Robot Tax: టెక్ కంపెనీలకు షాక్.. బడ్జెట్లో రోబో ట్యాక్స్! ఉద్యోగులకు భరోసా ఇచ్చేలా..

ఈ బడ్జెట్ లో రోబో ట్యాక్స్ విధించే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై కాస్త స్పష్టత వచ్చింది. ఈ బడ్జెట్లో రోబో ట్యాక్స్ విధించే అవకాశం లేదని తెలుస్తోంది. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా ఉద్యోగులు తగ్గిపోతున్నారు అనే అంశంపై మాత్రం కీలక నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. ఏఐ, డీప్ టెక్, మెషిన్ లెర్నింగ్ అనే మూడు అంశాలపై చర్యలు ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు.

Robot Tax: టెక్ కంపెనీలకు షాక్.. బడ్జెట్లో రోబో ట్యాక్స్! ఉద్యోగులకు భరోసా ఇచ్చేలా..
Robot Tax
Follow us

|

Updated on: Jul 17, 2024 | 4:27 PM

కేంద్ర బడ్జెట్ ఈనెల 23వ తేదీన పార్లమెంట్ ముందుకు రానుంది. ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ పై అనేక అంచనాలు ఉన్నాయి. వివిధ రాయితీలు, పన్ను తగ్గింపులు, సబ్సిడీల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వివిధ వర్గాల వారు తమకొచ్చే రాయితీల కోసం ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో అంశం తెరపైకి వచ్చింది. అది రోబో ట్యాక్స్ గురించి. ఈ బడ్జెట్ లో రోబో ట్యాక్స్ విధించే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై కాస్త స్పష్టత వచ్చింది. ఈ బడ్జెట్లో రోబో ట్యాక్స్ విధించే అవకాశం లేదని తెలుస్తోంది. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా ఉద్యోగులు తగ్గిపోతున్నారు అనే అంశంపై మాత్రం కీలక నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. ఏఐ, డీప్ టెక్, మెషిన్ లెర్నింగ్ అనే మూడు అంశాలపై చర్యలు ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు. ఆ అంశాల గురించి తెలుసుకుందాం..

ప్రతిపాదన ఇది..

స్వదేశీ జాగరణ్ మంచ్ అధిపతి అశ్వనీ మహాజన్ ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రోబో పన్ను ను సూచించారు. ఆయన మాట్లాడుతూ కొత్త సాంకేతికతలు చాలా అవసరం. అయితే ఏఐ కారణంగా దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి మార్గం కనుగొనాలన్నారు. దీనికి ప్రతిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ బడ్జెట్ లో రోబో ట్యాక్స్ ఉండబోదని చెబుతూనే.. ఏఐ సాంకేతికతను వినియోగించుకునే కంపెనీలు, కార్పొరేట్లపై పన్ను విధించినట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగాల తగ్గింపు, తక్కువ నియామకాలకు పరిహారం చెల్లించాలని సూచించేలా మాత్రం ఉండకపోవచ్చు. అలాగే రోబో ట్యాక్స్ వల్ల అనవసరంగా భయాందోళనలు కలిగే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం భావిస్తోంది.

మూడు సమస్యలు..

ఏఐ, డీప్ టెక్, మెషిన్ లెర్నింగ్ అనే మూడు సమస్యలకు బడ్జెట్లో పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. మెషిన్ లెర్నింగ్ అంటే ఏఐకి సంబంధించి ఒక శాఖ. మానవుల ఆలోచన, పని విధానాన్ని అనుకరించడానికి ఏఐకి సహాయ పడుతుంది. డీప్‌టెక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బ్లాక్‌ చెయిన్, బయోటెక్ వంటి సాంకేతికతలకు సాధారణ పదం. బడ్జెట్ లో ఈ మూడు విషయాలపై స్పష్టత లభిస్తుంది. వాటి కారణంగా ప్రజలు ఉద్యోగాలు కోల్పోకుండా, ప్రత్యామ్నాయాలను కనుగొనే మార్గాలను పరిశీలిస్తుంది.

రోటో ట్యాక్స్ ఎందుకంటే..

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా ఇటీవల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి. పెద్ద కార్పొరోట్ సంస్థలన్నీ ఏఐపై దృష్టి సారిస్తున్నాయి. మానవ శక్తికి బదులుగా దీని వినియోగం పెరుగుతోంది. ఈ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో నైపుణ్యాలు పెంచేందుకు, దాని ఖర్చుల కోసం రోబో ట్యాక్స్ విధించాలనే ప్రతిపాదన వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేపర్ కు అనుగుణంగానే ఈ సూచనలు వస్తున్నాయి. ఏఐ వల్ల కంపెనీలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నప్పటికీ ఉద్యోగాలు మాత్రం తగ్గిపోతాయి. ఇది ఇబ్బంది కలిగించే అంశమని ఐఎమ్ఎఫ్ భావిస్తోంది. అందుకనే నైపుణ్యాభివృద్ధి, నిరుద్యోగ బీమా కవరేజీ, వేతన బీమాలతో పాటు ప్రస్తుత కార్పొరేట్ ట్యాక్స్ లను మరోసారి పరిశీలించాలని ప్రపంచ దేశాలకు సూచించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టెక్ కంపెనీలకు షాక్.. బడ్జెట్లో రోబో ట్యాక్స్! ఉద్యోగులకు భరోసా..
టెక్ కంపెనీలకు షాక్.. బడ్జెట్లో రోబో ట్యాక్స్! ఉద్యోగులకు భరోసా..
డక్‌ వాకింగ్ అంటే ఏంటి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
డక్‌ వాకింగ్ అంటే ఏంటి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
ఊర్వశి డాన్స్ కి మేం ఫిదా! మీ ఫుడ్‌కి నేనెప్పుడో ఫిదా అంటున్న నటి
ఊర్వశి డాన్స్ కి మేం ఫిదా! మీ ఫుడ్‌కి నేనెప్పుడో ఫిదా అంటున్న నటి
రూ.1000 కోట్ల క్లబ్‏లో కల్కి.. అమితాబ్ ఏమన్నారంటే..
రూ.1000 కోట్ల క్లబ్‏లో కల్కి.. అమితాబ్ ఏమన్నారంటే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందంటే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందంటే..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
రైల్లో ఇలా చేస్తే అరెస్టు.. భారత రైల్వే సంచలన నిర్ణయం
రైల్లో ఇలా చేస్తే అరెస్టు.. భారత రైల్వే సంచలన నిర్ణయం
ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనా?
ఆ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందేనా?
రూ. లక్షలోపు ధరలో ఈ-స్కూటర్ అదిరింది.. సింగిల్ చార్జ్‌పై 170కి.మీ
రూ. లక్షలోపు ధరలో ఈ-స్కూటర్ అదిరింది.. సింగిల్ చార్జ్‌పై 170కి.మీ
కోలీవుడ్ కు 1000 కోట్లు కలగానే ఉండబోతుందా..? వాళ్ళ తప్పు ఇదేనా.?
కోలీవుడ్ కు 1000 కోట్లు కలగానే ఉండబోతుందా..? వాళ్ళ తప్పు ఇదేనా.?
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
తెరుచుకున్న రత్న భాండాగారం.. అస్వస్థతకు గురైన ఎస్పీ.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
గుడ్ న్యూస్ ఆ నెలలోనే OTTలోకి కల్కీ మూవీ. | ప్రౌడ్ మూమెంట్ మేడమ్.
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
తెల్లారితే గృహప్రవేశం.. అంతలోనే విషాదం.. ఏం జరిగిందంటే.! వీడియో..
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
Rs. 497/- లకే కేజీ మటన్.. ఫ్రీ గిఫ్ట్‌ కూడా.! ఎగబడిన జనం
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
నాగబంధంతో పాటు జల, క్రిమి, రక్తాక్ష.. అగ్ని బంధాలు.. ప్రత్యేకత.?
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ ఖరీదైనగిఫ్ట్స్‌. రేటు తెలిస్తే షాక్