AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Scheme: పెట్టుబడిదారులకు ధమాకా ఆఫర్.. ఈ రెండు కొత్త పథకాలతో అద్భుత రాబడులు..

BoB Monsoon Dhamaka Deposit Scheme: ఏదైనా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? అది కూడా అధిక వడ్డీ రావాలని కోరుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) రెండు కొత్త డిపాజిట్ స్కీమ్ లను ప్రకటించింది. బీఓబీ మాన్‌సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్ పేరుతో ఈ కొత్త ఎఫ్‌డీ పథకాలను సోమవారం ప్రారంభించింది. ఈ పథకాల్లో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి.

FD Scheme: పెట్టుబడిదారులకు ధమాకా ఆఫర్.. ఈ రెండు కొత్త పథకాలతో అద్భుత రాబడులు..
Fd Deposit
Madhu
|

Updated on: Jul 16, 2024 | 4:24 PM

Share

ఏదైనా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? అది కూడా అధిక వడ్డీ రావాలని కోరుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) రెండు కొత్త డిపాజిట్ స్కీమ్ లను ప్రకటించింది. బీఓబీ మాన్‌సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్ పేరుతో ఈ కొత్త ఎఫ్‌డీ పథకాలను సోమవారం ప్రారంభించింది. ఈ పథకాల్లో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి. తక్కువ కాల వ్యవధికి మీ నగదును డిపాజిట్ చేసి మంచి వడ్డీ పొందాలనుకునే వారికి ఈ పథకాలు బెస్ట్ ఆప్షన్ గా ఉంటాయి. ఈ నేపథ్యంలో బీఓబీ మాన్‌సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్ ఏంటి? దానిలో వడ్డీ రేటు ఎంత? దీనిలో ఎంత మొత్తంలో డిపాజిట్ చేయొచ్చు. మనకు రిటర్న్ ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

బీఓబీ మాన్‌సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్..

బ్యాంక్ ఆఫ్ బరోడా రెండు డిపాజిట్ స్కీమ్ లను మాన్‌సూన్ ధమాకా డిపాజిట్ స్కీమ్ పేరుతో లాంచ్ చేసింది. అవి 333 రోజుల ఎఫ్డీ స్కీమ్, 399 రోజుల ఎఫ్‌డీ స్కీమ్. ఈ రెండు పథకాలలో సాధారణ డిపాజిటర్లకు వడ్డీ రేటు 7.15శాతం, 7.25శాతం ఉంటుంది. అదే సమయంలో సీనియర్ సిటిజెన్స్ కు అదనంగా మరో 50 బేసిస్ పాయింట్లు కలుస్తాయి. అంటే 333 రోజుల పథకానికి 7.65శఆతం, 399 రోజుల పథకానికి 7.75శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. అంతేకాక రూ. కోటి నుంచి రూ. 3కోట్ల వరకూ ఉండే నాన్ కాలబుల్ డిపాజిట్లపై 0.15శాతం అదనపు వడ్డీని వర్తింపుజేయనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఈ రెండు పథకాలలో రూ. కోట్ల లోపు నగదును మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లేదా బ్యాంక్ శాఖల వద్ద కూడా డిపాజిట్ చేసే వీలుంటుంది.

రాబడి ఎలా ఉంటుందంటే..

ఈ పథకాలలో వడ్డీ రేట్లు చూశాం. అయితే రాబడి ఏ మేరకు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఈ మాన్‌సూన్ ధమాకా డిపాజిట్ పథకాలలో ఒకటైన 333 రోజుల టెన్యూర్ పథకంలో రూ. లక్ష డిపాజిట్ చేశారనుకుందాం. సాధారణ పౌరుడికి 7.15శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీ సమయానికి వడ్డీ రూ. 6,613 అందుతుంది. అదే సీనియర్ సిటిజెన్ అయితే వడ్డీ రేటు 7.65శాతం వడ్డీ కాబట్టి మెచ్యూరిటీ సమయానికి రూ. 7,075 వరకూ వడ్డీ వస్తుంది. అదే సమయంలో రెండో పథకం అయిన 399 రోజుల డిపాజిట్ స్కీమ్ ఎంచుకుంటే.. రూ. లక్ష పెట్టుబడికి సాధారణ పౌరులకు 7.25శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీ సమయానికి రూ.7,936 వడ్డీ వస్తుంది. అదే సమయానికి సీనియర్ సిటిజెన్ అయితే 7.75శాతం వడ్డీతో మెచ్యూరిటీ తర్వాత కేవలం వడ్డీనే రూ. 8,481 అందుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..