Ola electric: కొంపముంచిన ఓలా ఎలక్ట్రిక్.. ఆ నిర్ణయంతో అందరికీ షాక్..!

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ లో ఓలా సంస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కంపెనీ విడుదల చేసిన ఈవీల విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. స్లైలిష్ లుక్, బెస్ట్ ఫీచర్లు, అనేక ప్రత్యేకతలలో ఓలా వాహనాలు మార్కెట్ లో అడుగుపెట్టాయి. వాటికి ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. దీంతో ఆ మార్కెట్ లో దాదాపు 20 శాతం స్థానాన్ని ఓలా ఆక్రమించింది.

Ola electric: కొంపముంచిన ఓలా ఎలక్ట్రిక్.. ఆ నిర్ణయంతో అందరికీ షాక్..!
Ola
Follow us
Srinu

|

Updated on: Nov 23, 2024 | 3:36 PM

ఎంత వేగంగా ఎదిగిందో అంతే స్థాయిలో ఓలా విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా ఈ కంపెనీ ఈవీ బైక్ లు సర్వీస్ విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వాటి పనితీరు బాాగాలేదంటూ కస్టమర్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంపెనీ షేర్లు కూడా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఓలా తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 500 మందికి తొలగించేందుకు నిర్ణయ తీసుకుంది. భవిష్ అగర్వాల్ యాజమాన్యంలో నడుస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే సర్వీస్ విషయంలో భారీ ఎత్తున విమర్శలు వస్తున్న సమయంలో కొత్తగా తన ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయంతో మరో షాక్ ఇచ్చింది. కంపెనీ తన పునర్ వ్యవస్టీకరణలో భాగంగా వివిధ విభాగాల్లో వేర్వేరు స్థాయిలో ఉన్న ఉద్యోగులకు లేఅఫ్ ప్రకటించనుంది.

ఓలా కంపెనీలో ఉద్యోగుల తొలగింపు జూలై నుంచే కొనసాగుతోందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తికానుంది. అనంతరం ఉన్న ఉద్యోగులను ఉపయోగించుకుని తద్వారా మార్జిన్లు, లాభాలను పెంచుకోవాలని కంపెనీ భావిస్తోందని సమాచారం. ఈ కంపెనీ ఈ ఏడాది మార్చి నాటికి 4011 మంది ఆన్ రోల్ ఉద్యోగులను కలిగి ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో జరుగుతున్న మార్పులు కొత్తమే కాదు. గతంలో ఇలా ఉద్యోగులు తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మారుతున్న వ్యాపార వ్యూహాలకు అనుగుణంగా గతంలోనూ ఇదే తరహా లేఆప్ ప్రక్రియను ప్రారంభించింది. తన ఎలక్ట్రిక్ వ్యాపారం కోసం కార్లు, క్లౌడ్ కిచెన్, కిరాణా డెలివరీ అనే మూడు వ్యాపారాలను మూసివేసింది. దీనివల్ల దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

ఓలా కంపెనీని ప్రస్తుతం అనేక వివాదాలు చుట్టుముట్టాయి. సంస్థ కార్యకలాపాలు, సేవల విషయంలో వినియోగదారుల నుంచి పలు ఫిర్యాదులు వస్తున్నాయి. వినియోగదారుల హక్కుల ఉల్లంఘణ, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ విషయంలో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై కంపెనీ స్పందించి దాదాపు 99 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్టు వివరణ ఇచ్చింది. అలాగే ఓలా వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్, కమెడియల్ కునాల్ కమ్రా మధ్య సోషల్ మీడియాలో వివాదం కూడా జరిగింది. అయితే ఎన్ఎస్ఈలో ఓలా ఎలక్ట్రిక్ షేరు విలువ స్వల్పంగా లాభపడి రూ.68 వద్ద కొనసాగుతోంది. ఇదే ఈ కంపెనీకి కొంచెం ఊరట నిచ్చే అంశం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి