ముఖ్యంగా కొత్త ఫర్నిచర్‌ కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారు.

దుస్తులు.. సంప్రదాయం ప్రకారం ప్రజలు అక్షయ తృతీయ నాడు కొత్త దుస్తులు ధరించి, పూజలు చేస్తారు. కాబట్టి కొత్త బట్టలను కొనడం కూడా శుభప్రదంగా భావిస్తారు. సంప్రదాయ దుస్తులతో పాటు ఫ్యాషన్ గార్మెంట్స్ అమ్మకాలు కూడా బాగా జరుగుతాయి.

పుస్తకాలు.. మనకు జ్ఞానాన్నిచ్చే సాధనాలు పుస్తకాలు. జ్ఞానానికి, చదువుకు దేవత సరస్వతీమాత. అక్షయ తృతీయ రోజు పుస్తకాలను కొనుగోలు చేయడం చాలా మంచింది. అలా చేస్తే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా జీవితంలో విజయం లభిస్తుందని నమ్మకం.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, టెలివిజన్ తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయవచ్చు. దానివల్ల అదృష్టం, శ్రేయస్సు కలుగుతుంది.

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి అక్షయ తృతీయ ఉత్తమ సమయం. చాలా మంది షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ రోజే పెట్టుబడి పెడతారు. ఇలా చేస్తే దీర్ఘకాలంలో సానుకూల రాబడిని ఇస్తాయని భావిస్తారు.

వ్యవసాయ పరికరాలు.. ట్రాక్టర్లు తదితర వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయడానికి అక్షయ తృతీయ మంచి సమయం. రైతులు ఈ రోజున కొత్త పరికరాలను కొనుగోలు చేస్తారు. పంట బాగా పండుతుందని, మంచి దిగుబడులు వస్తాయని నమ్ముతారు.

ఈ వస్తువులను కొనకూడదు..

అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల దురదృష్టం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఈ రోజు అల్యూమినియం, స్టీల్, ప్లాస్టిక్ పాత్రలను కొనుగోలు చేయకూడదు. అలాగే ఆ రోజు డబ్బు ఎవ్వరికీ ఇవ్వకూడదు. అది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని, ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ముఖ్యంగా లాటరీ, జూదం వంటి వాటిని దూరంగా ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..