AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Filing: ముంచుకొస్తున్న గడువు.. ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనా..?

భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం అనేది చాలా కీలకం. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి జూలై 31తో గడువు ముగుస్తుంది. అయితే ఈ గడువు లోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే  జరిమానాలతో పాటు వడ్డీ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ జరిమానాలు ఫైలింగ్ ఎంత ఆలస్యమైందనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ITR Filing: ముంచుకొస్తున్న గడువు.. ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనా..?
Itr Filing
Nikhil
|

Updated on: Jul 17, 2024 | 4:16 PM

Share

భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం అనేది చాలా కీలకం. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి జూలై 31తో గడువు ముగుస్తుంది. అయితే ఈ గడువు లోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే  జరిమానాలతో పాటు వడ్డీ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ జరిమానాలు ఫైలింగ్ ఎంత ఆలస్యమైందనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మనం చెల్లించే పన్ను బట్టి ఈ ఫీజు మారుతూ ఉంటుంది. ఐటీ రిటర్న్స్ సకాలంలో ఫైల్ చేయడం ద్వారా  అనవసరమైన ఆర్థిక భారాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పన్ను రీఫండ్‌కు అర్హత ఉంటే ఐటీఆర్‌ను తక్షణమే ఫైల్ చేయడం వల్ల మీరు మీ రీఫండ్‌ను త్వరగా పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయడం ఆలస్యం చేయడం వల్ల మీ రీఫండ్ ఆలస్యం అవుతుంది.అయితే ఐటీఆర్‌కు సంబంధించిన ఫైలింగ్ గడువు పొడిగిస్తారని చాల మంది అనుకుంటారు. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్‌కు సంబంధించి గడవు తేదీ పొడగించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే గడువు దాటాక ఆలస్య రుసుముతో మీ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2024-25) ఆలస్యంగా రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2024గా ఉంది. ఈ నేపథ్యంలో ఐటీఆర్‌ను ఆలస్యంగా ఫైల్ చేయడం వల్ల కలిగే నష్టాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఐటీఆర్ ఆలస్యంగా ఫైల్ చేయడం వల్ల కలిగే నష్టాలు

  • సెక్షన్ 139(1) ప్రకారం నిర్దేశించిన గడువు తేదీ తర్వాత రిటర్న్‌ను సమర్పిస్తే ఆదాయపు రిటర్న్‌ను అందించడంలో డిఫాల్ట్‌కు రుసుము రూ. 5,000 అవుతుంది. అయితే అసెస్సీ మొత్తం ఆదాయం రూ. 5 లక్షలు మించకుండా ఉంటే రుసుము రూ. 1,000గా ఉంటుంది.
  • ఐటీఆర్ ఆలస్యంగా ఫైల్ చేస్తే పన్నులపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అసలు గడువు తేదీ నుండి పూర్తి మొత్తం సెటిల్ అయ్యే వరకు ఈ వడ్డీ వస్తుంది.
  • సెక్షన్ 276 సీసీ ప్రకారం చెల్లించాల్సిన పన్ను మొత్తం లేదా ఎగవేత మొత్తం రూ. 25,000 దాటితే ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేసినందుకు జరిమానాతో పాటు 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది.
  • మినహాయించిన అదనపు పన్నులకు వాపసును క్లెయిమ్ చేయడానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం ఒక్కటే మార్గం. అదనంగా గడువు ముగిసిన పన్నులపై వడ్డీ విధిస్తే పన్ను చెల్లింపుదారులు నిర్ణీత షెడ్యూల్‌లోపు తమ రిటర్న్‌లను ఫైల్ చేస్తే వాపసులపై వడ్డీని స్వీకరించడానికి అర్హత ఉంటుంది. 
  • ఐటీఆర్ ఆలస్యంగా లేదా దాఖలు చేయనందుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయవచ్చు లేదా స్క్రూటినీ ప్రొసీడింగ్‌లను ప్రారంభించే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..