- Telugu News Business Tesla Rival BYD To Launch Seal EV Sedan On March 5, Know Features, Specifications
అరగంటలోనే ఫుల్ ఛార్జ్.! ఏకంగా 570 కిలోమీటర్ల రేంజ్.. దెబ్బకు టెస్లా కారు తోక ముడుచుకోవాల్సిందే..
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టెస్లా, బీవైడీ సంస్థల మధ్య గట్టి పోటీ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెస్లా కంపెనీ భారత్‌లోకి రంగ ప్రవేశం చేయడంతో.. బీవైడీ సంస్థ టెస్లా కార్లను తలదన్నే విధంగా సరికొత్త మోడల్‌లో ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ నుంచి మార్చి 5న 'సీల్ ఎలక్ట్రిక్ సుడాన్' పేరిట మరో ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రానుంది.
Updated on: Feb 26, 2024 | 12:50 PM

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టెస్లా, బీవైడీ సంస్థల మధ్య గట్టి పోటీ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెస్లా కంపెనీ భారత్‌లోకి రంగ ప్రవేశం చేయడంతో.. బీవైడీ సంస్థ టెస్లా కార్లను తలదన్నే విధంగా సరికొత్త మోడల్‌లో ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ నుంచి మార్చి 5న 'సీల్ ఎలక్ట్రిక్ సుడాన్' పేరిట మరో ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రానుంది. ఇది టెస్లా మోడల్ 3తో పోటీపడనుంది. ఇండియన్ రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంటే.. ఈ 'సీల్ ఎలక్ట్రిక్ సుడాన్' పరుగులు పెట్టేందుకు సిద్దమైంది.

ఇప్పటికే BYD సంస్థ రెండు ఎలక్ట్రిక్ కార్లు 'అటో 3 SUV', 'e6 MPV'లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు వచ్చేది ఆ సంస్థకు చెందిన మూడో ఎలక్ట్రిక్ కారు. దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్ల చూసేద్దాం.

BYD సీల్: బ్యాటరీ, రేంజ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారులో 82.5 kWh బ్యాటరీ ప్యాక్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి పూర్తిగా ఫుల్ ఛార్జ్ చేస్తే, ఈ కారు 570 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఇది శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌పై నడుస్తుంది. ఈ కారు కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 km/h వేగాన్ని అందుకోగలదు.

BYD సీల్: ఛార్జింగ్, పనితీరు BYD నుంచి రాబోయే ఎలక్ట్రిక్ సుడాన్ బరువు 2,055 కిలోలు. ఈ కారు బ్యాటరీలో కంపెనీకి చెందిన బ్లేడ్ టెక్నాలజీని ఉపయోగించారు. 150kW వరకు ఛార్జింగ్ వేగంతో ఈ కారు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. కేవలం 26 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ 11kW AC ఛార్జర్‌తో సీల్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 8.6 గంటలు పడుతుంది.

BYD సీల్: ఫీచర్లు ఈ కారు డ్యూయల్ మోటార్‌తో AWD వేరియంట్‌లో కూడా అందుబాటులోకి రావచ్చు. ఈ మోడల్ ఫుల్ ఛార్జింగ్‌పై 520 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గ్లాస్ రూఫ్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్లు, నాలుగు బూమరాంగ్ షేప్ LED DRLలు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, ఫుల్ వైడ్ LED లైట్ బార్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

BYD సీల్ ఎలక్ట్రిక్ సుడాన్ 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు దాదాపు రూ. 50లక్షల(ఎక్స్-షోరూమ్) ధరతో లభించనుంది. BYD డీలర్‌షిప్‌లలో అనధికారిక బుకింగ్ ఇప్పటికే జరుగుతోంది.




