AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coal: 2040 నాటికి భారీగా పెరగనున్న బొగ్గు డిమాండ్.. ప్రత్యామ్నాయ విద్యుత్‌పై దృష్టి సారిస్తున్న ప్రభుత్వం..

విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గుపై దేశం ఆధారపడటం పెరుగుతోంది. దేశంలోని ఇంధన డిమాండ్‌ను తీర్చేందుకు వచ్చే 18 ఏళ్లలో 150 మిలియన్‌ టన్నుల థర్మల్‌ బొగ్గు అవసరమని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి శనివారం తెలిపారు...

Coal: 2040 నాటికి భారీగా పెరగనున్న బొగ్గు డిమాండ్.. ప్రత్యామ్నాయ విద్యుత్‌పై దృష్టి సారిస్తున్న ప్రభుత్వం..
Coal Crisis
Srinivas Chekkilla
|

Updated on: Jun 05, 2022 | 8:53 AM

Share

విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గుపై దేశం ఆధారపడటం పెరుగుతోంది. దేశంలోని ఇంధన డిమాండ్‌ను తీర్చేందుకు వచ్చే 18 ఏళ్లలో 150 మిలియన్‌ టన్నుల థర్మల్‌ బొగ్గు అవసరమని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి శనివారం తెలిపారు. అంచనాల ప్రకారం, 2040 నాటికి విద్యుత్ డిమాండ్ కూడా రెట్టింపు అవుతుంది. పర్యావరణంపై అవగాహన కల్పించాలని, మైనింగ్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోవాలని బొగ్గు శాఖ మంత్రి అన్నారు. ఇంధన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ప్రస్తుతం పునరుత్పాదక ఇంధనంపై తన ప్రాధాన్యతను పెంచుతోంది. ప్రభుత్వ విధానాలలో సౌరశక్తి, జలవిద్యుత్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. అయితే, పెరుగుతున్న ఆర్థిక వేగంతో, దేశంలో విద్యుత్ డిమాండ్ కూడా చాలా వేగంగా పెరుగుతోంది. దీని ప్రభావం బొగ్గు వినియోగంపై కనిపిస్తోంది.

2040 నాటికి దేశంలో దాదాపు 3000 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, అప్పటికి భారతదేశ ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ డిమాండ్‌ను తీర్చడానికి, 2040 నాటికి థర్మల్ బొగ్గు డిమాండ్ 150 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధితో బొగ్గు, లిగ్నైట్‌పై ఆధారపడటాన్ని సమతుల్యం చేయడానికి మెరుగైన ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, గ్రీన్ ఎనర్జీ విస్తరణ క్రమంగా జరుగుతుందని ఆయన అన్నారు.

గతేడాది అక్టోబర్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో బొగ్గు కొరత ఏర్పడడంతో పలు విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే దేశంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో చాలా పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత ఏర్పడింది. ఇప్పుడు బొగ్గు సరఫరాను సరిచేయడానికి ప్రభుత్వం 12 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం కోల్ ఇండియాకు సూచనలు కూడా ఇచ్చారని, ఇదే జరిగితే 2015 తర్వాత తొలిసారిగా కోల్ ఇండియా బయటి నుంచి బొగ్గును కొనుగోలు చేయనుంది.