Airtel recharge plan: ఈ అన్ లిమిటెడ్ ప్లాన్ ఖరీదు రోజుకు రూ.6 కంటే తక్కువే.. ఎయిర్ టెల్ జబర్దస్త్ రీచార్జ్ ప్లాన్

స్మార్ట్ ఫోన్ల వినియోగం దేశంలో సర్వసాధారమైంది. ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు అనుగుణంగా వీటిని వినియోగిస్తున్నారు. పేదల నుంచి సంపన్నుల వరకూ అందరి దగ్గరా ఇవి కనిపిస్తున్నాయి. ఫోన్ల ధరలు అందుబాటులోకి రావడం, పెరిగిన సాంకేతికత నేపథ్యంలో ప్రతి పనికీ ఇవి అవసరమవ్వడం దీనికి ప్రధాన కారణం. అలాగే జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ ఎల్ తదితర టెలికాం నెట్ వర్క్ లు అందిస్తున్న వివిధ ప్లాన్ల ద్వారా ఫోన్లను రీచార్జి చేసుకుని వినియోగించుకోవాలి.

Airtel recharge plan: ఈ అన్ లిమిటెడ్ ప్లాన్ ఖరీదు రోజుకు రూ.6 కంటే తక్కువే..  ఎయిర్ టెల్ జబర్దస్త్ రీచార్జ్ ప్లాన్
Follow us
Srinu

|

Updated on: Dec 03, 2024 | 7:00 PM

ఇటీవల రీచార్జి ప్లాన్ల ధరలను అన్ని టెలికాం నెట్ వర్క్ కంపెనీలు పెంచేశాయి. దీనివల్ల ఫోన్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిల్ టెల్ కొత్త రీచార్జి ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.1999తో రీచార్జి చేసుకుంటే 365 రోజుల పాటు ఏ నెట్ వర్క్ కైనా అపరిమితమితంగా కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లతో పాటు 24 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. రోజుకు ఆరు రూపాయలంటే తక్కువ ఖర్చుతో అన్ లిమిడెట్ ప్లాన్ ను పొందవచ్చు. ఎయిర్ టెల్ నెట్ వర్క్ కు దేశంలో సుమారు 400 మిలియన్ల ఖాతాదారులున్నారు. వారందరి అవసరాలకు తగినట్టుగా ఈ కంపెనీ వివిధ ఆకర్షణీయమైన ప్లాన్లను అమలు చేస్తోంది. ప్రతి ఒక్కరి బడ్జెట్ కు అనుగుణంగా ప్రీమియం ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

దానిలో భాగంగా ఇప్పుడు 365 రోజులు చెల్లుబాటు అయ్యే కొత్త ప్లాన్ ను అమలు చేసింది. కేవలం రూ.1999తో రీచార్జి చేసుకుంటే ఏడాది పాటు ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అంటే నెలకు రూ.170 కన్నా తక్కువ ధరకే అన్ లిమిటెడ్ ప్లాన్ అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది. ప్రైవేటు టెలికాం కంపెనీలు అందిస్తున్న ప్లాన్లలో ఇది అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. ఎయిర్ టెల్ అందిస్తున్న కొత్త రీచార్జి ప్లాన్ లో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 24 జీబీ డేటా లభిస్తుంది. నెలకు 2 జీబీ హై స్పీడ్ డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ పరిమితి దాటితే ఒక ఎంబీ డేటాకు రూ.50 పైసలు చొప్పున ఖర్చవుతుంది. ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లేలో ఉచితంగా టీవీ షోలు, చలన చిత్రాలు, లైవ్ చానళ్లకు యాక్సెస్ ఉంటుంది. మన దేశంలో చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ. వారందరూ డేటాను చాలా పరిమితంగా వినియోగిస్తారు. అలాంటి వారికి ఈ ప్లాన్ చక్కగా సరిపోతుంది.

ఇప్పటి వరకూ జియో, ఎయిర్ టెల్ నెట్ వర్కులు దేశంలో ఆధిపత్యం చెలాయించాయి. ప్రజలకు అందుబాటు ధరలో రీచార్జి, డేటా ప్లాన్లు అమలు చేశాయి. జియో మొదటిసారిగా అపరిమితి డేటా తో ముందుకు రావడంతో దానికి వినియోగదారులు విపరీతంగా పెరిగారు. దాని బాటలోనే మిగిలిన కంపెనీలు నడిచాయి. అయితే ఇటీవల అన్ని టెలికాం కంపెనీలు తమ రీచార్జి ప్లాన్ల ధరలను బాాగా పెంచేశాయి. వాటి కస్టమర్లందరూ షాక్ తిన్నారు. అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రం పాత ధరలనే కొనసాగించింది. దీంతో ఆ సంస్థకు కస్టమర్ల ఆదరణ విపరీతంగా పెరిగింది. ఇతర నెట్ వర్క్ ల నుంచి చాలామంది బీఎస్ఎన్ఎల్ కు మారిపోయారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి