Indian Economy: ఆర్థిక వృద్దిరేటులో తగ్గేదేలే.. దూసుకుపోతున్న భారత్.. ఐఎంఎఫ్ అంచనా ఇదే..
భారతదేశ ఆర్థిక వృద్దిరేటు ప్రపంచ ఆర్థిక వృద్దిరేటులో సగం వాటాను కలిగి ఉండే అవకాశం ఉందని వరల్డ్ ఎకానమిక్ అవుట్ లుక్ ప్రొజెక్షన్ తెలిపింది. 2024 సంవత్సరానికిగానూ ఇండియా, చైనా వృద్ది ప్రపంచ ఆర్థిక వృద్దిలో సగం వాటాను సాధించినట్లు వెల్లడించింది. అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థతో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
భారతదేశ ఆర్థిక వృద్దిరేటు ప్రపంచ ఆర్థిక వృద్దిరేటులో సగం వాటాను కలిగి ఉండే అవకాశం ఉందని వరల్డ్ ఎకానమిక్ అవుట్ లుక్ ప్రొజెక్షన్ తెలిపింది. 2024 సంవత్సరానికిగానూ ఇండియా, చైనా వృద్ది ప్రపంచ ఆర్థిక వృద్దిలో సగం వాటాను సాధించినట్లు వెల్లడించింది. అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థతో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నట్లు ప్రముఖ ఎకనామిస్ట్, తొలి ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ తెలిపారు. ప్రపంచ వృద్ది ఏప్రిల్ 2024లో వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ అంచనాలకు అనుగుణంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
2024 నాటికి 3.2 శాతం వృద్ది రేటు ఉండగా.. అదే 2025నాటికి 3.3 శాతంకు చేరుకుంటుందని ఈ నివేదికలో వెల్లడించింది. ఉత్పత్తి సేవలకు సంబంధించిన ద్రవ్యోల్భణంపై పురోగతి సాధిస్తుందని అంచాలు వేస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న వాణిజ్య అవసరాలు, కంపెనీల పాలసీ విధానంలో మార్పులు ఈ వృద్దిలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు గీతా గోపీనాథ్. ఈ కంపెనీ పాలసీలు పెరిగిన ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుందంటున్నారు. తద్వారా ఆర్థిక వృద్ది సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వివిధ దేశాలకు సంబంధించిన వృద్ది రేట్లను ఎక్స్ ఖాతాలో పొందుపరిచారు. వీటిని పరిశీలిస్తే గత ఏడాదికి, ప్రస్తుతానికి, రానున్న ఏడాదికి సంబంధించి మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది.
New WEO update: Growth in India & China will account for almost half of global growth in 2024. Growth in major advanced economies is more aligned: euro area growth picks up as the US shows signs of cooling after a strong year. Read here: https://t.co/LQe1ZD2sOR pic.twitter.com/IyjWgBFv68
— Gita Gopinath (@GitaGopinath) July 16, 2024
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..