AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Car Care: వర్షంలో ఈవీ కారును చార్జ్ చేయవచ్చా..? నిపుణులు చెప్పే షాకింగ్ విషయాలు ఏంటంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఈవీ కార్లతో పోల్చుకుంటే ఈవీ బైక్స్, స్కూటర్లు ఎక్కువ మంది ప్రజలు వినియోగిస్తున్నారు. అయితే పెరిగిన టెక్నాలజీతో ఇటీవల కాలంలో పెట్రో కార్లతో పోటీగా ఈవీ కార్లు మైలేజ్ ఇవ్వడంతో ఆ కార్ల అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ అమ్మకాలు పెరిగినా సగటు ఈవీ కార్ల వినియోగదారులను కొన్ని అనుమానాలు వేధిస్తున్నాయి. అందులో మొదటిది బ్యాటరీ చార్జింగ్. బ్యాటరీ అనేది ఈవీ కారు నడవడానికి ముఖ్యమైన పార్ట్. అయితే ఆ బ్యాటరీను వర్షం పడుతున్న సమయంలో చార్జ్ చేయవచ్చా..? అని ఇటీవల కాలంలో చాలా ఈవీ కార్ల యూజర్లు గూగుల్ రివ్యూలను చదువుతూ ఉన్నారు.

EV Car Care: వర్షంలో ఈవీ కారును చార్జ్ చేయవచ్చా..? నిపుణులు చెప్పే షాకింగ్ విషయాలు ఏంటంటే..?
Ev Car Charging
Nikhil
|

Updated on: Jul 16, 2024 | 10:27 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఈవీ కార్లతో పోల్చుకుంటే ఈవీ బైక్స్, స్కూటర్లు ఎక్కువ మంది ప్రజలు వినియోగిస్తున్నారు. అయితే పెరిగిన టెక్నాలజీతో ఇటీవల కాలంలో పెట్రో కార్లతో పోటీగా ఈవీ కార్లు మైలేజ్ ఇవ్వడంతో ఆ కార్ల అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ అమ్మకాలు పెరిగినా సగటు ఈవీ కార్ల వినియోగదారులను కొన్ని అనుమానాలు వేధిస్తున్నాయి. అందులో మొదటిది బ్యాటరీ చార్జింగ్. బ్యాటరీ అనేది ఈవీ కారు నడవడానికి ముఖ్యమైన పార్ట్. అయితే ఆ బ్యాటరీను వర్షం పడుతున్న సమయంలో చార్జ్ చేయవచ్చా..? అని ఇటీవల కాలంలో చాలా ఈవీ కార్ల యూజర్లు గూగుల్ రివ్యూలను చదువుతూ ఉన్నారు. ముఖ్యంగా లాంగ్ రైడ్‌కు వెళ్లిన సమయంలో అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుపోతే ఆ సమయంలో వర్షం పడితే ఈవీ కారు చార్జింగ్ అనేది పెద్ద ప్రహసనంగా మారుతుంది. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ఈవీ కారు నిర్వహణ అంటే ముఖ్యంగా బ్యాటరీ నిర్వహణ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

కొంతకాలం క్రితం వరకు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే వాడేవారు. కానీ ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ కూడా చాలా తక్కువ సమయంలో వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయడం కష్టం. వర్షాకాలంలో వాటిని ఛార్జ్ చేయడం మరింత కష్టం అవుతుంది. కానీ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ కారును సులభంగా ఛార్జ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా కంపెనీ తన ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు అనేక దశల్లో టెస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత మాత్రమే కారు మార్కెట్లోకి విడుదల చేస్తారు. వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జర్లు, కనెక్టర్లను అన్ని రకాల వాతావరణంలో పని చేసేలా తయారు చేస్తారు. దీనితో పాటు, వాటి నాణ్యత కూడా మెరుగ్గా ఉంచుతారు. ఈవీ ఛార్జర్‌లు, కనెక్టర్‌లు పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌గా ఉంటాయి, దీనితో పాటు, వాటిని దుమ్ము, మట్టి లేదా ఇతర రకాల కణాల నుండి రక్షించడానికి ప్రత్యేక సాంకేతికత ఉపయోగిస్తారు. 

ఎలక్ట్రిక్ కార్లలో, ఛార్జర్ వాటర్ ప్రూఫ్‌తో పాటు, ఆన్-బోర్డ్ సెన్సార్ల ద్వారా భద్రత కూడా రెట్టింపు అవుతుంది. కొన్ని కారణాల వల్ల ఛార్జర్‌లో సమస్య ఉన్నప్పటికీ అది పరిష్కరించకపోతే  కారులో అమర్చిన ఆన్-బోర్డ్ సెన్సార్లు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తాయి. అయితే మీరు మీ కారును ఛార్జ్ చేయాలనుకుంటే డ్రైవింగ్ చేసిన వెంటనే కారును ఛార్జింగ్‌లో ఉంచవద్దని గుర్తుంచుకోండి. ఎందుకంటే డ్రైవింగ్ చేయడం వల్ల బ్యాటరీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల దాని ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. అలాగే వర్షాకాలంలో, ఛార్జర్‌పై నేరుగా నీటి చుక్కలు పడని ప్రదేశంలో కారును పార్క్ చేసి ఛార్జ్ చేయడానికి ప్రయత్నించడం మేలు. కవర్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసిన తర్వాత కారును ఛార్జ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..